టాప్ 10 కార్ మెయింటినెన్స్ చెక్ లిస్ట్

By Ravi

కారు కొనగానే సరిపోదు, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మనం కొన్ని విషయాల/పనులను సమయానికి ఎలా చేస్తామో, కార్ మెయింటినెన్స్ విషయంలో కూడా సమయాన్ని పాటించాలి. ఎప్పటికప్పుడు కారు పనితీరును చెక్ చేసుకుంటూ, సరిగ్గా మెయింటైన్ చేస్తే మార్గమధ్యంలో ట్రబుల్ ఇవ్వకుండా మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ఇంజన్ ఆయిల్‌, బ్యాటరీ, బ్రేక్స్, ఫ్లూయిడ్స్, ఫిల్టర్ల్ వంటి పలు అంశాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, అవసరైమనప్పుడు టాపప్ లేదా రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మరి కార్ మెయింటినెన్స్ విషయంలో చెక్ చేసుకోవాల్సిన టాప్ 10 అంశాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

Top 10 Car Maintenance Checklist

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 కార్ మెయింటినెన్స్ చెక్‌‌లిస్ట్‌‌లో ఉండాల్సిన అంశాలేంటో తెలుసుకోండి.

కూలెంట్

కూలెంట్

ఇది ఇంజన్‌ను చల్లగా ఉంచేందుకు సహకరిస్తుంది. ఇది యాంటీఫ్రీజ్‌గాను, కూలెంట్‌గాను పనిచేస్తూ కూలింగ్ సిస్టమ్‌లో తుప్పు చేరకుండా చేస్తుంది. కాబట్టి, కూలెంట్ ఆయిల్‌ని తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు టాటప్ చేసుకోవటం లేదా రీప్లేస్ చేయటం చేసుకోవాలి.

సాధారణంగా కూలెంట్ ఆయిల్‌ని ప్రతి రెండేళ్లకు లేదా 24 వేల మైళ్లకు ఒకసారి చొప్పునరీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

బ్రేక్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్

బ్రేక్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్

కారులో త్వరగా అరిగిపోయే భాగాల్లో బ్రేక్స్ కూడా ఒకటి. కాబట్టి బ్రేక్స్ పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్రేక్ డిస్క్ లేదా బ్రేక్ షూస్ అరిగిపోయినట్లు అనిపిస్తే తక్షణమే వాటిని రీప్లేస్ చేసుకోవాలి. అలాగే, ఇంజన్ బేలో బ్రేక్ ఫ్లూయిడ్స్ సరిగ్గా ఉన్నాయో లేదా కూడా చెక్ చేసుకోవాలి. బ్రేక్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

సాధారణంగా బ్రేక్స్‌ను ప్రతి రెండేళ్లకు లేదా 24 వేల మైళ్ల (ఫ్లూయిడ్) ఒకసారి చొప్పున రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్

పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్

పవర్ స్టీరింగ్ పనితీరు చక్కగా ఉండాలంటే, అందుకు తగిన స్టీరింగ్ ఫ్లూయిడ్ ఉండాలి. కారు ఇంజన్ బేలో పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్‌కి సంబంధించిన ఫిల్లర్ ఉంటుంది. ఇంజన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి ఈ పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్లూయిడ్ ఉండాల్సిన స్థాయి కన్నా తక్కువగా ఉంటే, టాపప్ చేసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, స్టీరింగ్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫ్లూయిడ్స్, ఫిల్టర్స్

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫ్లూయిడ్స్, ఫిల్టర్స్

ఒకవేళ మీరు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కారును ఉపయోగిస్తున్నట్లయితే (సాంప్రదాయ ఆటోమేటిక్ లేదా క్లచ్‌లెస్ గేర్‌బాక్స్), సదరు ట్రాన్సిమిషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే, అందుకు తగిన ట్రాన్సిమిషన్ ఫ్లూయిడ్ అవసరం. ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్‌తో ఫైట్ చేసి, సిస్టమ్ సరైన ఉష్ణోగ్రతల వద్ద పనిచేసేలా చూస్తుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, మెయింటినెన్స్ బిల్ తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి, ట్రాన్సిమిషన్ ఫ్లూయిడ్స్‌ని తరచూ చెక్ చేసుకుంటూ, ఓనక్ మ్యాన్యువల్‌లో తెలిపినట్లుగా టాపప్ చేసుకోవాలి.

