మీ కార్ రీసేల్ వ్యాల్యూని పెంచుకోవడానికి చిట్కాలు

మీ కారును ఎక్కువ రేటుకు విక్రయించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ్టి ఆర్టికల్ లో తెలుసుకుందాం.

By N Kumar

కారును అమ్మేయాలి అనే ఆలోచనకు వచ్చారంటే అది కచ్చితంగా మీ మనసును నొప్పించేదే అయివుంటుంది. ఎందుకంటే చాల మంది తమ కారును ఇంట్లోని సొంత మనిషిలా చూసుకుంటారు. మరి అలాంటి కారును అమ్మేయాలి అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ కొన్ని కారణాల నిమిత్తం మీరు కారును విక్రయించాలి అనే నిర్ణయానికి వచ్చాక తప్పకుండా మంచి రేటుకే అమ్మాలనుకుంటారు... మీ కారును ఎక్కువ రేటుకు విక్రయించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ్టి ఆర్టికల్ లో తెలుసుకుందాం.

రోజూ వారి నిర్వహణ:

రోజూ వారి నిర్వహణ:

రెగ్యులర్ సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్ కారును స్మూత్ గా నడపడానికి వీలు కలిపిస్తుంది, అలాగే దీర్ఘకాల పనితీరుకు దోహద పడుతుంది. కారును ఎప్పుడు కంపెనీ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్‌లోనే సర్వీస్ చేయించండి మరియు స్పేర్ పార్ట్స్ కూడా ఎల్లపుడు ఒరిజినల్ పార్ట్స్‌నే వాడండి. ఒరిజినల్ పార్ట్స్ కారును కొత్తదానిలా చేస్తుంది, ఇందువల్ల రిసేల్ వాల్యూ పెరుగుతుంది.

సర్వీస్ హిస్టరీ మరియు డాక్యుమెంట్స్‌ను జాగ్రత్త ఉంచుకోండి:

సర్వీస్ హిస్టరీ మరియు డాక్యుమెంట్స్‌ను జాగ్రత్త ఉంచుకోండి:

సర్వీస్ హిస్టరీ రికార్డులు కొనుగోలుదారునికి మనం కారుకు ఎప్పటికప్పుడు సర్వీస్‌ చేయించిన నమ్మకాన్ని కలిగిస్తుంది. మీ కారు మంచి రన్నింగ్ కండీషన్‌లో ఉన్నట్లయితే సర్వీసింగ్ చేయించటం వల్ల కారును మంచి రేటుకు అమ్మేయవచ్చు. మీదగ్గర ఇప్పటివరకు చేయించిన సర్వీస్ హిస్టరీ లేకపోతే వెంటనే మీ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి సర్వీస్ కు సంబంధించిన పత్రాలను సేకరించండి. అలాగే కారుకు ఎప్పటికపుడు ఇన్సూరెన్స్ చేయించడం మాత్రం మరచిపోకండి.

వారంటీ:

వారంటీ:

మీ సర్వీస్ సెంటర్స్‌కు కొద్ది మొత్తంలో డబ్బును చెల్లించడం ద్వారా కారు వారంటీను పెంచుకోవచ్చు. అనుకోని ప్రమాదాలలో ఈ వారంటీ చాలా వరకు మీ జోబుకు చిల్లు పడకుండా డబ్బును ఆదా చేస్తుంది. మరియు వారంటీ ఉండడం వల్ల కొనుగోలుదారుడు కూడా కారును కొనడానికి ఉత్సాహం చూపించవచ్చు.

కారును శుభ్రంగా ఉంచుకోండి:

కారును శుభ్రంగా ఉంచుకోండి:

శుభ్రంగా లేని కారు ఖచ్చితంగా కొనుగోలుదారుడి మనసుని ఆకర్షించదు. ఇలాంటి కారు కండిషన్ ఎంత బాగా ఉన్నప్పటికీ కారు మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి వలన కారు పనిచేయదేమోనన్న ఆలోచన కొనుగోలుదారునికి రావచ్చు. కావున ప్రతి ఒక్కరు తమ కారును లోపల మాత్రమే కాకుండా బయట కూడా క్లీన్‌గా ఉంచుకోవాలి. అప్పుడే కారు యొక్క విలువ మరియు శుభ్రంగా ఉన్న కారు వల్ల మీ విలువ రెండూ పెరుగుతాయి.

