7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఇండియాకు వస్తుందా?

By Ravi

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎమ్‌పివి (మల్టీ పర్సప్ వెహికల్) విభాగానికి చక్కటి ఆదరణ ఉంది. ఈ విభాగంలో లభ్యమవుతున్న పలు వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో, గడచిన సంవత్సరం జకార్తాలో జరిగిన 2013 ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో సుజుకి మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన 7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని మారుతి భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పాపులర్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‍‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త 7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని అభివృద్ధి చేశారు. ఇదొక 7-సీటర్ ఎమ్‌పివి, అయినప్పటికీ ఇది నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును (సబ్-ఫోర్ మీటర్ ఎమ్‌పివి) కలిగి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే, త్వరలోనే డాట్సన్ నుంచి విడుదల కానున్న గో ప్లస్ ఎమ్‌పివి పోటీగా సుజుకి తమ వ్యాగన్ఆర్ 7-సీటర్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి

జకార్తాలో జరిగిన 2013 ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో 'వ్యాగన్ఆర్ 3 రోస్ కాన్సెప్ట్' అనే పేరుతో సుజుకి ఈ వ్యాగన్ఆర్ ఎమ్‌పివిని ఆవిష్కరించింది.

7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి

సుజుకి ఆవిష్కరించిన ఈ వ్యాగన్ఆర్ 3 రోస్ కాన్సెప్ట్ కారు పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది ఎక్సైజ్ సుంకంలో రాయితీని పొంది, సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి

ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమేనని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సుజుకి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి

ఒకవేళ ఈ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఉత్పత్తి దశకు చేరుకుంటే, ఇది ఇండోనేషియన్ ఎల్‌సిజిసి (లో కాస్ట్ గ్రీన్ కార్) ప్రాజెక్టుకు అర్హత సాధిస్తుంది, ఫలితంగా పన్ను రాయితీలను పొందుతుంది.

7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి

ఇండోనేషియన్ మార్కెట్లో వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ధర 100 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్యల కన్నా తక్కువగా ఉండొచ్చని అంచనా. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.5.37 లక్షలతో సమానం.

7-సీటర్ వ్యాగన్ఆర్ ఎమ్‌పివి

వ్యాగన్ఆర్ ఎమ్‌పివి నేరుగా డాట్సన్ గో ప్లస్, హోండా మొబిలియో వంటి ఎమ్‌పివిలతో తలపడనుంది.

Most Read Articles

English summary
Japanese carmaker Suzuki has showcased its newly developed Wagon R MPV concept in 2013 Indonesian International Motor Show at Jakarta. Now reports arise that, Suzuki will bring this 7-seater WagonR MPV to India.
Story first published: Friday, April 4, 2014, 18:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X