వెహికల్ సేఫ్టీ పరంగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్న కేంద్రం

అన్ని కార్లు మరియు బస్సుల్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) కల్పించాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసేలోపు ఆ యా వాహన తయారీ సంస్థలు తమ కార్లు మరియు బస్సుల్లో ఏబిఎస్‌ను అందించాల్సి ఉంటుంది

By Anil

చిత్తడి మరియు జారుడు స్వభావం ఉన్న రహదారుల మీద బ్రేకులు వేసినప్పుడు వాహనాలు ఓ పట్టాన ఆగవు. తద్వారా అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే దీనిని నియంత్రించేందుకు ఆటోమొబైల్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన ఆవిష్కరణ ఏబిఎస్. ఇప్పుడు దేశీయంగా విడుదలయ్యే అన్ని కార్లలో మరియు బస్సుల్లో ఈ ఏబిఎస్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

దేశీయ మరియు అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా వాహన ప్రమాద రేటును చాలా తగ్గించవచ్చని తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట విడుదలయ్యే అన్ని వాహనాల్లో ఏబిఎస్ తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

2019 ఏప్రిల్ నాటికి అన్ని వాహనాల్లో ఏబిఎస్ తప్పనిసరిగా అందించాలని గడువు కూడా విధించింది. గడువు లోపు వాహన తయారీ సంస్థలు తమ కార్లు మరియు బస్సుల్లో ఏబిస్ ను స్టాండర్డ్ ఫీచర్‌గా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

జారుడు, చిత్తడి మరియు పల్లపు ప్రదేశాల్లో బ్రేకులు వేసినప్పటికీ టైర్లు జారుతూ వాహనం ముందుకు వెళుతుటుంది. దీనిని బ్రేకులు లాక్ లేదా స్కిడ్ అవ్వటం అని చెప్పవచ్చు. అయితే ఓ అధ్యయం ప్రకారం ఏబిఎస్ ఫీచర్ ఉండటం ద్వారా 20 శాతం వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని తేలింది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం, అన్ని కొత్త మోడళ్లు ఏప్రిల్ 2018 నాటికి యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండాలని తెలిసింది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

అన్ని కొత్త మోడళ్లు మరియు అప్పటికే ఉన్న మోడళ్లలో కూడా సంభందిత వాహన తయారీ సంస్థలు ఏప్రిల్ 2019 లోపు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించడం జరిగింది.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

ఇప్పటి వరకు దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను ఆప్షనల్‌గా మాత్రమే అందిస్తున్నాయి. ఎలాంటి బేస్ వేరియంట్ తీసుకున్నా అందులో ఏబిఎస్ ఉండదు. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 2019 నుండి ఈ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా పొందవచ్చు.

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

Most Read Articles

English summary
Government Sets A Deadline To Install ABS On Cars & Buses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X