భారత్‌లో 45,000 ఇన్నోవాలను రీకాల్ చేసిన టొయోటా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటా వివిధ సమస్యల కారణంగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా 63.9 లక్షల వాహనాలను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. ఈ రీకాల్‌లో భారత్‌లో విక్రయించిన పాపులర్ టొయోటా ఇన్నోవా మోడళ్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో విక్రయించిన సుమారు 45,000 టొయోటా ఇన్నోవాల్లో సమస్యలు గుర్తించామని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవి 2005 నుంచి డిసెంబర్ 2008 మధ్య భారత్‌లో తయారైన ఈ ఇన్నోవా ఎమ్‌పివిలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని టొయోటా పేర్కొంది.

ఈ బ్యాచ్‌లో తయారైన టొయోటా ఇన్నోవా ఎమ్‌పివిలలో స్టీరింగ్ వీల్‌లో ఉపయోగించిన ఓ కేబుల్ ద్వారా ఎయిర్‌బ్యాగ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని టొయోటా తెలిపింది.

Toyota Innova

డ్రైవర్ రక్షణ కోసం స్టీరింగ్ వీల్‌లో ఏర్పాటు చేసిన ఎయిర్ బ్యాగ్ పనితీరుపై ఈ కేబుల్ సమస్య ప్రభావం చూపుతుందని, ప్రభావితమైన కార్ల యజమానులు సంబంధిత డీలర్ల వద్దకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కాగా.. టొయోటా ప్రపంచ వ్యాప్తంగా రీకాల్ చేసిన 63.9 లక్షల వాహనాల్లో మొత్తం 27 రకాల మోడళ్లు ఉన్నాయి. ఒక్కో మోడల్‌లో ఒక్కోరకమైన సమస్య ఉంది. టొయోటా ఇదివరకు 74 లక్షల వాహనాలను రీకాల్ చేసింది.

టొయోటా కంపెనీ చరిత్రలోనే రెండవ అతిపెద్ద రీకాల్ కావటం గమనార్హం. కేవలం ఎయిర్ బ్యాగ్స్ సమస్యల వల్లనే 35 లక్షల వాహనాలు రీకాల్ చేస్తుండగా, సీట్ రెయిల్స్ సమస్యల వల్ల 16.7 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

Post by DriveSpark.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor (TKM) said it will recall 44,989 units of multi-purpose vehicle Innova manufactured between February 2005 and December 2008 in India to rectify a faulty cable on the steering wheel.
Story first published: Thursday, April 10, 2014, 18:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X