Upcoming Cars: 'భారత్‌లో విడుదల కానున్న కొత్త కార్లు'

By Ravi

పెరుగుతున్న ఇంధన ధరలు, వడ్డీ రేట్లు, తాజా సుంకాలు, రూపాయి విలువ మొదలైన అనేక అంశాలు భారత ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సంగతి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కార్ల తయారీదారులు తమ సరికొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తారా..? ఒకవేళ విడుదల చేస్తే సదరు మోడళ్లు సక్సెస్‌ను సాధిస్తాయా..? అంటే, వాటన్నింటితో మాకు పనిలేదు, మేము చేయాలనుకున్నది చేసి తీరుతాం అని ఆటోమొబైల్ తేల్చి చెప్పేస్తున్నాయి.

ముందుంది ముసళ్ల పండుగ అంటే కాదు ముందుంది కార్ల పండుగ అంటున్నారు పరిశ్రమ నిపుణులు. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నప్పటికీ, అవి మరెంతో కాలం ఉండవనేది విశ్లేషకుల వాదన. సరే అదంతా అటుంచితే, రానున్న పండుగ సీజన్‌లోను అలాగే ఆ తర్వాత కూడా కార్ ప్రియులను ఆకర్షించేందుకు కొత్త కొత్త కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.

అందులో కొన్ని ఉత్పత్తులు, ఇప్పటికే కార్ల తయారీదారులు ఆఫర్ చేస్తున్న వాటికి అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా ఉంటే, మరికొన్ని పూర్తిగా సరికొత్త మోడళ్లుగా ఉండనున్నాయి. మరి సమీప భవిష్యత్తులో ఇండియన్ రోడ్లపై సందడి చేయనున్న ఆయా కొత్త కార్ల వివరాలేంటో ఓ లుక్కేద్దాం రండి..!

డ్యాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్

డ్యాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్

* విడుదల తేది: 2014 ఆరంభంలో (అంచనా)

* ధర: రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లో (అంచనా)

డాట్సన్ బ్రాండ్‌కు నిస్సాన్ పునజ్జీవం కల్పించిన తర్వాత, ఈ బ్రాండ్ నుంచి వస్తున్న తొలి కారు డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్. నిస్సాన్ మైక్రా, రెనో పల్స్ కార్లలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కారులో కూడా ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. తక్కువ ధర, విశాలమైన ఇంటీరియర్ ఈ కారు హైలైట్స్.

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి

డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి

* విడుదల తేది: 2014 ద్వితీయార్థం (అంచనా)

* ధర: రూ.5.5 లక్షల రేంజ్‌లో (అంచనా)

డాట్సన్ బ్రాండ్ నుంచి రానున్న రెండవ ఉత్పత్తి డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఎమ్‌పివిని అభివృద్ధి చేశారు. ఈ ఎమ్‌పివి ధరను తక్కువగా ఉంచేందుకు గాను దీని పొడవును 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా తీర్చిదిద్దారు. ముందుగా ఇది ఇండోనేషియా మార్కెట్లో విడుదల కానుంది. ఇందులో కూడా అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

స్కొడా ఆక్టావియా సెడాన్

స్కొడా ఆక్టావియా సెడాన్

* విడుదల తేది: అక్టోబర్ 3, 2013 (అంచనా)

* ధర: రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల రేంజ్‌లో (అంచనా)

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుంచి పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కొత్త స్కొడా ఆక్టావియా సెడాన్‌ను డిజైన్ చేశారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 117 హెచ్‌పి 1.8 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 141 హెచ్‌పి 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్ మరియు బేస్ వేరియంట్లో 138 హెచ్‌పి 1.4 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు.

నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ

నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ

* విడుదల తేది: అక్టోబర్ 9, 2013 (అంచనా)

* ధర: రూ.10 లక్షలకు దిగువన (అంచనా)

రెనో డస్టర్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది ఈ నిస్సాన్ టెర్రానో. కానీ ఈ రెండు మోడళ్లకు డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. రెనో డస్టర్‌లో ఉపయోగించిన ఇంజన్లనే నిస్సాన్ టెర్రానోలో కూడా ఉపయోగించనున్నారు. అయితే, టెర్రానోలో డస్టర్ కన్నా ఎక్కువ ఫీచర్లు లభ్యం కానున్నాయి. నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా/ఐవి4 ఎస్‌యూవీ

సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా/ఐవి4 ఎస్‌యూవీ

* విడుదల తేది: 2014 ఆరంభంలో (అంచనా)

