హ్యుందాయ్ నుంచి రానున్న కొత్త కార్లు

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో తన మార్కెట్ వాటాను భారీగా పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో అగ్ర స్థానంలో ఉన్న మారుతి సుజుకి ఇండియా జోరుకు చెక్ పెట్టేందుకు కంపెనీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా, రానున్న 18 నెలల్లో సరికొత్త కార్లను హ్యుందాయ్ విడుదల చేయనుంది.

ఈ సమయంలో హ్యుందాయ్ నుంచి ఆరు కొత్త మోడళ్లు మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది. వీటిల్లో ఇప్పటికే మూడు మోడళ్లు ఖరారు కాగా, మరో మూడు మోడళ్లు ఖరారు కావల్సి ఉన్నాయి. భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియాకు 23 శాతం మార్కెట్ వాటా ఉండగా, మారుతి సుజుకి ఇండియాకు 47 శాతం మార్కెట్ వాటా ఉంది.

మరి హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి భారత మార్కెట్లో సందడి చేయనున్న ఆ కొత్త మోడళ్ల వివరాలేంటో ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్, హోండా బ్రయో వంటి మోడళ్లకు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ ఓ సరికొత్త కాంపాక్ట్ కారును అభివృద్ధి చేసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పేరుతో సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఈ కారును ఐ10, ఐ20 మోడళ్లకు మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. గ్రాండ్ ఐ10 పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సెడాన్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సెడాన్

హ్యుందాయ్ తాజాగా ఆవిష్కరించిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ఎంట్రీ లెవల్ సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న యాక్సెంట్ పెట్రోల్ సెడాన్ స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. హ్యుందాయ్ నుంచి రానున్న కాంపాక్ట్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. జులై 2014 నాటికి ఇది విడుదల కావచ్చని అంచనా.

హ్యుందాయ్ ఎమ్‌పివి

హ్యుందాయ్ ఎమ్‌పివి

ప్రస్తుతం భారత మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ జోరుగా ఉండటంతో, ఈ జోరును క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఓ ఎమ్‌పివిని విడుదల చేయనుంది. గడచిన సంవత్సరం జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన హెక్సా-స్పోస్ కాన్సెప్ట్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఎమ్‌పివిని తయారు చేయనున్నారు. 2014 ద్వితీయార్థంలో ఇది విడుదల కావచ్చని అంచనా

అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ శాంటాఫే

అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ శాంటాఫే

హ్యుందాయ్ అందిస్తున్న శాంటాఫే ఎస్‌యూవీని పూర్తిగా అప్‌గ్రేడ్ చేసి, ఇందులో రిఫ్రెష్డ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. కొత్త శాంటాఫే, ప్రస్తుత శాంటాఫే కన్నా పొడవుగా, పొడవు వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది ప్రస్తు శాంటాఫే కన్నా మరింత విశాలవంతంగా ఉంటుంది. 2014 ఆరంభంలో ఇది విడుదల కావచ్చని అంచనా.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

హెక్సా స్పేస్ కాన్సెప్ట్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, హ్యుందాయ్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా హ్యుందాయ్ తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. 2014 చివరి నాటికి ఇది భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వొచ్చని అంచనా.

పవర్‌ఫుల్ హ్యుందాయ్ ఇయాన్

పవర్‌ఫుల్ హ్యుందాయ్ ఇయాన్

మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్‌కు పోటీగా హ్యుందాయ్ అందిస్తున్న ఇయాన్‌లో ఓ 1.1 లీటర్ ఇంజన్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. ఆల్టో 800కు పోటీగా ఇయాన్ (ప్రస్తుత వెర్షన్ 814సీసీ వెర్షన్) లభిస్తున్నప్పటికీ ఆల్టో కె10 (1 లీటర్ వెర్షన్)కు పోటీగా హ్యుందాయ్ నుంచి సరైన కారు లేదు. అందుకే 1.1 లీటర్ ఇంజన్ కలిగి ఇయాన్‌ను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇది కూడా 2014లోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai is aiming to become India’s largest car manufacturer in compact car segment by 2020, ending Maruti Suzuki‘s 30 plus years of dominance in the segment. To achieve this, over the next 18 months, the company has plans to bring in at least three confirmed launches and three more are in the pipeline.
Story first published: Tuesday, August 27, 2013, 14:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X