ఎతియోస్ లివా డీజిల్ ఇప్పుడు కొత్త వేరియంట్లలో లభ్యం

By Ravi

టొయోటా కిర్లోస్కర్ అందిస్తున్న చిన్న కారు ఎతియోస్ లివా ఇప్పుడు మరో రెండు కొత్త వేరియంట్లలో లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ ఎతియోస్‌ లివాలో కంపెనీ రెండు కొత్త వేరియంట్లను సైలెంట్‌గా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తాజాగా ఇందులో విడి, విడిఎస్‌పి అనే రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేశారు.

ఇదివరకు ఎతియోస్ లివా పెట్రోల్ వెర్షన్ మూడు వేరియంట్లు (జె, జి, వి) మరియు డీజిల్ వెర్ష్ రెండు వేరియంట్లలో (జెడి, జిడి) మాత్రమే లభ్యమయ్యేది. కాగా.. తాజాగా డీజిల్ వెర్షన్‌లో రెండు కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టడంతో దీని మొత్త వేరియంట్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు పెరిగింది.

ఇవి రెండూ (విడి, విడిఎస్‌పి) కూడా టాప్ లెవల్ వేరియంట్లే. ఈ రెండు వేరియంట్లలో బయట, లోపల వైపు మార్పులు చేర్పులు ఉంటాయి. ముందు వైపు డబుల్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, రియర్ వైపర్ వాషర్, 12 స్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, సైడ్ మిర్రర్స్‌పై టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ ఇందులో చూడొచ్చు.

Toyota Etios Liva

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఎతియోస్ లివా విడి, విడిఎస్‌పి వేరియంట్లలో టాకోమీటర్, డ్యూయెల్ టోన్ ఇంటీయర్స్, డోర్ ఆర్మ్‌రెస్ట్స్, ఉడ్ గ్రెయిన్ ఫినిష్, క్రోమ్ టిప్డ్ గేర్ షిఫ్ట్ నాబ్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, రియర్ డిఫాగ్గర్ వంటి ఫీచర్లను జోడించారు. వీటిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

లివా డీజిల్ విడిఎస్‌పి వేరియంట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ ఫీచర్లు లభిస్తాయి. ఇంజన్ పరంగా ఈ రెండు వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.3 లీటర్, 4-సిలిండర్ డి-4డి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* టొయోటా ఎతియోస్ లివా విడి - రూ.6.72 లక్షలు
* టొయోటా ఎతియోస్ లివా విడిఎస్‌పి - రూ.7.12 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
The diesel engine variant of the Toyota Etios Liva hatchback is now available in two new trim levels. Toyota Etios Liva was until now offered in three petrol - J, G and V - and two diesel trims - JD and GD. The new variant trims which have joined the diesel lineup are the top of the line VD and VDSP.
Story first published: Saturday, January 4, 2014, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X