మీరు కొనబోయే కొత్త కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 10 ఫీచర్లు

By Ravi

ఎవరైనా కారు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా రీసెర్చ్ చేస్తారు. ఏ కారును కొనాలి, బడ్జెట్ ఎంత, ఆ కారులో లభించే ఫీచర్లు ఏంటి, ఏ షోరూమ్‌లో బెస్ట్ ప్రైజ్ దొరుకుంతుది, కారుపై ఏమేమీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని చివరిగా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కారును కొనుగోలు చేయటం జరుగుతుంది.

మరిన్ని 'టాప్ 10' కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

ఇదంతా బాగానే ఉంది.. కానీ కారును కొనేటప్పుడు అందులో కొన్ని తప్పనిసరిగా ఉండాల్సి ఫీచర్ల గురించి ఈరోజు మనం కార్ టాక్ శీర్షికలో తెలుసుకుందాం రండి. భారత మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని ఎంట్రీ లెవల్ కార్లలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫీచర్లు ఉండకపోవచ్చు. కానీ, ఇవి ఆప్షనల్‌గా లభిస్తాయి. కారులో వీటిని ఏర్పాటు చేసుకుంటే మన ప్రయాణం మరింత సుఖవంతంగా, సురక్షితంగా మరియు సౌకర్యంగా ముందుకు సాగిపోతుంది. అవేంటో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కొత్త కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 10 ఫీచర్లు

తర్వాతి స్లైడ్‌లలో కొత్త కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 10 ఫీచర్ల గురించి తెలుసుకోండి.

1. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

1. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

కొత్త కారులో ఏబిఎస్ తప్పనిసరిగా ఉండాలి. దాదాపు అన్ని టాప్-ఎండ్ వేరియంట్లలో ఈ ఫీచర్ లభిస్తుంది. ఏబిఎస్ అత్యవసర పరిస్థితుల్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్ వేసినప్పుడు కారు రోడ్డుపై నుంచి జారిపోకుండా ఉండటంలో ఏబిఎస్ సహకరిస్తుంది. సాధారణం బ్రేకింగ్ సిస్టమ్‌లో సడెన్‌గా బ్రేక్స్ అప్లయ్ చేసినప్పుడు వీల్ లాక్ అయ్యి, టైర్లు రోడ్డును రాచుకుంటూ జారిపోతాయి. కానీ ఏబిఎస్ కలిగిన కార్లలో సడెన్ బ్రేక్స్ వేసినప్పుడు ఈ సిస్టమ్ వీల్ లాక్ కాకుండానే బ్రేకులు అప్లయ్ అయ్యేలా చేసి బ్రేకింగ్ దూరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, ఈ సెక్యూరిటీ ఫీచర్ కొత్త కార్లలో తప్పనిసరిగా ఉండాలి.

2. ఎయిర్‌బ్యాగ్స్

2. ఎయిర్‌బ్యాగ్స్

ఎయిర్‌బ్యాగ్స్.. కారులో ఇవి సంజీవిని లాంటివి. అత్యవసర సమయంలో కారులోని ప్రయాణీకులను రక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వేగంగా వెళ్తున్న కారు ఏదైనా వస్తువును/వాహనాన్ని ఢీకొట్టినప్పుడు కారు ఎయిర్ బ్యాగ్ విచ్చుకోవటానికి కేవలం 40 మిల్లీసెకండ్లు మాత్రమే (1 సెకండులో 1000 మిల్లీసెకండ్లు ఉంటాయి). అంటే, మనం కనురెప్ప మూసి ఆర్పే సమయం కన్నా కూడా ఎన్నోరెట్లు తక్కువ వేగంలోనే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకుని కారులోని ప్రయాణికులను ప్రమాదంలో రక్షణ కవచంగా నిలుస్తుందన్నమాట. ఈ ఫీచర్ కూడా టాప్-ఎండ్ వేరియంట్లలో లభిస్తుంది.

