2014లో విడుదలైన టాప్ బెస్ట్ కార్లు

By Ravi

గడచిన సంవత్సరంలో కార్ల అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, కార్ కంపెనీలు కొత్త కార్ల విడుదల చేయటం ఆపలేదు. మరికొద్ది రోజుల్లో ముగియనున్న 2014 సంవత్సరంలో అనేక చెప్పుకోదగిన కార్లు మార్కెట్లో విడుదలయ్యాయి.

మారుతి సుజుకి సెలెరియో, సియాజ్, ఆల్టో కె10 వంటి చక్కటి కార్లను విడుదల చేయగా, హ్యుందాయ్ ఎక్సెంట్, ఎలైట్ ఐ20 వంటి అందమైన కార్లను విడుదల చేసింది. టాటా మోటార్స్ కూడా తమ బోరింగ్ డిజైన్‌కు స్వస్తి చెబుతూ సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో కూడిన జెస్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మొత్తమ్మీద చూసుకుంటే, 2014లో స్టన్నింగ్ కార్ మోడళ్లు విడుదలయ్యాయి.

మరి 2014లో విడుదలైన కార్లలో టాప్ బెస్ట్ మోడళ్లు ఏంటో తెలుసుకుందాం రండి..!

2014లో విడుదలైన టాప్ బెస్ట్ కార్లు

తర్వాతి స్లైడ్‌లలో 2014లో విడుదలైన కార్లలో టాప్ బెస్ట్ మోడళ్లు ఏంటో చూడండి.

1. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్

1. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్

జపనీస్ కార్ కంపెనీ హోండా తమ సరికొత్త సిటీ సెడాన్‌ను జనవరి 2014లో మార్కెట్లో విడుదల చేసింది. హోండాకు భారత్‌లో ఇది రెండవ డీజిల్ కారు (మొదటిది హోండా అమేజ్). పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్ 1.5 లీటర్ ఐ-డిటెక్ (అమేజ్‌లో ఉపయోగించినది) ఇంజన్‌ను ఉపయోగించారు.

పెట్రోల్ వెర్షన్లో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. డీజిల్ వెర్షన్లో అధునాతన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

2. ఫియట్ లీనియా ఫేస్‌లిఫ్ట్

2. ఫియట్ లీనియా ఫేస్‌లిఫ్ట్

ఈ ఏడాది మార్చ్ నెలలో ఫియట్ ఇండియా తమ సరికొత్త 2014 వెర్షన్ ఫియట్ లీనియా సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2014 ఫియట్ లీనియా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో యాక్టివ్, డైనమిక్ మరియు ఎమోషన్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. ముందువైపు సరికొత్త బంపర్, పెద్ద ఎయిర్ డ్యామ్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, మరింత క్రోమ్ ఫినిషింగ్, కొత్త గ్రిల్‌తో ఇది సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది.

కొత్త ఫియట్ లీనియా ఇంటీరియర్లలో కూడా ప్రధానమైన మార్పులను గమనించవచ్చు. ముందుగా.. డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ఆక్స్ఇన్ సపోర్ట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త డబుల్ డిన్ ఆడియో సిస్టమ్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. హెచ్‌విఏసి (హీటర్/ ఎయిర్ కండిషనింగ్) కంట్రోల్స్ మాత్రం ఇదివరకటి లీనియాలో మాదిరిగానే ఉంటుంది.

3. డాట్సన్ గో

3. డాట్సన్ గో

ఈ మార్చ్ 2014లో నెలలో నిస్సాన్‌కు చెందిన పురాతన కార్ బ్రాండ్ డాట్సన్ భారత్‌లో తమ తొలి కారు 'గో' హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.3.12 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే ఈ మోడల్‌ను విడుదల చేశారు. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. డాట్సన్ గో మొత్తం 3 వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి ఆల్టో కె10, హ్యుందాయ్ ఇయాన్ వంటి చిన్న కార్లకు పోటీనిస్తోంది.

నిస్సాన్ మైక్రాలో అమర్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ (గేర్‌బాక్స్)తో లభ్యం కానుంది. ఇది లీటరుకు 20.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) కంపెనీ పేర్కొంది.

4. రెనో ఫ్లూయెన్స్ ఫేస్‌లిఫ్ట్

4. రెనో ఫ్లూయెన్స్ ఫేస్‌లిఫ్ట్

మార్చ్ 2014లో రెనో ఇండియా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఫ్లూయెన్స్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2014 రెనో ఫ్లూయెన్స్ సెడాన్ కేవలం రెండు వేరియంట్లలో (ఈ2, ఈ4) మాత్రమే లభ్యమవుతోంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉంది. ఈ కొత్త రెనో ఫ్లూయెన్స్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో చెప్పుకోదగిన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

5. ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్

5. ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఇండియా గడచిన ఏప్రిల్ నెలలో కొత్త 2014 వెర్షన్ ఎండీవర్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రిఫ్రెష్డ్ డిజైన్‌తో వచ్చిన ఈ కొత్త 2014 ఫోర్డ్ ఎండీవర్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. ఈ ఆల్-టెర్రైన్ ఎస్‌యూవీ మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. మూడు వరుల సీటింగ్ కెపాసిటీ (7 సీటర్), విశాలమైన లెగ్‌రూమ్, ప్రీమియం లెథర్ సీట్స్, లేటెస్ట్ శాట్‌నావ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్, బ్లూటూత్ ఆడియో కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా అనేక విలాసవంతమైన ఫీచర్లు ఈ ఎస్‌యూవీ సొంతం.

