ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో ఫోక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్!

By Ravi

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఆటోమేటిక్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే, ఎక్కువ శాతం ఆటోమేటిక్ కార్లు కేవలం పెట్రోల్ వెర్షన్లలో మాత్రమే లభిస్తున్నాయి. డీజిల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్ల (లగ్జరీ కార్ల) ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన మార్కెట్లో బడ్జెట్, ప్యాసింజర్ కార్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు చాలా అరుదుగా దొరుకుతాయి.

ఉదాహరణకు, ప్రస్తుతం హ్యుందాయ్ వెర్నా మాత్రమే డీజిల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఇందులో 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటో గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అంత అధునాతమైనది కాదు అలాగని అత్యధిక మైలేజీనిచ్చేది కాదు. కాకపోతే, ఈ విభాగంలో దీనికి పోటీగా వేరే మోడల్ లేదు కాబట్టి, వెర్నా డీజిల్ ఆటోమేటిక్ అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి.


అయితే, త్వరలోనే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. హ్యుందాయ్ వెర్నా డీజిల్ ఆటోమేటిక్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ట్విన్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన వెంటో డీజిల్ సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మధ్యభాగం నాటికే ఇది మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని అంచనా.

ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ చేయనున్న ఈ ట్విన్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఒక 7-స్పీడ్ గేర్‌‌బాక్స్. ఈ తరహా గేర్‌బాక్స్‌ను ఇప్పటికే వెంటో టిఎస్ఐ, పోలో టిఎస్ఐ వేరియంట్లలో ఉపయోగిస్తున్నారు. 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన వెంటో టిడిఐ వేరియంట్లో ఈ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించనున్నారు.

Volkswagen Vento Diesel With Automatic Transmission

భారతదేశంలో లభిస్తున్న అనేక ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ (పెట్రోల్/డీజిల్) కార్లలో తయారీదారులు 4-స్పీడ్ బేసిక్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఫోక్స్‌వ్యాగన్ ఆఫర్ చేయనున్న ఈ కొత్త 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ (డిఎస్‌జి) కేవలం నామమాత్రపు ఇంజన్ టార్క్ లాస్‌తో అతివేగంగా గేర్లు మార్చుకునేందుకు సహకరిస్తుంది. డ్యూయెల్ క్లచ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇది స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌ను అందించడమే కాకుండా మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది.
Most Read Articles

English summary
According to a report, Volkswagen will launch the Vento diesel with the twin-clutch DSG automatic transmission by the middle of this year. Volkswagen's twin-clutch, DSG automatic transmission is a seven speed unit that's already provided with the Vento TSI and Polo TSI variants. The auto transmission will be mated to the 1.6 liter diesel engine in the Vento TDI.
Story first published: Monday, March 17, 2014, 5:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X