2014లో మార్కెట్ నుంచి మాయమైన టాప్ 5 కార్లు

By Ravi

మొత్తానికి మరో సంవత్సరం గడిచిపోయింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో 2014 సంవత్సరం, కార్ మేకర్లకు మిశ్రమ ఫలితాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు.. భారత కార్ ప్రియులకు ఇదొక మర్చిపోలేని సంవత్సరం కూడాను. మనదేశ ఆటోమొబైల్ చరిత్రలో సరికొత్త మార్పుకి ఒరవడి తెచ్చిన మారుతి ఎమ్800, హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ వంటి కార్లు చరిత్రలో కలిసిపోయింది కూడా 2014వ సంవత్సరంలోనే.

స్టేటస్ సింబల్ కారుగా, పబ్లిక్ టాక్సీగా, విఐపి వాహనంగా, ప్రభుత్వ అధికారిక వాహనంగా సేవలు అందించిన అంబాసిడర్ కారును హిందుస్థాన్ మోటార్స్, 2014వ సంవత్సరంలో భారత మార్కెట్ నుంచి తొలగించి వేసింది. ఎంతో మంది టాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పించిన ఈ కారు మార్కెట్ నుంచి తొలగిపోవటం విచారకరమే. అలాగే, అసలు కారు అంటే ఇలా ఉందని భారతీయులకు తెలియజేసిన మారుతి 800 కూడా ఇదే సంవత్సరంలో చరిత్రలో ఓ పేజీగా మిగిలిపోయింది.

ఇవే కాకుండా.. మరో మూడు పాపులర్ కార్లు కూడా 2014లో భారత మార్కెట్ నుంచి తొలగిపోయాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2014లో మాయమైన టాప్ 5 కార్లు

తర్వాతి స్లైడ్‌లలో 2014లో భారత మార్కెట్ నుంచి తొలగిపోయిన టాప్ 5 కార్ల గురించి తెలుసుకోండి.

1. మారుతి 800

1. మారుతి 800

భారత ప్యాసింజర్ కార్ చరిత్రలో, ఓ చెరగని మైలురాయిగా నిలిచిన కారు 'మారుతి ఎమ్800'. మధ్య తరగతి ప్రజల కలల కారుగా భారతీయుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న ఈ చిన్న కారు ఉత్పత్తిని కంపెనీ జనవరి 18, 2014వ తేదీన నిలిపివేసింది. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నదే చిట్టచివరి ఫైర్‌బ్రిక్ రెడ్ కలర్ మారుతి ఎమ్800. ఈ కారును గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేసేవారు.

2014లో మాయమైన టాప్ 5 కార్లు

మొట్టమొదటి మారుతి 800 కారును 1983వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని ఓ జంటకు డెలివరీ చేశారు. ఈ 31 ఏళ్ల కాలంలో, మారుతి 800 సుమారు 25 లక్షల మందికి పైగా వినియోగదారుల ముఖాలపై చిరునవ్వులను చిందించేలా చేసింది. రూప లావణ్యాల పరంగా మారుతి 800 ఈ 3 దశాబ్ధాల కాలంగా ఎన్నో మార్పులు పొందినప్పటికీ, ఇంజన్ పరంగా మరియు కాలుష్య నిబంధనల పరంగా మాత్రం అప్‌గ్రేడ్ కాలేకపోయింది. మారుతి 800 మార్కెట్ నుంచి తొలగిపోవటానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం.

2. అంబాసిడర్

2. అంబాసిడర్

భారత ఆటోమొబైల్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మేడ్ ఇన్ ఇండియా హిందుస్థాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారు కూడా ఒకటి. సామాన్యుడి టాక్సీగా, విఐపిల భద్రతా వాహనంగా, మధ్యతరగతి ప్రజల మనోరథంగా ఓ వెలుగు వెలిగిన అంబాసిడర్ కారు ఉత్పత్తిని కంపెనీ మే 2014లో నిలిపివేసింది. ఈ కారును పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్‌లో తయారు చేసేవారు. మారుతున్న మార్కెట్ ట్రెండ్, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేయటంలో కంపెనీ విఫలం కావటం వల్లనే అంబాసిడర్ మార్కెట్ నుంచి తొలగిపోవటానికి ప్రధాన కారణం.

2014లో మాయమైన టాప్ 5 కార్లు

'హిందూస్తాన్ 10' పేరుతో హిందుస్తాన్ మోటార్స్ తొలి అంబాసిడర్‌ను ఉత్పత్తి చేసింది. అప్పట్లో ఈ కారు కంపెనీకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆకర్షనీయమైన రూపం, పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని భద్రతలు ఈ కారును నెంబర్ వన్‌గా నిలిపాయి. అంబాసిడర్ కారును 'కింగ్ ఆఫ్ ది ఇండియన్ రోడ్స్' (భారత రోడ్లకు రారాజుగా) అభివర్ణించేవారు. 1980 వరకూ భారత్‌లో అమ్ముడయ్యే ప్రతీ కారు అంబాసిడర్ కారే కావడం విశేషం. 2004వ సంవత్సరంలో 90,000 లకు పైగా అంబాసిడర్ కార్లు ఉత్పత్తయ్యాయి. అప్పట్లో ఇదో పెద్ద రికార్డ్.