6. టొయోటా ఎతియోస్ క్రాస్

6. టొయోటా ఎతియోస్ క్రాస్

2014లో వచ్చిన బెస్ట్ కార్లలో టొయోటా ఎతియోస్ క్రాస్ కూడా ఒకటి. గడచిన మే నెలలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో తమ మొట్టమొదటి క్రాసోవర్ 'ఎతియోస్ క్రాస్' (Etios Cross)ను విడుదల చేసింది. భారత మార్కెట్లో ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (2 పెట్రోల్, 1 డీజిల్) లభ్యం కానుంది.

7. టొయోటా కరోలా ఆల్టిస్

7. టొయోటా కరోలా ఆల్టిస్

గడచిన మే నెలలో టొయోటా నుంచి వచ్చిన మరో కొత్త మోడల్ కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్. ఈ కొత్త కరోలా ఆల్టిస్ 11వ తరానికి చెందినది. కొత్త కరోలా ఆల్టిస్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో ప్రధానమైన మార్పులు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ వెర్షన్‌లో 7-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

డీజిల్ వెర్షన్‌లో వేరియబల్ నాజల్ టర్బోతో కూడిన 1.4 లీటర్ 1ఎన్‌డి డి-4డి ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ అందుబాటులో లేదు.

8. ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్

8. ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది జూన్ నెలలో తమ కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫియస్టా కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో, మూడు వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది. కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ డీజిల్ వెర్షన్‍‌లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కానీ, చెప్పుకోదగిన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

ఆస్టన్ మార్టిన్ స్టయిల్ లాంటి గ్రిల్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్‌లో ఉపయోగిస్తున్న 1.5 లీటర్, టిడిసిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

9. నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

9. నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్

ఈ ఏడాది జులై నెలలో నిస్సాన్ తమ సన్నీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త నిస్సాన్ సన్నీ 8 వేరియంట్లలో (3 పెట్రోల్, 5 డీజిల్). కొత్త నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇంజన్స్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు లేవు.

ఇందులో ప్రధానంగా, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్, గ్రిల్, వీల్స్ బంపర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను చూడొచ్చు. అలాగే ఇంటీరియర్స్‌లో పియానో బ్లాక్ ఫినిష్డ్ సెంటర్ కన్సోల్, కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, సీట్స్ అండ్ డోర్స్‌పై రిఫ్రెష్డ్ ఫ్యాబ్రిక్ వంటి అనేక మార్పులున్నాయి.

10. ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్

10. ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ ఏడాది జులై నెలలో తమ కొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ దక్కించుకున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇండియన్ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. పాత పోలోతో పోల్చుకుంటే కొత్త పోలో కారులో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌డేట్స్ ఉన్నాయి.

కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, ఫాగ్ ల్యాంప్స్, కార్నింగ్ లైట్స్, కొత్త హెడ్‌లైట్స్, కొత్త రియర్ బంపర్, కొత్త వీల్ కవర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ (టాప్-ఎండ్ వేరియంట్లో), కొత్త సీట్ కవర్స్, స్పోర్టీయర్ స్టీరింగ్ వీల్, సిల్వర్ పెయింటెడ్ సెంటర్ కన్సోల్, ఎయిర్‌బ్యాగ్స్ (అన్ని వెర్షన్లలో స్టాండర్డ్ ఫీచర్) మొదలైన అనేక ఫీచర్లతో ఈ కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో లభ్యం కానుంది.

11. హోండా మొబిలియో

11. హోండా మొబిలియో

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ గడచిన జులై నెలలో, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎమ్‌పివి 'హోండా మొబిలియో'ను విడుదల చేసింది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎమ్‌పివిని తయారు చేశారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. భారత్‌లో హోండాకు ఇది మూడవ డీజిల్ కార్ కావటం విశేషం. అమేజ్, సిటీ మోడళ్లలో ఆఫర్ చేస్తున్న డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త మొబిలియో ఎమ్‌పివిలోను ఆఫర్ చేస్తున్నారు.

12. ఫియట్ పుంటో ఇవో

12. ఫియట్ పుంటో ఇవో

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో 'ఫియట్ పుంటో ఇవో' (Fiat Punto Evo) పేరిట అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఫియట్ పుంటో ఇవో డిజైన్ మరింత సింపుల్‌ ఉంటుంది. ప్రీమియం లుక్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్ గార్నిష్ చేశారు. ఇందులో ఫియట్ లోగోను ఫ్రంట్ గ్రిల్‌‌పై నుంచి బానెట్‌పైకి మార్చారు. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్ ఉంటుంది. ముందు వైపు నుంచి స్పోర్టీ లుక్‌నిచ్చేందుకు గాను దీని హెడ్‌లైట్ డిజైన్‌ను మార్చారు.

13. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

13. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా, గడచిన ఆగస్ట్ నెలలో ఎలైట్ ఐ20 (Hyundai Elite i20) మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. స్టయిలిష్ డిజైన్‌తో వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. ఈ కారును ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజన్ చేశారు. జర్మనీలోని రుస్సెల్స్‌హీమ్‌లో హ్యుందాయ్ డిజైన్ సెంటర్ యూరప్ వద్ద ఈ కారును డిజైన్ చేశారు.

14. టాటా జెస్ట్

14. టాటా జెస్ట్

టాటా మోటార్స్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో తయారు చేసిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కంపెనీ ఈ ఏడాది ఆగస్ట్ నెలలో విడుదల చేసింది. టాటా జెస్ట్ సెడాన్ మొత్తం 9 వేరియంట్లలో (4 పెట్రోల్, 5 డీజిల్) లభిస్తుంది. జెస్ట్ కారుతో టాటా మోటార్స్ తొలిసారిగా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ కారులో సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

15. ఆల్టో కె10

15. ఆల్టో కె10

మారుతి సుజుకి ఇండియా గడడచిన నవంబర్ నెలలో సరికొత్త ఆల్టో కె10 కారును మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న ఆల్టో 800 మోడల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, అదే డిజైన్ ఫిలాసఫీతో ఈ కొత్త ఆల్టో కె10 మోడల్‌ను తయారు చేశారు. ఇందులో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

కొత్త ఆల్టో కె10లో ఇంప్రూవ్డ్ 998సీసీ, 3-సిలిండర్, కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 9.1 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌‌తో పాటుగా, సెలెరియో ద్వారా కొత్తగా పరిచయం చేసిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా ఆఫర్ చేస్తున్నారు.

16. మహీంద్రా స్కార్పియో

16. మహీంద్రా స్కార్పియో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను గడచిన సెప్టెంబర్ నెలలో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ స్కార్పియో బేసిక్ షేపును అలానే ఉంచుతూ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మరియు ఇంజన్ ఆప్షన్లలో అనేక మార్పులు చేర్పులు చేసింది.

ఈ కొత్త తరం మహీంద్రా స్కార్పియోను సరికొత్త ఛాస్సిస్‌పై తయారు చేశారు. హైడ్రోఫార్మింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ ఛాస్సిస్‌ను తయారు చేశారు, ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ ఛాస్సిస్ కన్నా ధృడంగా ఉంటుంది. ఈ కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.

17. మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

17. మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను గడచిన అక్టోబర్ నెలలో మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2014 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో కొద్దిపాటి కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ పవర్‌ను తగ్గించి మైలేజ్‌ను పెంచారు. డీజిల్ ఇంజన్ ఈసియూలో మార్పులు చేసి, మైలేజ్ పెంచారు.

18. ఫియట్ అవెంచురా

18. ఫియట్ అవెంచురా

గడచిన అక్టోబర్ నెలలో ఫియట్ ఇండియా తమ సరికొత్త అవెంచురా కాంటెంపరరీ అర్బన్ వెహికల్ (సియూవి)ను మార్కెట్లో విడుదల చేసింది. ఫియట్ అవెంచురా క్రాసోవర్‌ను పుంటో ఇవో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

పెట్రోల్ వెర్షన్ ఫియట్ అవెంచురాలో 1368సీసీ ఫైర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 14.4 కి.మీ. మైలేజీనిస్తుంది. డీజిల్ వెర్షన్ ఫియట్ అవెంచురాలో 1248సీసీ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 197 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 20.5 కి.మీ. మైలేజీనిస్తుంది.

19. మారుతి సెలెరియో

19. మారుతి సెలెరియో

మారుతి సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన సరికొత్త కారు సెలెరియో. సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా మారుతి సుజుకి సెలెరియో కారులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీని పరిచయం చేశారు. ఇది పూర్తి ఆటోమేటిక్ కారులోని కంఫర్ట్‌ను అలాగే మ్యాన్యువల్ కారులోని మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి వెర్షన్ మారుతి సెలెరియో కార్లు రెండూ లీటరు పెట్రోలుకు 23.1 కిలోమీటర్ల మైలేజీనిస్తాయని కంపెనీ పేర్కొంది. మోడ్రన్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ స్పేస్, అధునా టెక్నాలజీ, ఈజీ డ్రైవ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్లు ఈ మారుతి సుజుకి సెలెరియో కారు ప్రత్యేకతలు.

20. మారుతి సుజుకి సియాజ్

20. మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేసిన సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ సియాజ్. ఈ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపుతూ, నేరుగా హోండా సిటీ వంటి సెడాన్లకు పోటీగా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం ఏడు రంగులు, 10 వేరియంట్లలో లభ్యమవుతోంది.

Most Read Articles

English summary
Although automobile sales has been low in 2014, manufacturers launched new models to encourage customers to buy cars. Manufacturers launched numerous models in 2014, some being just facelifts and others, engineering marvels.
Story first published: Saturday, December 27, 2014, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X