2014 సంవత్సరానికి గాను టాప్ 10 బెస్ట్ కార్ ఇంటీరియర్స్

By Ravi

కారు అందానికి మంచి ఎక్స్టీరియర్ లుక్ ఎంత అవసరమో, ఇంటీరియర్ లుక్ కూడా అంతే అవసరం. కారు ఎక్స్టీరియర్ ఎక్స్‌ట్రార్డినరీనిగా ఉండి, ఇంటీరియర్స్ ఆర్డినరీగా ఉంటే, పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంటుంది. ఈ కథనంలో టాప్ 10 బెస్ట్ ఇంటీరియర్స్ కలిగిన కార్ల గురించి తెలుసుకుందాం రండి..!

ఆటోమొబైల్ ప్రపంచంలో బెస్ట్ కార్, బెస్ట్ మైలేజ్ కార్, బెస్ట్ డిజైన్ ఇలా అనేక అవార్డులు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే వీటి లిస్ట్ చాంతాడంత అవుతుంది. అలాంటి ఓ అవార్డే బెస్ట్ ఇంటీరియర్స్ అవార్డు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మరియు లగ్జరీ ఫీచర్లతో తయారు చేయబడిన కార్ ఇంటీరియర్స్ కలిగిన ఆ బెస్ట్ కార్లను ఈ కథనంలో పరిశీలించండి.

వార్డ్స ఆటో అమెరికాలో విక్రయించబడుతున్న 41 విలాసవంతమైన వాహనానాల్లో టాప్ 10 బెస్ట్ ఇంటీరియర్లు కలిగిన కార్ల జాబితాను విడుదల చేసింది. ఎర్గోనమిక్స్, డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్, ఫిట్ అండ్ ఫినిష్, మెటీరియల్స్, విలువ, రక్షణ, నాణ్యత, సౌకర్యం మొదలైన పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ కార్లకు రేటింగ్ ఇవ్వటం జరిగింది. ఆ కార్లేంటో క్రింది స్లైడ్‌లలో చూడండి.

2014 షెవర్లే కార్వెట్ స్టింగ్‌రే (71,960 డాలర్లు)

2014 షెవర్లే కార్వెట్ స్టింగ్‌రే (71,960 డాలర్లు)

కస్టమైజబల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కార్బన్ ఫైబర్ ట్రిమ్, సీట్స్‌పై సూడ్-లైడ్ మైక్రోఫైబర్ హెడ్‌లైనర్ అండ్ కాంట్రాస్ట్ వైట్ స్టిచింగ్, సరసమైన ధర వంటి అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 క్రైస్లర్ 200సి (31,470 డాలర్లు)

2014 క్రైస్లర్ 200సి (31,470 డాలర్లు)

ఆంబీంట్ లైటింగ్, కాంట్రాస్ట్ పైపింగ్ ఆన్ లెథర్ ట్రిమ్డ్ సీట్స్, అట్రాక్టివ్ బ్రైట్‌వర్క్, ఎర్గోనమికల్లీ ఐడియల్ యాంగిల్డ్ సెంటర్ కన్సోల్, క్లెవర్ స్లైడింగ్ కప్ హోల్డర్, విశాలమైన క్యాబిన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రమాద వశాత్తు కీ లాక్ అయితే ఓపెన్ అయ్యే బూట్ డోర్ మొదలైన అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 జిఎమ్‌సి సీర్రా డెనాలీ (56,685 డాలర్లు)

2014 జిఎమ్‌సి సీర్రా డెనాలీ (56,685 డాలర్లు)

అత్యుత్తమ నిర్మాణ నాణ్యత, అనేక ఎలక్ట్రికల్ సాకెట్స్ మరియు యూఎస్‌బి ప్లగ్స్, అధిక స్టోర్/యుటిలిటీ స్పేస్, పెద్ద సెంటర్ కన్సోల్, హీటెడ్ అండ్ కూల్డ్ ఫ్రంట్ సీట్స్, హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటి అధునాతన అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 హ్యుందాయ్ ఈక్వస్ అల్టిమేట్ (68,920 డాలర్లు)

