సెప్టెంబర్ 2014 నెలలో అమ్ముడైన 'టాప్ 20' కార్లు!

By Ravi

పండుగ సీజన్‌లో కన్జ్యూమర్ సెంటిమెంట్ పెరగాల్సి ఉన్నప్పటికీ, అధిక ఇంధన ధరలు, అందని వడ్డీ రేట్ల నేపథ్యంలో గడచిన నెలలో కూడా కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగాయి. దిగిరాని ద్రవ్యోల్బణం, సామాన్యుడికి అందుబాటులోని వాహన రుణాలు, అస్థిరమైన స్టాక్ మార్కెట్, రూపాయి మారకపు విలువ తదితర అంశాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెను సవాళ్లుగా మారుతున్నాయి.

ఏదేమైనప్పటికీ, గడచిన అక్టోబర్ నెలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ల తయారీదారులు, డీలర్లు తమ ఉత్పత్తులపై అందించిన తగ్గింపులు, వివిధ ప్రోత్సాహకాలతో ఇదివరకటి నెలలతో పోల్చుకుంటే, సెప్టెంబర్ 2014 అమ్మకాలు ఓ రకంగా మెరుగుపడ్డాయనే చెప్పాలి. మొత్తమ్మీద చూసుకుంటే గడచిన నెలలో కార్ల అమ్మకాల తీరు మిశ్రమంగా ఉంది.

మరి సెప్టెంబర్ 2014 నెలలో అమ్ముడైన టాప్ 20 కార్ మోడళ్లు ఏవో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

మారుతి ఆల్టో

మారుతి ఆల్టో

మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో ఎప్పటిలాగే సెప్టెంబర్ 2014 నెలలో కూడా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. గడచిన నెలలో మొత్తం 19,906 ఆల్టో కార్లు (ఆల్టో 80, ఆల్టో కె10 రెండూ కలిపి) అమ్ముడుపోయాయి.

స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ డిజైర్

ఆల్టో హ్యాచ్‌బ్యాక్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు స్విఫ్ట్ డిజైర్. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 18,185 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కార్లు అమ్ముడుపోయాయి.

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

సెప్టెంబర్ 2014 నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగానే సాగాయి. గడచిన నెలలో మొత్తం 17,265 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి.

వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్

ఈ టాప్ 20 కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. సెప్టెంబర్ 2014 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు 15,641 యూనిట్లుగా నమోదయ్యాయి.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అధునాతన ఎలైట్ ఐ20 మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 2014లో మొత్తం 8,903 యూనిట్ల ఐ20 కార్లు అమ్ముడుపోయాయి. ఈ జాబితాలో ఇది 5వ స్థానంలో ఉంది.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో ఎప్పటి మాదిరిగానే కంపెనీకి ఎవర్‌గ్రీన్ మోడల్‌గా నిలిచింది. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 8,541 బొలెరో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ గ్రాండ్

హ్యుందాయ్ గ్రాండ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ఐ10 గ్రాండ్ అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 7,285 ఐ10 గ్రాండ్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి ఓమ్నీ

మారుతి ఓమ్నీ

మారుతి సుజుకి అందిస్తున్న ఓమ్నీ ఎమ్‌పివి అమ్మకాలు సెప్టెంబర్ 2014 నెలలో జోరందుకున్నాయి. గడచిన నెలలో మొత్తం 6,659 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ రాకతో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 6,489 హ్యుందాయ్ ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సెలెరియో

మారుతి సెలెరియో

మారుతి సుజుకి ఇండియా మొట్టమొదటి సారిగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో ప్రవేశపెట్టిన సెలెరియో అమ్మకాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన సెప్టెంబర్ 2014 నెలలో 6,382 సెలెరియో కార్లు అమ్ముడుపోయాయి.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ స్కార్పియో అమ్మకాలు జోరందుకున్నాయి. గడచిన సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 6,060 స్కార్పియోలు అమ్ముడయ్యాయి.

టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవా

ఎమ్‌పివి సెగ్మెంట్లో లీడర్‌గా ఉన్న టొయోటా ఇన్నోవా అమ్మకాలు, గడచిన నెలలో స్వల్పంగా కోలుకున్నాయి. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 5,876 యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడయ్యాయి.

మారుతి ఎర్టిగా

మారుతి ఎర్టిగా

టొయోటా ఇన్నోవాకు సమీప పోటీదారు అయిన మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు కూడా స్థిరంగానే సాగుతున్నాయి. సెప్టెంబర్ 2014లో మొత్తం 5,672 ఎర్టిగా ఎమ్‌పివిలు అమ్ముడుపోయాయి.

హోండా మొబిలియో

హోండా మొబిలియో

ఎమ్‌పివి సెగ్మెంట్లో ఇన్నోవా, ఎర్టిగాలతో పోటీగా మొబిలియో కూడా అమ్ముడుపోతోంది. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 5,329 హోండా మొబిలియో ఎమ్‌పివిలు అమ్ముడుపోయాయి.

మారుతి ఈకో

మారుతి ఈకో

మారుతి సుజుకి విక్రయిస్తున్న ఈకో మల్టీ యుటిలిటీ వాహన అమ్మకాలు కూడా సెప్టెంబర్ 2014లో జోరందుకున్నాయి. ఈ సమయంలో కంపెనీ 5,204 మారుతి ఈకో వాహనాలు అమ్ముడుపోయాయి.

హోండా సిటీ

హోండా సిటీ

హోండా ప్రవేశపెట్టిన రిఫ్రెష్డ్ సిటీ సెడాన్ కస్టమర్లను చక్కగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 4,599 హోండా సిటీ సెడాన్ కార్లు అమ్ముడుపోయాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

ఫోర్డ్ ఇండియా అందిస్తున్న ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 4,515 ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్ అమ్మకాలు కూడా స్థిరంగానే సాగుతున్నాయి. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 4,481 హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కార్లు అమ్ముడుపోయాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్‌ల అమ్మకాలు పోటాపోటీగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 3,848 హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కార్లు అమ్ముడుపోయాయి.

రెనో డస్టర్

రెనో డస్టర్

ఇక చివరిగా ఈ జాబితాలో 20వ స్థానంలో నిలిచింది రెనో డస్టర్. సెప్టెంబర్ 2014 నెలలో మొత్తం 3,410 రెనో డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

Most Read Articles

English summary
Domestic passenger car sales declined 1.03 per cent to 1,54,882 units in September from 1,56,494 units in the year-ago month according to data released by the Society of Indian Automobile Manufacturers (SIAM). Here is the top 20 list of cars sold in India during the month of September 2014.
Story first published: Monday, October 13, 2014, 17:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X