ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌కు బదులుగా టి-రాక్ ఎస్‌యూవీ!

By Ravi

జర్మన్ కార్ కంపెనీ మఇండియా గడచిన ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తమ పాపులర్ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టైగన్ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌కు వస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇప్పుడు మరో కొత్త పుకారు పుట్టుకొచ్చింది.

అదేంటంటే, టైగన్‌కు బదులుగా టి-రాక్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీ/క్రాసోవర్‌ను విడుదల చేసేందుకు ఫోక్స్‌వ్యాగన్ సన్నాహాలు చేస్తోందట. ప్రస్తుతం భారత్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉంటోంది. ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా ఓ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను ప్రవేశపెట్టాలని ఫోక్స్‌వ్యాగన్ ఎప్పటి నుంచో యోచిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌ల పరిశీలించండి.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీని తొలిసారిగా గడచిన మార్చ్ నెలలో జరిగిన 2014 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించారు. ఈ టూడోర్ కాన్సెప్ట్ డిటాచబల్ రూఫ్ (తొలగించుకోవటానికి వీలుగా ఉండే రూఫ్)తో లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీలో 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 182 హార్స్ పవర్‌ల శక్తిని మరియు 380 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ!

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీలో ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 4మోషన్ సిస్టమ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ!

ఎల్ఈడి హెడ్‌లైట్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీలో గమనించవచ్చు. ఈ మోడల్‌ను ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ!

ఇండియన్ వెర్షన్ ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ కాంపాక్ట్ ఎస్‍‌యూవీ 5-డోర్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. అలాగే, ఇక్కడి మార్కెట్‌కు అనుగుణంగా ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

Most Read Articles

English summary
Volkswagen India showcased the Taigun at the Auto Expo earlier this year, which was an obvious indication that it would bring this compact SUV here to take on the Renault Duster and Ford EcoSport. That could turn out not to be the case, however. In place of the Taigun we could see the T-Roc concept being launched in India.
Story first published: Tuesday, April 22, 2014, 14:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X