కొత్త 'క్రాస్‌పోలో'ను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్

యూరప్‌కు చెందిన అతిపెద్ద కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందరినీ అశ్చర్యపరుస్తూ, తమ కొత్త క్రాస్ పోలో (Cross Polo)ను నేడు (ఆగస్ట్ 22, 2013న) భారత మార్కెట్లో విడుదల చేసింది. మరింత స్పోర్టీ డిజైన్‌తో కూడిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో ధర రూ.7.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది 1.2 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌తోలభ్యమవుతుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

క్రాస్ పోలో విడుదల సందర్భంగా, ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా మాట్లాడుతూ.. భారత మార్కెట్లోని ఉత్పత్తుల్లో తమకు పోలో చాలా ముఖ్యమైనదని, స్పోర్టీ 'క్రాసోవర్' స్టైల్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోరుకునే వారి కోసం ఈ కొత్త క్రాస్ పోలోను సృష్టించామని చెప్పారు. కొత్త ఫ్రంట్ అండ్ రియర్ 'క్రాస్' బంపర్స్, బ్లాక్ సైడ్ క్లాడింగ్ అండ్ వీల్ ఆర్చెస్, సిల్వర్ పెయింటెడ్ మిర్రర్స్ అండ్ రూఫ్ రెయిల్స్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, లివియాన్ టైటానియం బ్లాక్ అప్‌హోలెస్ట్రీ వంటి ప్రధాన ఫీచర్లు క్రాస్ పోలో సొంతం.

ఆగస్ట్ 23, 2013వ తేది నుంచి కొత్త క్రాస్ పోలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.


ఇంజన్:
ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలో కారులో 1.2 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 4200 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఎక్స్టీరియర్ ఫీచర్లు:

  • క్రోమ్ గార్నిష్‌తో కూడిన 'క్రాస్' గ్రిల్
  • క్రోమ్ టచ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ అండ్ రియర్ 'క్రాస్' బంపర్స్
  • కొత్త 5-స్పోక్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్
  • బ్లాక్ సైడ్ క్లాడింగ్
  • బ్లాక్ వీల్ ఆర్చెస్
  • సిల్వర్ రూఫ్ రెయిల్స్
  • సిల్వర్ సైడ్ మిర్రర్స్
  • వెనుక డోర్లపై 'క్రాస్' డెకాల్స్
  • బ్లాక్ ఫినిష్‌లో హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్
  • విండ్‌స్క్రీన్, సైడ్ అండ్ రియర్ విండోస్ కోసం హీట్ ఇన్సులేటింగ్ చేయబడిన గ్లాస్
  • 6 ఏళ్ల యాంటీ-కార్రిషన్ వారంటీతో కూడిన బాడీ

Cross Polo Rear


ఇంటీరియర్ ఫీచర్లు:

  • సుపీరియర్ లివాన్ టైటానియం బ్లాక్ అప్‌హోలెస్ట్రీ
  • లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్
  • లెథర్ వ్రాప్డ్ గేర్‌షిఫ్ట్ నాబ్, హ్యాండ్‌బ్రేక్ లివర్ హ్యాండిల్
  • ఇంటీరియర్ క్రోమ్ గార్నిష్
  • ఫ్రంట్ డోర్లపై స్టోరేజ్ కంపార్ట్‌మెంట్
  • డోర్లకు పైభాగంలో 3 గ్రాబ్ హ్యాండిల్స్, (కోట్ హుక్‌లతో పాటుగా)
  • గ్లౌవ్ బాక్సు లోపల సన్‌గ్లాస్ హోల్డర్
  • ఫ్రంట్ సెంటర్ కన్సోల్‌లో 12 వోల్ట్ పవర్ సాకెట్
  • లగేజ్ కంపార్ట్‌మెంట్ కవర్/పార్సెల్ ట్రే

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లు:

  • 'క్లైమాట్రానిక్' ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ (డస్ట్ అండ్ పొల్లెన్ ఫిల్టర్‌తో)
  • 2-డిన్ ఆర్‌సిడి 320 మ్యూజిక్ సిస్టమ్ (యూఎస్‌బి, ఆక్స్-న్, ఎస్‌డి కార్డ్, బ్లూటూత్ సపోర్టుతో, 4 స్పీకర్లు)
  • టాకోమీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ ట్రిప్ ఓడోమీటర్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • మల్టీ ఫంక్షన్ డిస్‌ప్లే (ఎమ్ఎఫ్‌డి)
  • మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్
  • స్పీడ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్
  • టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్ వీల్
  • లేన్ ఛేంజ్ ఇండికేటర్ (ట్రిపుల్ ఫ్లాష్)
  • హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
  • డిజిటల్ క్లాక్, ఫ్యూయెల్ గేజ్, హై కూలెంట్ టెంపరేచర్ మరియు లో ఆయిల్ ప్రెజర్ కోసం వార్నింగ్ లైట్స్
  • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్
  • రిమోట్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్
  • అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్)
  • రియర్ పార్కింగ్ సెన్సార్స్
  • సెంట్రల్ లాకింగ్ (కంపెనీ లోగోలో బూట్ ఓపెనర్‌తో)

Cross Polo Interiors

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్లు:

  • ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
  • డ్యూయెల్ ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్ అండ్ కో-ప్యాసింజర్)
  • ఎలక్ట్రానిక్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ (ఫ్లోటింగ్ కోడ్‌తో)
  • 3 పాయింట్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్
  • 3 పాయింట్ రియర్ అవుటర్ సీట్ బెల్ట్స్, మధ్యలో ల్యాప్ బెల్ట్ (వెనుక సీటులో)
  • అన్ని 4 పవర్ విండోస్ కోసం పించ్ గార్డ్ సేఫ్టీ
  • హై మౌంటెడ్ థర్డ్ బ్రేక్ లైట్ (వెనుక వైపు)
  • ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్
  • ఫాగ్ లైట్స్ (ఫ్రంట్ అండ్ రియర్)
  • ఎమర్జెన్సీ ఎగ్జిట్

క్రాస్ పోలో కలర్ ఆప్షన్స్:

  • ఫ్లాష్ రెడ్
  • రెఫ్లెక్స్ సిల్వర్
  • డీప్ బ్లాక్ పెరల్
Most Read Articles

English summary
Volkswagen, Europe’s largest carmaker announced the launch of the new Cross Polo today. With this launch, India’s leading premium hatchback gets bold, sporty design flair, which will appeal to customers with active lifestyles and a taste for adventure. The New Cross Polo is priced at Rs. 7.75 lakh, ex showroom, Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X