కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో విడుదల; ధరలు, ఫీచర్లు

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, ఈనెల 15వ తేదీన దేశీయ విపణిలో కొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. నేడు (జులై 15, 2014) న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంపెనీ తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 'ఫోక్స్‌వ్యాగన్ పోలో'ను విడుదల చేసింది.

ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ దక్కించుకున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇండియన్ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో హై పెర్ఫార్మెన్స్ వెర్షన్లను కోరుకునే వారి కోసం జిటి రేంజ్ మోడల్స్‌తో పాటుగా క్రాస్‌పోలో మోడల్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. పాత పోలోతో పోల్చుకుంటే కొత్త పోలో కారులో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌డేట్స్ ఉన్నాయి.


దేశీయ విపణిలో పెట్రోల్ వెర్షన్ (1.2 ఎమ్‌పిఐ) పోలో ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.6.07 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. డీజిల్ వెర్షన్ (1.5 టిడిఐ) పోలో ధరలు రూ.6.27 లక్షల నుంచి రూ.7.37 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. క్రాస్‌పోలో ధర రూ.7.90 లక్షలుగా ఉంది. పోలో జిటి టిడిఐ ధర రూ.7.99 లక్షలు గాను మరియు పోలో జిటి టిఎస్ఐ ధర రూ.7.99 లక్షలు గాను ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, ఫాగ్ ల్యాంప్స్, కార్నింగ్ లైట్స్, కొత్త హెడ్‌లైట్స్, కొత్త రియర్ బంపర్, కొత్త వీల్ కవర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ (టాప్-ఎండ్ వేరియంట్లో), కొత్త సీట్ కవర్స్, స్పోర్టీయర్ స్టీరింగ్ వీల్, సిల్వర్ పెయింటెడ్ సెంటర్ కన్సోల్, ఎయిర్‌బ్యాగ్స్ (అన్ని వెర్షన్లలో స్టాండర్డ్ ఫీచర్) మొదలైన అనేక ఫీచర్లతో ఈ కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో లభ్యం కానుంది.

2014 Volkswagen Polo

కొత్త పోలో జిటి టిఎస్ఐ, పోలో జిటి టిడిఐ మరియు క్రాస్ పోలో మోడళ్లు వచ్చే నెల మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫోక్స్‌వ్యాగన్ షోరూమ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త పోలో మోడళ్లలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ తప్ప మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Volkswagen, Europe’s largest carmaker, announces the launch of the stylish, technologically accomplished and dynamically exciting new Polo. The new Polo range is available with three-cylinder 1.2-litre MPI, four-cylinder turbocharged 1.2-litre TSI and all-new four-cylinder 1.5-litre TDI engines.
Story first published: Tuesday, July 15, 2014, 14:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X