ఏప్రిల్ 25న మార్కెట్లోకి రానున్న ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'పోలో'లో మరింత శక్తివంతమైన వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గత కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ పవర్‌ఫుల్ 'పోలో జిటి' వేరియంట్‌ను ఈనెల 25న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ వేరియంట్‌లో డైరెక్ట్ ఇంజక్షన్ మరియు టర్బో ఛార్జింగ్ ఆప్షన్‌తో కూడిన 1.2 లీటర్ టిఎస్ఐ (పెట్రోల్) ఇంజన్‌ను ఉపయోగించారు. దీని వలన ఇది గరిష్టంగా 105 బిహెచ్‌పిల శక్తిని (వావ్..) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను డిక్యూ200 7-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్సిమిషన్‌తో జతచేశారు. ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కూడా అందుబాటులో ఉంది. మిగతా పోలో మోడళ్లతో పోల్చుకుంటే మోడల్‌ను మరింత భిన్నంగా ఉంచేందుకు గాను ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి కోసం పోలో ఎస్ఆర్ ఎడిషన్ బాడీ కిట్‌ను జోడించారు.

ఈ పోలో జిటి కారుకు ముందు వైపు, వెనుక వైపు అలాగే పక్క భాగాల్లో స్పెషల్ స్కర్ట్స్ (టాటా విస్టా డి90లో చూసిన విధంగా) ఉండనున్నాయి. ఇంకా రియర్ రూఫ్ స్పాయిలర్, క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఏప్రిల్ 25 వరకూ ఆగాల్సిందే మరి. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

ఫోక్స్‌‌వ్యాగన్ పోలో జిటి

Most Read Articles

English summary
German carmaker Volkswagen has officially confirmed that it will introduce more powerful Polo hatchback in India. Company is developing a new 1.5-litre diesel engine which will be used in the upcoming Volkswagen Polo.
Story first published: Thursday, April 18, 2013, 7:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X