అన్ని పనిచేస్తున్నాయో లేదో చుడండి:

అన్ని పనిచేస్తున్నాయో లేదో చుడండి:

మీ కారును విక్రయించడానికి మీరు ఇవ్వనున్న ప్రకటనలో " ఫుల్లీ ఫంక్షనల్" అని రాయడం ద్వారా కొనుగోలుదారుని కన్ను మీ కారు పైన ఖచ్చితంగా పడుతుంది. కానీ కొనుగోలుదారుడు మీ కారును తనిఖీ చేసే సమయంలో ఏ లైటో లేదంటే ఓ చిన్న వైర్ పాడైపోయి పనిచేయకపోతే, తను మీరు ఊహించిన రేటుకు ఖచ్చితంగా కొనడు. బల్బ ఫిక్స్ చేయడం సులభమే కావచ్చు కానీ తనకు మీ కారు మీదున్న నమ్మకం పోతుంది కావున కారును ఒకటికి రెండు సార్లు పరీక్షించిన తరువాతే కారును కొనుగోలుదారునికి చూపించండి.

మోడిఫికేషన్స్ మానుకోండి:

మోడిఫికేషన్స్ మానుకోండి:

వేల రుపాయలు వెచ్చించి కారును మోడిఫై చేయించి ఉండవచ్చు కానీ మీరు చేయించిన మోడిఫికేషన్ అందరికి నచ్చాలనుకోవడం పొరపాటే అవుతుంది. మీరు చేయించిన మోడిఫికేషన్స్ కొనుగోలుదారునికి నచ్చకపోవచ్చు, తనకు నచ్చిన ధరకే బేరమాడవచ్చు.

ఇంజిన్ మోడ్స్ మరియు పెర్ఫార్మన్స్:

ఇంజిన్ మోడ్స్ మరియు పెర్ఫార్మన్స్:

ఇంజిన్ మోడ్స్ ను ఎలాంటి పరిస్థితులలోను మార్చకండి. ఇలా చేసినట్లయితే మీరు మోడ్స్ మార్చే క్రమంలో కారుకు ఏదైనా డ్యామేజ్ కలిగించి ఉంటారనే కోణంలో కస్టమర్ ఆలోచిస్తాడు. కావున సాధ్యమైనంత వరకు మీరు కారును ఎలాగైతే గోనుగోలు చేసారో అలాగే ఉంచడానికి ప్రయత్నించండి. ఎక్కువ పవర్ కోసం ఇంజన్‌కు మార్పులు చేయించడం చట్టపరంగా తప్పు.

పెయింట్ విషయంలో:

పెయింట్ విషయంలో:

ప్రకాశవంతమైన పసుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు మీకు బానే కనపడవచు కానీ చాల వరకు రోడ్ల మీద సిల్వర్ మరియు తెల్ల కార్లే తిరుగుతున్నాయి అంటే చాల మందికి సిల్వర్, తెలుపు కార్లంటేనే ఇష్టం, మీరు కారును అమ్మేయాలి అనే పక్షంలో ఈ రెండు రంగులను ఎంచుకోవడానికే ప్రాధాన్యం ఇవండి. ఒకవేళ మీది స్పోర్ట్స్ కార్ అయితే బ్రైట్ కలర్స్ చాల మందికి నప్పుతాయి.

మంచి డ్రైవింగ్ కండీషన్‌లో ఉంచండి:

మంచి డ్రైవింగ్ కండీషన్‌లో ఉంచండి:

కారు ఎలా నడుస్తోంది అనే దానిపై దృష్టి పెట్టండి. క్లచ్ మరియు బ్రేక్ సరైన షేప్ లో ఉన్నాయో లేదు చూసుకోండి. ఒకవేళ కారు నడుపుతున్నపుడు ఏదైనా శబ్దం వస్తే వెంటనే దానిపై దృష్టి సారించండి, శబ్దం చిన్నదే కావచ్చు కానీ అది కారును సరిగ్గా మెయింటైన్ చేయలేదనే దానికి నిదర్శనం అవుతుంది.

ట్రాఫిక్ ఫైన్లకు దూరంగా ఉండండి:

ట్రాఫిక్ ఫైన్లకు దూరంగా ఉండండి:

మీ కారు పైన ట్రాఫిక్ కేసులు ఉంటే వెంటనే ఫైన్లు చెల్లించి క్లియర్ చేసుకోండి. ఈ రోజుల్లో ఇ-చలానా సిస్టమ్ దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. కారు రిజిస్ట్రేషన్ నెంబర్‌తో కారు పై ఉన్న కేసులను చాల సులభంగా తెలుసుకోవచ్చు. మీ కారు పైన ఏవైనా కేసులు ఉన్నట్లయితే కొనుకోలుదారుడు మీ కారును చాల తక్కువ రేటుకు కొనుగోలు చేయవచ్చు.

పైన చెప్పినవి పాటిస్తే మీ కారును మీరు అనుకున్న రేటు కంటే ఒకింత ఎక్కువకే అమ్మేయవచు, ఇంకెందుకు ఆలస్యం మీ కారుని ఫోటో తీసి నెట్ వేసిలో అమ్మేయండి గురూ....

Most Read Articles

English summary
Read In Telugu 10 Tips To Improve Car Resale Value
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X