* ధర: అందుబాటులో లేదు

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో జోరుగా ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఎక్స్ఏ ఆల్ఫా/ఐవి4 కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. సుజుకి ఐవి4 కాన్సెప్ట్‌ను ఇటీవలే ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించారు. వచ్చే ఏడాదిలో ఇది భారత రోడ్లపైకి రావచ్చని అంచనా.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ

* విడుదల తేది: అందుబాటులో లేదు

* ధర: రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో (అంచనా)

ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో సెడాన్, ప్రీమయం సెడాన్, హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను అందిస్తోంది. అయితే, పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మాత్రం కంపెనీకు ఎలాంటి ఉత్పత్తి లేదు. ఈ ఖాలీని భర్తీ చేసుకునేందుకే, టైగన్ అనే పేరుతో ఫోక్స్‌వ్యాగన్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్ మాదిరిగానే ఫోక్స్‌వ్యాగన్ కూడా 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ (అప్‌గ్రేడెడ్)

హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ (అప్‌గ్రేడెడ్)

* విడుదల తేది: 2014 ఆరంభంలో (అంచనా)

* ధర: అందుబాటులో లేదు

ఈ ఫొటోలో కనిపిస్తున్న కొత్త 2014 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ జపనీస్ మార్కెట్లో ఇటీవలే విడుదలైంది (అక్కడి మార్కెట్లో ఇది హోండా ఫిట్ పేరుతో అమ్ముడుపోతుంది). పాత జాజ్‌తో పోల్చుకుంటే కొత్త జాజ్ డిజైన్, ఫీచర్ల పరంగా అధునాతనంగా ఉండనుంది. అమ్మకాలు సరిగ్గా లేని కారణంగా, హోండా భారత మార్కెట్లో జాజ్ విక్రయాలను నిలిపివేసింది. అయితే, కొత్త జాజ్ విడుదలతో తిరిగి ఈ మోడల్‌కు జీవం పోయాలని కంపెనీ యోచిస్తోంది.

హోండా మొబిలో ఎమ్‌పివి

హోండా మొబిలో ఎమ్‌పివి

* విడుదల తేది: 2014 ద్వితీయార్థంలో (అంచనా)

* ధర: రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో (అంచనా)

హోండా నుంచి రానున్న మరొక కొత్త ఉత్పత్తి 'హోండా మొబిలో' ఎమ్‌పివి. హోండా అందిస్తున్న బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కారును అభివృద్ధి చేశారు. ఇది కూడా తొలుత ఇండోనేషియా మార్కెట్లో విడుదల కానుంది, అనంతరం ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మారుతి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా వంటి ఎమ్‌పివిలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ

జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ

* విడుదల తేది: 2014 ఆరంభంలో (అంచనా)

* ధర: రూ.30 లక్షల రేంజ్‌లో (అంచనా)

ఇటాలియన్ ఆటో దిగ్గజం ఫియట్‌కు చెందిన జీప్ బ్రాండ్ భారత్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జీప్ బ్రాండ్ కార్లను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ బ్రాండ్‌లో మొదటి మోడల్ 'జీప్ గ్రాండ్ చిరోకీ'. ఇందులో పవర్‌ఫుల్ 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 237 హెచ్‌పిల శక్తిని, 549 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ

జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీ

* విడుదల తేది: 2014 ఆరంభంలో (అంచనా)

* ధర: రూ.35-50 లక్షల రేంజ్‌లో (అంచనా)

ఫియట్-జీప్ బ్రాండ్ నుంచి రానున్న రెండవ ఉత్పత్తి 'జీప్ వ్రాంగ్లర్' ఎస్‌యూవీ. ఇది కూడా జీప్ గ్రాండ్ చిరోకీతో పాటుగానే భారత్‌లో విడుదల కానుంది. ఫియట్ రానున్న మూడేళ్లలో భారత మార్కెట్లో 9 ఉత్పత్తులను ప్రవేశపెడతానని పేర్కొంది. అందులో ఇవి రెండు కూడా ఉన్నాయి. 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫియట్ తమ జీప్ బ్రాండ్ వాహనాలను ఆవిష్కరించే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Upcoming cars in India has new car models from Maruti, Datsun, Hyundai, Ford, Mahindra, Honda, Tata, Nissan. New car model launches in India in near feature. Lets us take a look at some of the upcoming cars that will likely hit Indian shores in the near future.
Story first published: Tuesday, September 24, 2013, 17:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X