3. బ్లూటూత్/హ్యాండ్స్ ఫ్రీ

3. బ్లూటూత్/హ్యాండ్స్ ఫ్రీ

కారులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటే మంచిది. దీని వలన మొబైల్ ఫోన్‌ను హ్యాండ్సీ ఫ్రీగా ఆపరేట్ చేయటమే కాకుండా బ్లూటూత్ సౌక్యరం కలిగిన మ్యూజిక్ గ్యాడ్జెట్ల నుంచి సంగీతాన్ని నేరుగా కారులోని ఆడియో సిస్టమ్ ద్వారా ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి వెసలు బాటు లేని కారును ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే, ఆఫ్టర్ మార్కెట్లో కానీ లేదా అధీకృత షోరూమ్‌లలో కానీ లభించే అదనపు బ్లూటూత్ కార్ కిట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇదొక మంచి కంఫర్టబల్ ఫీచర్.

4. కారులో 12వోల్ట్ పవర్ సాకెట్

4. కారులో 12వోల్ట్ పవర్ సాకెట్

ప్రస్తుతం చాలా మంది కార్ వినియోగదారులు మొబైల్ ఫోన్లతో పాటుగా వివిధ రకాల హ్యాండ్ గ్యాడ్జెట్లను వినియోగిస్తున్న సంగతి తెలిసినదే. అలాంటి వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ గ్యాడ్జెట్లను కారులోని 12 వోల్ట్ పవర్ సాకెట్ సాయంతో చార్జ్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా కారులో ఫోన్ ద్వారా జిపిఎస్ ఉపయోగిస్తున్నప్పుడు మొబైల్ బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుంటుంది కాబట్టి అలాంటి సమయాల్లో ఈ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఇందుకోసం ప్రత్యేక కార్ చార్జర్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

5. ఫాగ్ ల్యాంప్స్

5. ఫాగ్ ల్యాంప్స్

ఎంట్రీ లెవల్ వేరియంట్లలో కార్ కంపెనీలు ఫాగ్ ల్యాంప్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయరు. కానీ టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రం ఈ ఫీచర్ లభిస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ ఉపయోగం అంతా ఇంతా కాదు. రాత్రివేళల్లో ఇది రోడ్డుపై కాంతిని పెంచడమే కాకుండా ప్రత్యేకించి వర్షాకాలం, శీతాకాలంలో సమమయంలో రోడ్డుపై విజిబిలిటీని పెంచేందుకు ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్లలో ఫాగ్ ల్యాంప్స్ లేకపోయినప్పటికీ, వాటిని అమర్చుకునే వెసలుబాటు మాత్రం ఉంటుంది. కాబట్టి, వీలున్నప్పడు ఫాగ్ ల్యాంప్స్‌ను అమర్చుకుంటే మంచిది.

6. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్

6. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్

పార్కింగ్ సెన్సార్స్ లేదా పార్కింగ్ కెమరా వలన కారును సురక్షితంగా రివర్స్ చేయటం సాధ్యమవుతుంది. చాలావరకు కార్లలో ఈ సిస్టమ్ లభించదు, కానీ ఇది ఆప్షనల్ యాక్ససరీగా అన్ని అధీకృత కార్ షోరూమ్‌లలోను అందుబాటులో ఉంటుంది. కేవలం పార్కింగ్ సెన్సార్లను మాత్రమే అమర్చుకుంటే, డ్యాష్ బోర్డుపై లేదా ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌పై డిజిటల్ డిస్‌ప్లే ద్వారా వార్నింగ్ సిగ్నల్స్ వస్తుంటాయి. అదే పార్కింగ్ కెమెరాను అమర్చుకుంటే, ఎల్‌సిడి స్క్రీన్‌పై కారు వెనుక వైపు పరిసరాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి, సేఫ్‌గా కారును రివర్స్ చేయాలంటే ప్రతికారులో రివర్స్ పార్క్ అసిస్ట్ ఉండటం ఎంతో అవసరం. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

