ఫోర్ సీటర్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారును విడుదల చేయనున్న ఫోక్స్‌వ్యాగన్

By Ravi

జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్, లీటరు ఇంధనానికి 100 కిలోమీటర్లకు పైగా మైలేజీనిచ్చేలా తయారు చేసిన 'ఎక్స్ఎల్1' (XL1) హైబ్రిడ్ కారు గుర్తుందా..? ఇప్పటికే ఉత్పత్తి దశకు చేరుకొని, గ్లోబల్ కస్టమర్లకు చేరువైన ఈ కారులో కంపెనీ మరో వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 ప్రస్తుతం 2-సీటర్ ఆప్షన్‌తోనే లభిస్తోంది.

ఇది కూడా చదవండి: వయాసిస్ ఆఫ్ ది సీస్

కాగా.. కంపెనీ ఇందులో మరో రెండు సీట్లను అదనంగా చేర్చి దీనిని 4-సీటర్‌గా మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఫోర్-సీటర్ వెర్షన్‌ను 'ఎక్స్ఎల్2' (XL2) అని పిలిచే ఆస్కారం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ హైబ్రిడ్ కారులో రెండు అదనపు సీట్లను చేర్చినప్పటికీ, మైలేజీ మాత్రం తగ్గకుండా అదే 100 కెఎమ్‌పిఎల్ ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

గత కొద్ది సంవత్సరాలుగా ఫోక్స్‌వ్యాగన్ తమ ఎక్ఎల్స్1 హైబ్రిడ్ కారుపై పనిచేస్తోంది. గడచిన సంవత్సరం మార్చ్ నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ప్రొడక్షన్ వెర్షన్ ఎక్స్ఎల్1 మోడల్‌ను కంపెనీ ప్రదర్శించిది. ఈ ఏడాది జూన్ నెలలో తొలి కారును బెర్లిన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు అందజేసింది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో నడుస్తుంది. ఇందులో 47 బిహెచ్‌పి, ట్విన్-సిలిండర్, 800 సీసీ, టర్బో డీజిల్ ఇంజన్‌ను, అలాగే, 27 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్‌లను అమర్చారు.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఈ రెండు మోటార్లలో డీజిల్ ఇంజన్ రెగ్యులర్ డీజిల్‌తో నడుస్తుంది. ఇకపోతే ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం కారులో అమర్చిన 5.5 కిలోవాట్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు బరువును తేలికంగా ఉంచేందుకు గానూ దీని బాడీ నిర్మాణంలో ఎక్కువ భాగం ధృఢమైన కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు. ఫలితంగా ఈ కారు నుంచి అధిక మైలేజ్ రాబట్టడం సాధ్యమైంది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు మొత్తం బరువు 795 కేజీలు మాత్రమే. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు లీటరు ఇంధనానికి 111.16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 3.8 మీటర్ల పొడవును, 1.66 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 159.9 కిలోమీటర్లు. ఇది 12.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 కారులో 10 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ ఇంధనం సాయంతో 49.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. డీజిల్, బ్యాటరీ పవర్‌తో కలిపి ఈ కారులో 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు

దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, ఇది లక్ష డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.54 లక్షలకు పైమాటే (పన్నులు కలుపుకోకుండా).

Most Read Articles

English summary
According to reports, German car maker Volkswagen is currently working on a four-seat version of the XL1 hybrid car. 
Story first published: Monday, August 18, 2014, 14:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X