ఖచ్చితంగా పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, వాటి జరిమానా వివరాలు

Written By:

వాహనాలను నడపడం గురించి తెలిసినంతగా ట్రాఫిక్ రూల్స్ గురించి చాలా మందికి తెలియదు. కొన్ని ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే మనకు నష్టం, మరికొన్ని ట్రాఫిక్స్ నియమాలను ఉల్లంఘిస్తే ఇతరులకు నష్టం. నేటి కథనంలో మనం వాహనం నడుపుతున్నపుడు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు మరియు వాటిని పాటించకపోతే ఎలాంటి జరిమానా చెల్లించాలి అనే వివరాలను ఇవాళ్టి "చాలా మందికి తెలియని ట్రాఫిక్ రూల్స్ అండ్ వాటి ఫైన్ల వివరాలు" అనే స్టోరీలో తెలుసుకుందాం రండి...

ఈ కథనంలోని ట్రాఫిక్ నియమాలు చాలా మందికి దాదాపు తెలియవు, డ్రైవర్ మరియు ప్యాసింజర్లు తమ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలను ఎదుర్కోకుండా చక్కటి ప్రయాణాన్ని పొందాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే.

01. అనుచితమైన పార్కింగ్

పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంలో మీ కారును పార్కింగ్ నుండి బయటకు తీయడానికి ముందు లేదా వెనుక ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే రీతిలో పార్కింగ్ చేసినట్లయితే సమీప పోలీసుకు సమాచారం ఇవ్వచ్చు. మరియు ఆ సంభందిత వాహనం యొక్క డ్రైవర్ రూ. 100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో పార్కింగ్ చేయడం మరవకండి.

02. హారన్ లేని వాహనం

మీ వాహనంలోని హారన్ సరిగా పనిచేయలేదా...? ఈ సంగతి పోలీసుకు తెలిసిందంటే 100 రుపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులను హెచ్చరించేందుకు ఉపయోగపడే హారన్ లేకపోయినా మరియు పనిచేయకపోయినా చట్ట ఉల్లంఘన అవుతుంది.

03. ఫస్ట్ ఎయిడ్ కిట్

మీరు చెన్నై లేదా కలకత్తా నగరాల్లో మీ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నారా...? అయితే మీ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరి. డ్రైవర్ లేదా ప్యాసింజర్లు ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రతమ చికిత్స అందించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకుండా వాహనాన్ని నడిపితే మూడు నెలల కఠిన కారాగార శిక్ష లేద రూ. 500 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

04. కారులో సిగరెట్ కాల్చడం

కార్లు కాలి బూడిదైన కేసుల్లో ఎక్కువ శాతం సిగరెట్ కాల్చి పడేయడమే కారణం అని తేలింది. ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో వాహనంలో సిగరెట్ కాలుస్తూ పట్టుబడితే రూ. 100 లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

05. ప్రజా అవసరాలకు ఆటంకం కలిగిస్తూ పార్కింగ్ చేయడం

బస్టాప్స్ మరియు ఇతర ప్రజా ప్రయోగ ప్రదేశాల్లో మీ వాహనాన్ని పార్కింగ్ చేయటం చట్ట ఉల్లంఘన అవుతుంది. ముఖ్యంగా కలకత్తా నగరంలో ఇలా పార్కింగ్ చేస్తే రూ. 100 ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

06. ఇతరుల వాహనాలు తీసుకెళ్లడం

బయ్యా చిన్న అవసరం ఉంది ఇప్పుడే వచ్చేస్తాను అని మీ బైకు లేదా కారుని ఎవరికైనా ఇచ్చారా అంతే సంగతులు. ఇలా చేయడం కూడా ఇప్పుడు ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనే. ఇందుకుగాను రూ. 500 ల వరకు జరిమానా లేదంటే ఒక్కోసారి మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.

07. డ్యాష్ బోర్డులో వీడియో పరికరాన్ని అమర్చడం

సాధారణంగా కారు డ్యాష్ బోర్డులో కార్ల తయారీ సంస్థలు వీడియో తెర గల డివైస్‌లను అందివ్వవు. కారణం డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ ఏకాగ్రత రహదారి నుండి డిస్ల్పే మీదకు మళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కారులో డిస్ల్పే అమర్చకున్నట్లయితే పోలీసులకు పట్టుబడిన రూ. 100 లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

08. నాన్ మోటార్ వెహికల్స్ కు ఎలాంటి చట్టాలు ఉండవు

ఇంజన్ రహిత వాహనాలపై ఇప్పటి వరకు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ లేవు. వీటిని మోటార్ వెహికల్ చట్టాలలో పొందుపరచలేదు.

09. ఎన్నికల ప్రచారానికి వాహనాలను ఇవ్వడం

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు వారి ప్రచార కార్యక్రమాలకు మీ వాహనాలను ఇవ్వచ్చు. దీనికి సంభందించిన ఎలాంటి రూల్స్ లేవు. అయితే పోలింగ్ సమయంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా తరలించడాన్ని నిషేధించారు.

10. రోజులో రెండు సార్లు ఫైన్ చెల్లించనవసరం లేదు

ఒక రోజులో ఫైన్ చెల్లించిన తరువాత అదే రోజు రెండోసారి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే చెల్లించిన జరిమానా తాలుకు రసీదు మాత్రం తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. ఉదాహరణకు, హెల్మెట్ లేని కారణంగా జరిమానా చెల్లించినట్లయితే ఆ రోజు అర్థరాత్రి వరకు మరో మారు ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే దీని అర్థం ఫైన్ చెల్లించాక హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని కాదు. గుర్తుకోండి... ఎల్లప్పుడు హెల్మెంట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, December 24, 2016, 17:57 [IST]
English summary
10 Traffic Laws You Have No Idea About
Please Wait while comments are loading...

Latest Photos