వీక్షించండి: డాట్సన్ గో ఫస్ట్ లుక్ వీడియో

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ 1986వ సంవత్సరం తర్వాత నిలిపి వేసిన తమ పురాతన కార్ బ్రాండ్ డాట్సన్‌ను తిరిగి 30 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్రాండ్ క్రింద 'గో' (Go) అనే చవక కారును న్యూఢిల్లీలోని కింగ్‌‌డమ్ ఆఫ్ డ్రీమ్ వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమవారం నాడు ఆవిష్కరించింది.

ఈ మేరకు డాట్సన్ గో కారుకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోని కూడా నిస్సాన్ ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో గోల్డ్ కలర్ డాట్సన్ గో కారు చూడొచ్చు. మరి ఆ వీడియోపై మనం కూడా ఓ లుక్కేద్దామా..?
<center>/four-wheelers/watch-datsun-go-first-look-official-video-004768.html</center>
డాట్సన్ గో గురించి సంక్షిప్తంగా..

  • నిస్సాన్ 30 ఏళ్ల తర్వాత డాట్సన్ బ్రాండ్ కార్లను తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది.
  • వచ్చే ఏడాది ప్రారంభం (2014)లో డాట్సన్ కార్లు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి.
  • ఇండియాతో పాటుగా ఇండోనేసియా, రష్యా, దక్షిణాఫ్రికాల్లో దేశాల్లో కూడా డాట్సన్ కార్లు విడుదల కానున్నాయి.
  • భారత్‌తో డాట్సన్ గో కారు ఈ సెగ్మెంట్లోని మారుతి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్, చెర్లే స్పార్క్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
  • భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కారును పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు.
  • ఇందులో మైక్రా నుంచి గ్రహించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.
  • డాట్సన్ గో కారులో డీజిల్ వెర్షన్ విడుదల గురించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
  • భారత్‌లో డాట్సన్ కార్లను చెన్నైలోని రెనో-నిస్సాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.
  • టూవీలర్ల నుంచి కార్లకు అప్‌గ్రేడయ్యే వినియోగదారులు, కొత్తగా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని డాట్సన్ గో కారును అభివృద్ధి చేశారు.
  • భారత మార్కెట్లో డాట్సన్ గో కారు ధర రూ.4 లక్షల కన్నా తక్కువగా ఉండనుంది.
  • భారత్‌లో 2016 నాటికి మొత్తం మూడు డాట్సన్ కార్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.
Most Read Articles

English summary
Datsun unveiled the first new Datsun car at the brand's world premiere in India on Monday. The all-new Datsun GO will go on sale in India in early 2014. Here is the first look video of Datsun Go. So let's go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X