అమ్మోనియాతో నడిచే కార్లను అభివృద్ధి చేస్తున్న పరిశోధకులు

By Ravi

పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో, దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారిస్తున్నాయి. అనేక కార్ కంపెనీలు ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాయి. మరికొన్ని కార్ కంపెనీలు సోలార్ ఎనర్జీతో నడిచే వాహనాలను తయారు చేయాలని చూస్తుంటే, కొన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు నీటితో నడిచే హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ కార్లను అభివృద్ధి చేస్తున్నాయి.

తాజాగా.. పరిశోధకులు 'అమ్మోనియా'తో వాహనాలను నడొపచ్చని చెబుతున్నారు. యూకే పరిశోధకులు వివరించిన దాని ప్రకారం, అమ్మోనియా కెమికల్ కాంపోజిషన్ NH3, దీనిని విడగొడితే నైట్రోజెన్, హైడ్రెజెన్‌లుగా విడిపోతుంది. ఈ 'క్రాకింగ్' ప్రాసెస్‌ను తీసుకురావటానికి ఓ క్యాటలిస్ట్ అవసరమని వారు చెబుతున్నారు.


వాస్తవానికి ఈ క్యాటలిస్టులు చాలా ఖరీదైనవి మరియు వాహనాలలో ఇవి అంత సమర్థవంతంగా పనిచేయలేవు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ కౌన్సిల్‌లోని శాస్త్రవేత్తలు క్రాకింగ్ అమ్మోనియాను విడగొట్టేందుకు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. సోడియం అమైడ్‌ను ఉపయోగించి అమ్మోనియాను విడగొడితే హైడ్రోజెన్ మరియు నైట్రోజెన్‌లు వేర్వేరుగా విడిపోతాయి.

ఈ అమ్మోనియాను వాహనాల్లోని ప్లాస్టిక్ ట్యాంకులలో తక్కువ పీడనం వద్ద స్టోర్ చేస్తారు (సిలిండర్లలో ఎల్‌పిజిని స్టోర్ చేసినట్లుగా). అమ్మోనియాను తక్కువ పీడనం వద్ద స్టోర్ చేసి ఉంచడం వలన అది పేలిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అమ్మోనియాతో నడిచే వాహనాలను ఉపయోగించడం వలన కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి.

Hybrid Car

కంబస్టియన్‌లో అమ్మోనియాను ఉపయోగించినప్పుడు అది మానవాళికి, ప్రకృతికి హాని కలిగించే ప్రమాదక NOx వాయువును విడుదల చేస్తుంది. NOx వాయువును విడుదల చేయకుండా నిలుపుదల చేసి, అమ్మోనియాను సురక్షితంగా ఉపయోగించే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నామని ప్రొఫెసర్ డేవిడ్ వ్యాఖ్యానించారు.

ఆటోమొబైల్స్‌లో ఉపయోగించే అమ్మోనియా క్యాటలిస్ట్ దాదాపు 2 లీటర్ల సోడా బాటిల్ అంత పెద్దగా ఉంటుంది. ఓ ఫ్యామిలీ కారుకు సరిపడా హైడ్రోజెన్ వాయువును ఇది ఉత్పత్తి చేస్తుంది. అమ్మోనియా వాయువు అంత ఖరీదైనది కాదు మరియు ఇది చాలా విరివిగా దొరుకుతుంది. మన ప్రస్తుత ఫ్యూయెల్ పంప్స్ సాయంతోనే వీటిని ట్యాంకులలో ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఎల్‌పిజి, సిఎన్‌జి కార్ల మాదిరిగానే భవిష్యత్తులో అమ్మోనియాతో నడిచే వాహనాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట.

Most Read Articles

English summary
Now certain scientists from UK have formulated a way to utilise Ammonia to run vehicles. In words it can be simply explained as Ammonia's chemical composition is NH3, which when broken down will form nitrogen and hydrogen. The procedure requires a catalyst to begin the 'Cracking' process.
Story first published: Wednesday, July 2, 2014, 9:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X