కారులో ఏసి ని వినియోగించే వారికి ఉత్తమ చిట్కాలు

Written By:

వేసవి కాలంలో లేదా బాగా ఉక్కపోత వాతావరణం ఉన్నపుడు కార్లు, మరే ఇతర వాహనాలలో కూడా అస్సలు కూర్చోలేము. ఎండ వేడిమి నుండి కాస్త ఉపశమనం పొందాలంటే ఉన్న ఏకైక మార్గం ఏ/సి. తయారీ దారులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి అత్యాధునిక పరిజ్ఞానంతో ఆటోమేటిక్ ఏ/సి లేదా క్లైమేట్ కంట్రోల్స్‌ను అందించారు. ఇవి ఏవిధమైన సమస్య లేకుండా నిరతరం పనిచేస్తుంటే ప్రాబ్లమ్సే ఉండవు.

కొన్ని సందర్భాల్లో ఆ వాతావరణ నియంత్రికలు అస్సలు పని చేయవు. అలాంటి సందర్బాలు ఎందురుకాకుండా ఉండేందుకు గల కొన్ని మెళుకువలు నేటి చిట్కాలు సెక్షన్ ద్వారా తెలుసుకుందాం రండి.

1. అద్దాన్ని కాస్త క్రిందకు దించి ఉండేలా చేసుకోండి

సాధారణంగా వాతావరణంలో ఉన్న వేడికి కారులో ఉన్న గాలి వేడెక్కుతుంది. అయితే ఈ గాలిని చల్లబరిచేందుకే ఏ/సి పనిచేస్తుంది. దాని కంటే ముందు అద్దాన్ని కాస్త ఒపెన్ చేసి ఉంచితే కారులోని వేడి గాలి బయటకువ వెళ్లిపోతుంది. అప్పుడు ఇంటీరియర్‌లో ఉన్న గాలిని చల్లబరచడం ఏ/సి కి ఎంతో సులభంగా ఉంటుంది. కాబట్టి ఒక అద్దాన్ని కాస్త క్రిందకు దించే ఉంచండి.

2. రీసర్క్యులేషన్

మీరు కారును స్టార్ట్ చేసే ముందు రీసర్క్యూలేషన్ మోడ్‌న్ ఆఫ్ చేయండి. తద్వారా వెంటిలేషన్ నుండి కారులోని వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. ఎప్పుడైతే కారులోని వేడి గాలి కాస్త చల్లబడితే అప్పుడు రీసర్కులేషన్‌ను ఆన్ చేయండి. అప్పుడు అత్యంత సులభంగా మరియు వేగంగా క్యాబిన్‌లోని గాలి చల్లబడుతుంది. ఈ పద్దతిని ఇలాగే నిరంతరం చేస్తూ ఉండండి.

3. నిర్వహణ

కారులోని ఏ/సి నిరంతరం ఏ విధమైన అవాంతరలను ఎదుర్కోకుండా మంచి కండీషన్‌లో పనిచేయాలంటే. ఏ/సికి డైలీ మెయింటెనెన్స్ ఎంతో ముఖ్యం. ఏ/సి పనితీరులో ఏదైనా వ్యత్యాసం కనబడినట్లయితే కంప్రెసర్‌ను గమనించండి.

ప్రతి ఏడాది కూడా వేసవి కాలం ప్రారంభమయ్యే సమయానికల్లా మీ కారు అధీకృత డీలర్ వద్ద ఏ/సి ని చెక్ చేయించుకోండి ఇలా చేయడం వలన ఏ/సి పనితీరులో ఎలాంటి అవాంతరాలు రావు.

4.తక్కువ వేగంతో నియంత్రించడం

మీ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నట్లయితే తక్కువ వేగం వద్ద ఏ/సి ని ప్రారంభించండి. అత్యంత వేగంగా కారులోని వేడి గాలిని నియంత్రించే మార్గాల్లో ఇది ఒకటి. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఏ/సి ను పెంచుకోండి.

5. ఎక్కువ ఏ/సి

మీరు కారును ఎండలో పార్క్ చేసినట్లయితే విపరీతమైన వేడికి గురవుతుంది. అందుకు ముందుగా కారు అద్దాలన్నీ క్రిందకు దించేసి ఏ/సి బాగా పెంచండి. తరువాత ఏ/సి వెంట్‌ల నుండి చల్లని గాలి వస్తోంది అనే విషయాన్ని గుర్తించిన తరువాత మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. వెంట్‌ల ద్వారా చల్లటి గాలి రావడం మొదలయ్యాక రీసర్క్యులేషన్‌ను ఆన్ చేయండి, తద్వారా సిస్టమ్ మీద ఎక్కువ ప్రెసర్ లేకుండా ఏ/సి పని చేస్తుంది.

6. సన్ ఫిల్మ్‌లు

సూర్యుని నుండి విడుదలయ్యే కిరణాల్లో అత్యంత వేడి కిరణాలు సరాసరిగా కారులోపలికి ప్రవేశించకుండా నాణ్యమైన సన్ ఫిల్మ్‌లను అద్దాలకు అంటించండి (ఆర్‌టిఒ ఆధికారులు ఆమోదించిన మరియు వారి ప్రమాణాలను పాటించే విధంగా ఉన్న సన్ ఫిల్మ్‌‌లను వినియోగించండి).

7. థర్మోస్టార్ట్‌ను వినియోగించండి

బాహ్య వాతావరణాన్ని అనుసరించి కారులో ఏ/సి ని వాడు కోవడం ఉత్తమం. వర్షా కాలంలో ఏ/సి ని ఎక్కువ కూల్‌గా ఉండేంట్లు వినియోగించుకోకండి.

8. దూర ప్రాంత ప్రయాణాలలో

ఒక్కో ప్రాంతాన్ని బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది. అప్పుడు వాతావరణం వేడిగా మరియు చల్లగా మారుతూ ఉంటుంది. కాబట్టి మ్యాన్యువల్ ఏ/సి ఉన్న వారు ఎక్కువ చల్లగా ఉన్నపుడు ఏ/సి తగ్గించడం మరియు ఎక్కువ వేడిగా ఉన్నపుడు పెంచుకోవడం చేస్తుండాలి. ఇలా చేయడం వలన ఏ/సి మీద భారం తగ్గుతుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, September 6, 2016, 11:23 [IST]
English summary
Best Tips To Effectively Use AC In Your Car
Please Wait while comments are loading...

Latest Photos