మీ కలల కారును సొంతం చేసుకునేందుకు 6 సింపుల్ స్టెప్స్

By Ravi

కారు కొని, అందులో ప్రయాణించాలని ప్రతిఒక్కరూ కల కంటారు. తమ కలల కారును సొంతం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతారు. దాచుకున్న సొమ్ముతోనో లేక ఫైనాన్స్ ద్వారానో కారును కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే, ఏ కారు కొనాలో ఖచ్చితంగా నిర్ధారించుకోలేదు. నలుగురిని విచారిస్తారు, ఒక్కొక్కరూ ఒక్కోరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాంతో తమ గందరగోళం మరింత పెరుగుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో అనేక కొత్త మోడళ్లు, బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఏ బ్రాండ్ కారు కొనాలో అనేది కూడా ఓ ప్రశ్నగానే మిగిలిపోతోంది. చాలా మందికి కారును ఎలా కొనాలో తెలియక, తమకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక కారును కొనేయటమో లేదా డీలర్లు చేసే జిమ్మిక్కులకు పడిపోయి జేబులకు చిల్లు పెట్టుకోవటమో చేస్తుంటారు. మరి సింపుల్‌గా కారును ఎలా కొనుగోలు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కొత్త కారు కొనటం ఎలా?

తర్వాతి స్లైడ్‌లలో కొత్త కారును కొనుగోలు చేయటానికి సంబంధించి చిట్కాలను తెలుసుకోండి.

బడ్జెట్

బడ్జెట్

కారు కొనాలని నిర్ణయించుకున్న ప్రతిఒక్కరు బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. తమ బడ్జెట్‌లోనే నాణ్యమైన కారును కొనాలని భావిస్తారు. కాబట్టి, మీ బడ్జెట్ ఎంత అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకోండి. ఒకవేళ మీరు లోను ద్వారా కారును కొనాలనుకుంటే, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలనుకుంటున్నారు, లోన్ అమౌంట్, ఈఎమ్ఐ ఎంత అనే విషయాలను తెలుసుకోండి. లోన్ ద్వారా కారును కొనాలనుకుంటే, సదరు ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంక్ రెప్యుటేషన్‌ను కూడా పరిగణలోకి తీసుకోండి.

మీ అవసరాలను గుర్తించండి

మీ అవసరాలను గుర్తించండి

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ కార్ల నుంచి హై-ఎండ్ లగ్జరీ కార్ల వరకూ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కార్లు అందుబాటులో ఉన్నాయి. కారులో ఎంత మంది ప్రయాణిస్తారు? తరచూ దూరప్రయాణాలు చేస్తారా? ఆడియో/వీడియో సిస్టమ్, సేఫ్టీ ఫీచర్స్, టెక్నాలజీ ఫీచర్స్ మొదలైనవి కావాలా? అనే అంశాలను తెలుసుకోండి. ఆ ఫీచర్లు ఉన్న కారు మీ బడ్జెట్‌లో ఉందో లేదో తేల్చుకోండి.

పెట్రోల్ కారా లేక డీజిల్ కారా

పెట్రోల్ కారా లేక డీజిల్ కారా

సాధారణంగా ప్రతి కార్ బయ్యర్, కారు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత ఆలోచించేది ఇదే, పెట్రోల్ కార్ కొనాలా లేక డీజిల్ కార్ కొనాలా అని. మీరు కేవలం సిటీ కోసం మాత్రమే కారును వినియోగించాలనుకుంటే, అదీ మీరు రోజు 20-30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయని వారైతే మీకు పెట్రోల్ కార్ మంచి ఆప్షన్. అలాకాకుండా, మీరు సగటున నెలకు 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవారు, తరచూ దూరప్రయాణాలు చేసే వారైతే మీకు డీజిల్ కార్ బెస్ట్ ఆప్షన్.

రీసెర్చ్

రీసెర్చ్

కారు కొనాలని నిర్ణయించుకున్న తర్వాత మీ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న పలు రకాల కార్ల గురించి రీసెర్చ్ చేయండి. వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉండే సమాచారం ద్వారా కానీ లేదా నాలుగైదు షోరూమ్‌లను సందర్శించి కానీ మీరు కొనాలనుకునే కార్ గురించి విచారణ చేయండి. ఉదాహరణకు మీ బడ్జెట్ రూ.4-5 లక్షలు అనుకుంటే, ఆ రేంజ్‌లో ఉన్న పాపులర్ బ్రాండ్ కార్లను చెక్ చేయండి లేదా మీకు ఏదైనా నిర్దిష్టమైన కార్ బ్రాండ్ గురించి అవగాహన ఉండి, అదే బ్రాండ్‌ను కొనాలని నిర్ణయించుకుంటే, సదరు కార్ మోడల్‌కు సంబంధించి రెండు మూడు షోరూమ్‌లలో విచారణ చేయండి. ఎక్కడ బెస్ట్ డీల్, డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

ఉత్తమ డీలర్‌ను, ఇన్సూరర్‌ను ఎంచుకోండి

ఉత్తమ డీలర్‌ను, ఇన్సూరర్‌ను ఎంచుకోండి

కారును కొనుగోలు చేసేటప్పుడు డీలర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెద్దగా పేరు లేని లేదా ఎక్కువగా ఫిర్యాదులు ఉన్న డీలర్ వద్ద కారు కొనకపోవటమే ఉత్తమం. డీలర్ హిస్టరీని, వారి పనితీరును జాగ్రత్తగా పరిశీలించండి. భవిష్యత్తులో మీ కారుకు ఏదైనా సమస్య వస్తే, సదరు డీలర్ సరిగ్గా స్పందిస్తారో లేదో తెలుసుకోవాలి. అలాగే, ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. భవిష్యత్తులో ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు, సదరు ఇన్సూరర్ స్పందన ఎలా ఉంటుందో అనే విషయాన్ని కంపెనీ ట్రాక్ రికార్డును బట్టి తెలుసుకోవాలి.

డీల్ ఫైనల్ చేసుకోండి

డీల్ ఫైనల్ చేసుకోండి

ఈ విషయాలన్నీ తెలుసుకొని, కారు కొనాలనుకున్న డీలర్ గురించి మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత డీల్ ఫైనల్ చేసుకోండి. మీ కలల కారును సొంతం చేసుకోండి.

సురక్షితంగా డ్రైవ్ చేయటం మర్చిపోకండి. కారు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్టులను ధరించండి.

Most Read Articles

Read in English: How To Buy A Car In 6 Steps
English summary
Buying a car is at times a very difficult decision to make. A car is probably the second most expensive thing some one will buy after a house. If you are planning to buy a car since some time and do not know how to start, we have the solution for you. Now you can buy a car easily by following Drivespark.com's car buying guide.
Story first published: Friday, November 21, 2014, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X