ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కస్టమర్ల కోసం స్మార్ట్‌‌ఫోన్ అప్లికేషన్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, భారతదేశంలోని తమ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (యాప్)ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్‌ను ఐఓఎస్ (యాపిల్) పరికరాలు మరియు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మొబైల్ అప్లికేషన్‌ను సంబంధిత ఆన్‌లైన్ స్టోర్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో, తమ కస్టమర్లతో మరింత బలమైన సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు యాపిల్ ఐట్యూన్స్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మొబైల్ అప్లికేషన్ సాయంతో అనేక కొత్త విషయాలను కస్టమర్లు తెలుసుకోవచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోక్స్‌వ్యాగన్ స్మార్ట్‌‌ఫోన్ యాప్

ఈ కొత్త సర్వీస్ యాక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాల్సిన వివరాలను, టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. ఇంకా, ప్రస్తుత మరియు భావి ఫోక్స్‌వ్యాగన్ కస్టమర్లు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది

ఫోక్స్‌వ్యాగన్ స్మార్ట్‌‌ఫోన్ యాప్

ఫోక్స్‌వ్యాగన్ కార్లలోని డ్యాష్‌బోర్డుపై ఉండే వివిధ ఇండికేటర్ల గురించి వివరణలు పొందవచ్చు. అలాగే, ఫోక్స్‌వ్యాగన్ సర్వీస్ సెంటర్లలో వసూలు చేసే లేబర్ చార్జీలు, రోడ్ సైట్ అసిస్టెన్స్, ఎమెర్జెన్సీ కాంటాక్ట్ డీటేల్స్ మొదలైనవి తెలుసుకోవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ స్మార్ట్‌‌ఫోన్ యాప్

నెట్‌వర్క్, లేటెస్ట్ సేల్స్ మరియు ఆఫ్టర్-సేల్స్ ఆఫర్స్ గురించి సమాచారాన్ని మరియు సమీపంలోని డీలర్‌షిప్ కేంద్రాలను కూడా ఈ అప్లికేషన్ సాయంతో పొందవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ స్మార్ట్‌‌ఫోన్ యాప్

అంతేకాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో ఆఫర్ చేస్తున్న అన్ని కార్లకు సంబంధించిన సమాచారాన్ని, అప్‌డేట్స్‌‌ను కూడా ఈ మొబైల్ అప్లికేషన్ సాయంతో తెలుసుకోవచ్చు.

Most Read Articles

English summary
Volkswagen has launched a new mobile application for its customers in India. The app provides an explanation of various indicators on the car’s dashboard, labour charges at Volkswagen service centers, roadside assistance, and emergency contact details.
Story first published: Tuesday, September 2, 2014, 13:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X