ఫిబ్రవరిలో మార్కెట్లోకి రానున్న సరికొత్త హోండా సిఆర్-వి!

జపనీస్ కార్ కంపనీ హోండా భారత మార్కెట్లో అందిస్తున్న ఏకైక క్రాసోవర్ 'హోండా సిఆర్-వి' ఇప్పుడు మరిన్ని కొత్త హంగులతో ముస్తాబై దేశీయ విపణిలో విడుదలయ్యేందుతకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సిఆర్-వి కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దిన సరికొత్త 2013 హోండా సిఆర్-వి క్రాసోవర్ వచ్చే నెలలో మార్కెట్లోకి రానుంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్, స్టయిలిష్ లుక్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, రీడిజైన్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, హోండా లోగోతో కూడిన త్రీ లైన్ క్రోమ్ గ్రిల్, సన్నగా ఉండే ఎయిర్ డ్యామ్, కొత్త ఫ్రంట్ బంపర్, ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఈ అప్‌గ్రేడెడ్ హోండా సిఆర్-విలో గమనించవచ్చు.

ఈ సరికొత్త హోండా సిఆర్-వి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా సిఆర్‌-వి కన్నా పరిమాణంలో కాస్తంత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. అలాగే, దీని ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కోసం కొత్త సిఆర్-వి పొడవును కొద్దిగా పెంచారు. స్పోర్టీ లుక్ ఇచ్చేలా తీర్చిదిద్దిన ఏరోడైనమిక్స్, మెరుగైన మైలేజీనిచ్చేలా రీట్యూన్ చేసిన ఇంజన్ వంటి అనేక మార్పులతో కొత్త హోండా సిఆర్-వి లభ్యం కానుంది. 2013 హోండా సిఆర్-వి ధర రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఈ అప్‌గ్రేడెడ్ సిఆర్-వి క్రాసోవర్‌ను హోండా తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన 2011 ఆరంజ్ కౌంటీ ఇంటర్నేషనల్ ఆటో షోలో ఆవిష్కరించారు. అనంతరం దీనిని 2011 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో కూడా ప్రదర్శించటం జరిగింది. ఈ 2013 హోండా సిఆర్-విలో 2.0 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ఇది గరిష్టంగా 155 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త 2013 హోండా సిఆర్-వి ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, టాటా ఆరియా వంటి మోడళ్లు సవాలుగా నిలువనుంది.

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

2013 హోండా సిఆర్-వి

Most Read Articles

English summary
Honda Cars India Limited is expected to launch a upgraded version of its CR-V in February 2013. The all new 2013 Honda CR-V will be priced around over Rs. 20 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X