YouTube

టొయోటా నుంచి రిఫ్రెష్డ్ ఎతియోస్, లివా మోడళ్ల విడుదల

By Ravi

టొయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న టొయోటా ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన 'కొత్త ఎతియోస్', 'కొత్త ఎతియోస్ లివా' మోడళ్లను కంపెనీ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎతియోస్ సెడాన్ ధరలు రూ.5.74 లక్షల నుంచి, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.76 లక్షల నుంచి ప్రారంభమవుతాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఈ కొత్త టొయెటా ఎతియోస్ మరియు ఎతియోస్ లివా మోడళ్లలో ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అప్‌డేట్స్ ఉంన్నాయి. కొత్త ఎతియోస్ సెడాన్‌లో క్రోమ్ ఫినిష్డ్ సింగిల్ టూత్ గ్రిల్ ఉంటుంది. అయితే, కొత్త లివా హ్యాచ్‌బ్యాక్‌లో క్రోమ్ గ్రిల్‌కు బదులుగా బాడీ కలర్డ్ గ్రిల్ ఉంటుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కొత్త పెరల్ వైట్ కలర్ (ఎతియోస్ సెడాన్‌లో మాత్రమే) వంటి మార్పులు ఉన్నాయి.


ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. మల్టీ ఇన్ఫో ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సీట్‌బెల్ట్, డోర్ అజర్ మరియు హెడ్‌ల్యాంప్ ఆన్ వార్నింగ్ బజర్స్, కొత్త ప్రీమియం ఫ్యాబ్రిక్స్‌తో తయారు చేసిన సీట్స్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ముందు వైపు స్పీకర్లకు అదనంగా వెనుక వైపు రెండు కొత్త స్పీకర్లు (ఎతియోస్ సెడాన్‌లో మాత్రమే) వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఎతియోస్ రేంజ్ ఇప్పుడు డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా కలిగి ఉంటుంది. అలాగే, ఎతియోస్‌లో రివర్స్ పార్కింగ్ సెన్సార్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. యాంత్రికపరంగా ఈ రెండు మోడళ్లు ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకి మోడళ్లలో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ కొత్త ఎతియోస్, లివా మోడళ్లలోను కొనసాగిస్తున్నారు.


ఎతియోస్ మరియు లివా డీజిల్ వెర్షన్లలో 1.4 లీటర్ డి-4డి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 67.1 బిహెచ్‌పిల శక్తిని, 1800-2400 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 23.59 కెఎమ్‌పిఎల్.

ఎతియోస్ పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 5600 ఆర్‌పిఎమ్ వద్ద 88.8 బిహెచ్‌పిల శక్తిని, 3000 ఆర్‌పిఎమ్ వద్ద 132 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 16.78 కెఎమ్‌పిఎల్.

Etios Liva

ఎతియోస్ లివా పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ 1.2 లీటర్ ఇంజన్ గరిష్టంగా 5600 ఆర్‌పిఎమ్ వద్ద 78.9 బిహెచ్‌పిల శక్తిని, 3100 ఆర్‌పిఎమ్ వద్ద 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 17.7 కెఎమ్‌పిఎల్.
Most Read Articles

English summary
Toyota has launched the refreshed Etios sedan and Etios Liva hatchback in India.
Story first published: Wednesday, October 15, 2014, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X