7. హైట్ అడ్జస్టబల్ సీట్స్

7. హైట్ అడ్జస్టబల్ సీట్స్

దాదాపు అన్ని ఎంట్రీ లెవల్ కార్లలో ఈ ఫీచర్ ఉండకపోవచ్చు. తక్కువ ధర కలిగిన కార్లలో లంబార్ సపోర్ట్ (సీటును ముందుకు, వెనుకకు జరుపుకునేందుకు వీలున్న వ్యవస్థ)తో లభిస్తాయి. కానీ, పొట్టిగా ఉండేవారి కోసం ఈ లంబార్ సపోర్ట్ వలన ఉపయోగం ఉండదు, అలాంటి వారికి హైట్ అడ్జస్టబల్ సీట్ అవసరం. అలాగే, పొడవుగా ఉన్న వారికి కూడా హైట్ అడ్జస్టబల్ సీట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీని వలన రోడ్డుపై మార్జిన్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

8. అల్లాయ్ వీల్స్

8. అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్ కారుకు బయటి వైపు నుంచి అందమైన లుక్‌ని ఇస్తాయి. స్టాండర్డ్ స్టీల్ వీల్స్‌తో పోల్చుకుంటే అల్లాయ్ వీల్స్‌ను క్లీన్ చేసుకోటవటం కూడా చాలా సులువు. మెరుస్తూ ఉండే అల్లాయ్ వీల్స్ ఎల్లప్పుడూ కారుకు కొత్తదనాన్ని తెచ్చిపెడుతాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్లలో ఈ ఫీచర్ లభించకపోవచ్చు, కానీ టాప్ ఎండ్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఆఫ్టర్ మార్కెట్ అల్లాయ్ వీల్స్ కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. కారు కొన్న కొంత కాలానికైనా వీటిని మార్చుకోవచ్చు.

9. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

9. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

కారు డ్యాష్‌బోర్డుపై ఉంజే పలు ఫీచర్లను ప్రతిసారి చేతితో ముందు సాగి కంట్రోల్ చేయటం కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే, నేటి ఆధునిక కార్లలో ఇలాంటి యాక్సిసబల్ స్విచ్‌‌లన్నింటినీ కారు స్టీరింగ్ వీల్‌కే అమర్చేస్తున్నారు. ఉదాహరణకు మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ తగ్గించాలన్నా లేదా ఫోన్ కాల్ ఆన్సర్ చేయాలన్నా, రేడియో స్టేషన్ మార్చాలా ఇలా అనేక కంట్రోల్స్‌ను స్టీరింగ్ వీల్‌పై అమర్చుతున్నారు. ఆటోమేటిక్ కార్లలో అయితే స్టీరింగ్ వీల్ సాయంతోనే గేర్లను కూడా మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. కాబట్టి, కారు కొనుగోలు విషయంలో కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారు, తాము కొనుగోలు చేయబోయే కారులో ఈ ఫీచర్ ఉందో లేదో తెలుసుకోవాలి.

10. అడ్జస్టబల్ స్టీరింగ్

10. అడ్జస్టబల్ స్టీరింగ్

మోడ్రన్ కార్లలో పవర్ స్టీరింగ్‌తో పాటుగా స్టీరింగ్‌ను డ్రైవర్ పొజిషన్‌కు తగినట్లుగా సర్దుబాటు చేసుకునే వెసలు బాటు కూడా ఉంటోంది. టెలిస్కోపిక్ స్టీరింగ్‌లను ముందుకు లేదా వెనుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్ట్ స్టీరింగ్‌లను పైకి లేదా క్రిందకు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ నేటి కార్లలో ఈ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కారు డ్రైవర్ సీట్‌లో కూర్చున్న తర్వాత స్టీరింగ్‌ను డ్రైవర్ సౌకర్యానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు. కారును కొనుగోలు చేసేటప్పుడు అందులో అడ్జస్టబల్ స్టీరింగ్ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకోవాలి.

కొత్త కారులో తప్పనిసరిగా ఉండాల్సిన 10 ఫీచర్లు

కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు అందులో ఇప్పటి వరకు చెప్పుకున్న ఫీచర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. స్టాండర్డ్‌గా లభించని కొన్ని ఎక్విప్‌మెంట్స్‌ను ఆఫ్టర్ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Knowing key vehicle features and making sure these features are a part of the vehicle we purchase. Let us us go through a small list of some features that we think are essential for Indian conditions. 
Story first published: Wednesday, July 23, 2014, 19:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X