ఉత్పత్తి దశకు ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

By Ravi

లీటరు ఇంధనానికి 100 కిలోమీటర్లకు పైగా మైలేజీనిచ్చే ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 కాన్సెప్ట్ కారు గుర్తుందా..? గత రెండేళ్లుగా వివిధ ఆటో ప్రదర్శనల్లో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్‌గా నిలిచిన ఈ కాన్సెప్ట్ కారు ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకోనుంది. ఈ హైబ్రిడ్ కారును వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనున్నామని జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. ప్రొడక్షన్ వెర్షన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారును ఈ ఏడాది జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శించనున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు డీజిల్ మరియు బ్యాటరీ పవర్‌తో పనిచేస్తుంది. ఇందులో 47 బిహెచ్‌పి, ట్విన్-సిలిండర్, 800 సీసీ, టర్బో డీజిల్ ఇంజన్‌ను, అలాగే, 27 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్‌లను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ కారులో అమర్చిన 5.5 కిలోవాట్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కారు బరువును తేలికంగా ఉంచేందుకు గానూ దీని బాడీ నిర్మాణంలో ఎక్కువ భాగం ధృఢమైన కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు. దీని మొత్తం బరువు 795 కేజీలు మాత్రమే. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు లీటరు ఇంధనానికి 111.16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

ఇది 3.8 మీటర్ల పొడవును, 1.66 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 159.9 కిలోమీటర్లు. ఇది 12.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్ఎల్1 కారులో 10 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ ఇంధనం సాయంతో 49.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. డీజిల్, బ్యాటరీ పవర్‌తో కలిపి ఈ కారులో 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఫోక్స్‌వ్యాగన్ జర్మన్ ఇంజనీర్లు 12 ఏళ్ల పాటు పరిశోధన చేసి ఎక్స్ఎల్ 1 కారుకు రూపకల్పన చేశారు. 2002లో ఈ కారు తయారీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి ఇది వాస్తవ రూపం దాల్చుతోంది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

Most Read Articles

English summary
Volkswagen XL1 is the world's most fuel efficient car. Many lay claim to that title, but what sets the VW XL1 apart from the others is the fact that this car is not a concept anymore. The German automaker has announced it will launch the production version at the Geneva Motor Show.
Story first published: Monday, February 25, 2013, 12:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X