2014 హ్యుందాయ్ ఈక్వస్ అల్టిమేట్ (68,920 డాలర్లు)

సుపీరియర్ బిల్డ్ క్వాలిటీ, లిమోజైన్ మాదిరి లగ్జరీ ఫీచర్లు, విశాలమైన స్పేస్, సరసమైన ధర వంటి అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 జీప్ చిరోకీ లిమిటెడ్ (37,525 డాలర్లు)

2014 జీప్ చిరోకీ లిమిటెడ్ (37,525 డాలర్లు)

సిటీ డ్రైవింగ్ మరియు ఆఫ్-రోడింగ్‌ అడ్వెంచర్‌కు అనువుగా ఉండే క్యాబిన్, పెద్దగా ఉండి సులువగా యాక్సిస్ చేసుకోవటానికి వీలుగా ఉండే కంట్రోల్స్, క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్పస్ సెంట్రల్ డిస్‌ప్లే టచ్‌స్క్రీన్ వంటి అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 కియా సౌల్ ప్లస్ (24,010 డాలర్లు)

2014 కియా సౌల్ ప్లస్ (24,010 డాలర్లు)

ఆకర్షనీయమైన లుక్, అత్యంత సరసమైన ధర, 8 ఇంచన్ నావిగేషన్ స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు, బ్యాకప్ కెమెరా, పానోరామిక్ రూఫ్, ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, లైటెడ్ స్పీకర్స్ వంటి అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 మజ్దా 3 (30,415 డాలర్లు)

2014 మజ్దా 3 (30,415 డాలర్లు)

ఆడి లాంటి సెంట్రల్ కన్సోల్‌ను ఆఫర్ చేసే ఎంట్రీ-లెవల్ కారు, రాడార్ ఆధారిత అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాత సేఫ్టీ ఫచర్లు, ఫార్వార్డ్ అబ్‌స్ట్రక్షన్ వార్నింగ్, లేన్ డిపాచ్యుర్ వార్నింగ్, కార్భన్ పైబర్ ట్రిమ్, మూడు రంగుల స్టిచింగ్, హెడ్అప్ డిస్‌ప్లే, అప్‌స్కేల్ మెటాలిక్ యాక్సెంట్స్ వంటి అంశాలకు గాను ఇది ఈ రేటింగ్‌ను దక్కించుకుంది.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్550 (1,22,895 డాలర్లు)

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్550 (1,22,895 డాలర్లు)

ఇందులో అన్ని ఫీచర్లు విశిష్టమైనవే. ఉదాహరణకు.. ఏడు రంగుల యాంబీట్ లైట్, హాట్ స్టోన్ మసాజ్ ట్రీట్‌మెంట్, బిల్ట్ ఇన్ పిల్లోస్ ఫర్ రిక్లయినింగ్ రియర్ సీట్స్, పెర్ఫోరేటెడ్ లెథర్, మెటాలిక్ స్టెయిన్డ్ ఉండ్, డబుల్ వైడ్ డిస్‌ప్లే స్క్రీన్, అధునాత సేఫ్టీ ఫీచర్స్ మొదలైనవి.

2014 రోల్స్ రాయిస్ వ్రైత్ (3,72,800)

2014 రోల్స్ రాయిస్ వ్రైత్ (3,72,800)

అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇంటీరియర్స్.

2014 ఫోక్స్‌వ్యాగన్ జిటిఐ (30,695)

2014 ఫోక్స్‌వ్యాగన్ జిటిఐ (30,695)

సరసమైన ధరకే లభించే స్పోర్టీ, ఎలిగ్యాంట్ అండ్ ప్రాక్టికల్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్.

Most Read Articles

English summary
There are plenty of car awards that appreciate the how a car performs and how it looks on the outside, but very few which recognize the beauty, functionality and luxury of a car's interior.
Story first published: Monday, April 14, 2014, 13:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X