3. మారుతి సుజుకి ఏ-స్టార్

3. మారుతి సుజుకి ఏ-స్టార్

గడచిన సంవత్సరంలో మార్కెట్ నుంచి తొలగిపోయిన మరో పాపులర్ మారుతి కారు ఏ-స్టార్. అత్యంత చవకైన ఆటోమేటిక్ పెట్రోల్ కారుగా ఆరంభంలో మంచి మార్కులు తెచ్చుకున్న ఏ-స్టార్ హవా క్రమేనా తగ్గుతూ వచ్చింది. వాస్తవానికి మారుతి ఏ-స్టార్ భారత మార్కెట్లో కన్నా అంతర్జాతీయ మార్కెట్లలోనే (ప్రత్యేకించి యూరప్ మార్కెట్లలో) ఎక్కువగా అమ్ముడుపోయేది.

2014లో మాయమైన టాప్ 5 కార్లు

మారుతి సుజుకి ఏ-స్టార్ లోటును భర్తీ చేసేందుకు కంపెనీ ఏ-విండ్ పేరుతో ఆవిష్కరించిన కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని సెలెరియో పేరుతో ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌ను విడుదల చేసింది. మారుతి ఏ-స్టార్ కన్నా మారుతి సెలెరియో అనతి కాలంలోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మారుతి ఏ-స్టార్ కారును తొలిసారిగా 2008లో మార్కెట్లో విడుదల చేశారు.

4. మారుతి జెన్ ఎస్టిలో

4. మారుతి జెన్ ఎస్టిలో

గత 2014లో మార్కెట్ నుంచి తొలగిపోయిన మరో మారుతి కారు జెన్ ఎస్టిలో (Zen Estilo). ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో ఉండకపోవటంతో, కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ సెగ్మెంట్లో ఎత్తుగా ఉండే వ్యాగన్ఆర్, రిట్జ్ వంటి కార్లు పాపులారిటీని దక్కించుకుంటే, జెన్ ఎస్టిలో మాత్రం తమ ప్రాచుర్యాన్ని కోల్పోతూ వచ్చింది.

2014లో మాయమైన టాప్ 5 కార్లు

మారుతి సుజుకి గతంలో అందించిన జెన్ మోడల్‌ను రీప్లేస్ చేస్తూ 2007వ సంవత్సరంలో జెన్ ఎస్టిలో మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. అయితే, అప్పట్లో ఈ మోడల్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో 2009లో ఈ మోడల్‌ను మరోసారి రిఫ్రెష్ చేసింది. పాత 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.0 కె10 ఇంజన్‌ను ప్రవేశపెట్టినప్పటికీ దీని జోరు మాత్రం పెరగలేదు. దీంతో జెన్ ఎస్టిలోకు మారుతి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసింది.

5. మారుతి సుజుకి ఎస్ఎక్స్4

5. మారుతి సుజుకి ఎస్ఎక్స్4

గడచిన సంవత్సరం భారత కార్ మార్కెట్ నుంచి తొలగిపోయిన మరో పాపులర్ మోడల్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4. మారుతి సుజుకి నుంచి మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా 'ఎస్ఎక్స్4', సరికొత్త సియాజ్ (Ciaz) రాకతో మార్కెట్ నుంచి కనుమరుగైంది. మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నప్పటికీ, ఈ సెగ్మెంట్లో కొత్త వచ్చిన 2014 హోండా సిటీ, ఫ్లూయిడిక్ హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్ల కారణంగా దీని అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

2014లో మాయమైన టాప్ 5 కార్లు

మారుతి సుజుకి తమ ఎస్ఎక్స్4 సెడాన్‌ను తొలిసారిగా 2007లో 1.6 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌తో భారత విపణిలో విడుదల చేశారు. ఆ తర్వాత కంపెనీ అదే ఇంజన్‌ను వివిటి (వేరియబల్ వాల్వ్ టైమింగ్)తో అప్‌డేట్ చేసి ఇంజన్ పవర్‌ను 105 పిఎస్‌లకు పెంచింది. మారుతి 2010లో ఎస్ఎక్స్4లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత 2011లో ఎస్ఎక్స్4లో కంపెనీ డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 1.3 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్, 90 పిఎస్ పవర్ డీజిల్ ఇంజన్‌తో లభ్యమయ్యేది.

షెవర్లే స్పార్క్.. హ్యుందాయ్ శాంత్రో..

షెవర్లే స్పార్క్.. హ్యుందాయ్ శాంత్రో..

జనరల్ మోటార్స్ అందిస్తున్న షెవర్లే స్పార్క్, హ్యుందాయ్ శాంత్రో మోడళ్లు కూడా మార్కెట్ నుంచి తొలగిపోనున్నాయి. వాస్తవానికి కంపెనీ ఈ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, వీటి స్టాక్ క్లియర్ అయ్యేంత వరకూ ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Here is the list of top 5 cars that were discontinued in India in 2014. Take a look.
Story first published: Thursday, January 1, 2015, 17:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X