ఫోక్స్‌వ్యాగన్ ఇండియా నుంచి బడ్జెట్ కార్స్ వస్తున్నాయ్..!

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్ అత్యధిక పోటీతో కూడుకున్నది. ఈ మార్కెట్లో రాణించాలంటే విస్తృతమైన నెట్‌వర్క్ మరియు అన్ని వర్గాల ప్రజలకు సరిపోయే ప్రోడక్ట్స్ రెండూ చాలా అవసరం. జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఈ రెండు విషయాల్లోను ఇతర పోటీదారులతో పోల్చుకుంటే వెనుకంజలో ఉంది. అందుకే, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరచలేకపోతోంది.

అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలను పెంచుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మరికొద్ది రోజుల్లో తమ సరికొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. మరి ఈ మోడల్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే, గుడ్‌న్యూస్ ఏంటంటే, తక్కువ ధర కలిగిన బడ్జెట్ కార్లంటే ఇష్టపడే ఇండియన్స్ కోసం ఫోక్స్‌వ్యాగన్ తమ బడ్జెట్ కార్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందట.


ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ, కాంపాక్ట్ సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్‌ను ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్ల కోసం అభివృద్ధి చేస్తోంది. ఈ కొత్త ఉత్పత్తులు మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్ సంస్థలు ఆయా సెగ్మెంట్లలో అందిస్తున్న ఉత్పత్తులతో పోటీ పడనున్నాయి. ఫోక్స్‌వ్యాగన్ ఇండియాకు పూనేలో దాదాపు 4000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఉత్పత్తి కేంద్రం ఉంది.

ఈ జర్మన్ కంపెనీ తమ నిర్దేశిత అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. భారత్‌లోని ఇతర జపనీస్ కంపెనీలతో పోటీ పడాలంటే, సరికొత్త ప్రణాళికతో ముందుకు రావాలని ఫోక్స్‌వ్యాగన్ యోచిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న మోడళ్లలో పోలో హ్యాచ్‌బ్యాక్, వెంటో సెడాన్లనే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.

Volkswagen SUV

కాగా.. ప్రస్తుతం భారత కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సెగ్మెంట్లో పలు కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, మరికొన్ని కంపెనీలు రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్లో వాహనాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, కాంపాక్ట్ సెడాన్ మరియు బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఫోక్స్‌వ్యాగన్ ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించినప్పటికీ, ఆయా సెగ్మెంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనుకోవటం మాత్రం హర్షించదగిన విషయం. మీరేమంటారు..?
Most Read Articles

English summary
German automobile manufacturer Volkswagen has found it tough to sell high volumes in India. They will be launching a new Polo in the following months, however, it won't be the most price sensitive vehicle. There are now reports that the German manufacturer could launch a new range of affordable products.
Story first published: Tuesday, July 1, 2014, 14:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X