ఆటో ఎక్స్‌పో 2014: ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఆవిష్కరణ

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తమ పాపులర్ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత్‌కు పరిచయం చేయనున్నట్లు, తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ కాన్సెప్ట్ వాహనాన్ని 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బోచార్జ్డ్, డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 108 హార్స్ పవర్‌ల శక్తిని, 175 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కేవలం 8.2 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది. దీని గరిష్ట వేగం గంటకు 175 కిలోమీటర్లు. ఇది మొత్తం 985 కేజీల బరువును కలిగి ఉండి, లీటరుకు 21 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. గడచిన 2012లో జరిగిన సావ్ పాలో మోటార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది.

భారత్‌లో ఇది ఫోక్స్‌వ్యాగన్‌కు తొలి మరియు ఏకైక ఎస్‌యూవీగా నిలువనుంది. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పాపులర్ స్మాల్ కార్ 'అప్' ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టైగన్ ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Volkswagen Taigun

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 3.86 మీటర్ల పొడవును, 1.43 మీటర్ల వెడల్పును, 2.47 మీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని బూట్ స్పేస్ 280 లీటర్లు, వెనుక సీట్లను మడుచుకుంటే, బూట్‌స్పేస్‌ను 987 లీటర్లకు పెంచుకోవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Volkswagen, Europe’s leading automotive manufacturer, today unveiled its new SUV concept – the Taigun – at the Auto Expo, which is being held at the Expo Mart in Greater Noida. The Taigun is fitted with a highly efficient 1.0-litre turbocharged TSI petrol engine, which produces 108 horsepower and 175Nm of torque.
Story first published: Thursday, February 6, 2014, 10:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X