టొయోటా ఐ-రోడ్ త్రీవీలర్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్

By Ravi

ఈ ఫొటోల్లోని విచిత్ర వాహనం గుర్తుందా..? ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో టొయోటా మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన 'టొయోటా ఐ-రోడ్' (Toyota i-ROAD) ఎలక్ట్రిక్ త్రీవీలర్ కాన్సెప్ట్ వాహనం ఇది. పర్సనల్ మొబిలిటీ వెహికల్‌గా టొయోటా భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కాన్సెప్ట్‌‌ను తయారు చేసింది.

అయితే, టొయోటా ఐ-రోడ్ ఇతర కాన్సెప్ట్ వాహనాల మాదిరిగా కేవలం కాన్సెప్ట్ దశకు మాత్రమే పరిమితం కాకుండా, ఉత్పత్తి దశకు చేరుకోనుంది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ వాహనాన్ని ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. త్వరలోనే ఈ మోడల్‌ను పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తామని, దీనికి టొయోటా సిటీలో ట్రైల్ రన్ నిర్వహిస్తామని కంపెనీ పేర్కొది.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌కు సంబంధిచిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

టొయోటా ఐ-రోడ్ ఒక ఎలక్ట్రిక్ వాహనం. జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసింది.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

మార్చ్ 2013లో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో టొయోటా తొలిసారిగా తమ ఐ-రోడ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచింది.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

టొయోటా ఐ-రోడ్ ఒక టూ సీటర్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

టొయోటా ఐ-రోడ్ వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 మైళ్ల (50 కిలోమీటర్లు) దూరం ప్రయాణించవచ్చు.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

'యాక్టిల్ లీన్' టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్‌ను డ్రైవ్ చేయటం చాలా సులువు.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

టొయోటా ఐ-రోడ్‌లో ప్రయాణం కూడా చాలా సురక్షితంగాను, ఆహ్లాదంగాను ఉంటుంది.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

తక్కువ విద్యుత్‌ను, తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని, పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాలపై 40 ఏళ్లుగా టొయోటా చేస్తున్న పరిశోధనలకు ఫలితమే ఈ ఐ-రోడ్ కాన్సెప్ట్.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

ఈ వాహనంలోని బ్యాటరీని కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

సాధారణ ద్విచక్ర వాహనాలతో పోల్చుకుంటే ఐ-రోడ్ కాన్సెప్ట్‌లో ఎలాంటి వాతావరణంలో అయినా (దుమ్ము, ధూళి, వర్షం, ఎండ, చలి మొదలైనవి) సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

మూడు చక్రాలు కలిగిన ఈ టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్ 2350 మి.మీ. పొడవును, 1445 మి.మీ. ఎత్తును, 1700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి తక్కువ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమిస్తుంది.

టొయోటా ఐ-రోడ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్

ముందు చక్రాల 2 కి.వా. సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, ఇవి లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తాయి.

Most Read Articles

English summary
Toyota's i-Road three-wheeler concept is set to make it off the drawing board and onto the road. Toyota has unveiled the all-new i-ROAD EV concept images ahead of its world debut at the 2013 Geneva Motor Show. Toyota i-ROAD is a personal mobility vehicle (PMV), a new, flexible form of transport designed for city streets. Seating two in tandem and under cover, i-ROAD is an electric vehicle with a range of up to 30 miles (50km) on a single charge.
Story first published: Tuesday, October 22, 2013, 9:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X