సాధారణంగా ట్రాన్సిమిషన్ ఫ్లూయిడ్‌ని ప్రతి రెండేళ్లకు లేదా 24 వేల మైళ్లకు ఒకసారి చొప్పున రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

బ్యాటరీ

బ్యాటరీ

కారు ఇంజన్ స్టార్ట్ కావటానికి అవసరమయ్యే ముఖ్యమైన అంశాల్లో బ్యాటరీ కూడా ఒకటి. కారు బ్యాటరీ హెల్తీగా ఉంటే, మార్గమధ్యంలో మనకి ఇగ్నిషన్ స్టార్ట్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా, శీతాకాలంలో కూడా ఇంజన్ త్వరగా స్టార్ట్ కావటానికి మంచి బ్యాటరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాటరీని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్యాటరీ సర్ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి, డిస్టల్ వాటర్ లెవల్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి.

సాధారణంగా బ్యాటరీని, దాని పెర్ఫార్మెన్స్‌ను బట్టి 48 నెలల నుంచి 60 నెలల కాలంలో లేదా అవసరమైనప్పుడు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

ఆయిల్ ఫిల్టర్

ఆయిల్ ఫిల్టర్

కారు ఇంజన్‌‌కి ఆయిల్ ఫిల్టర్ గుండె లాంటిది. ఇంధనంలోని మలినాలను, మడ్డిని ఇంజన్‌లోకి చేరకుండా ఉంచేందుకు ఇది సహకరిస్తుంది. అయితే, ఇది కొంత కాలానికి మలినాలతో నిండిపోయి, ఇంజన్‌కు ఇంధనం సరఫరా కావటంలో ఆటంకం ఏర్పడే అకాశం ఉంటుంది. కాబట్టి, ఆయిల్ ఫిల్టర్‌ను తరచూ చెక్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి.

సాధారణంగా ఆయిల్ ఫిల్టర్‌ను ప్రతి రెండేళ్లకు లేదా 24 వేల మైళ్లకు ఒకసారి చొప్పున రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

ఎయిర్ ఫిల్టర్

ఎయిర్ ఫిల్టర్

ఇంజన్‌లో ఎయిర్ ఫిల్టర్ చాలా కీలకమైన భాగం. ఉదాహరణకు ఇంజన్ ఒక లీటరు ఇంధనాన్ని మండించాలంటే, దానికి పది వేల రెట్ల స్వచ్ఛమైన గాలి అవసరం. ఫిల్టర్ చేయబడిన గాలి సాయంతో ఇంజన్‌లో ఇంధనం మరింత స్పష్టంగా మండుతుంది, ఫలితంగా ఇంజన్ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ ఎయిర్ ఫిల్టర్ ఇంజన్‌లోని కీలక భాగాలను దుమ్ము, ధూళి నుంచి కాపాడుతుంది. ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చుకుంటే, ఇంజన్ పెర్ఫార్మెన్స్ పెరగటంతో పాటుగా, దాని జీవితకాలం కూడా పెరుగుతుంది.

సాధారణంగా ఎయిర్‌ఫిల్టర్‌ను ప్రతి ఏడాది ఒకసారి లేదా 12,000 మైళ్లకు ఒకసారి చొప్పున రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

స్పార్క్ ప్లగ్స్

స్పార్క్ ప్లగ్స్

ఇంజన్ స్టార్ట్ కావటానికి అత్యంత కీలకమైన భాగం స్పార్క్ ప్లగ్. సిలిండర్లలో ఇంధనాన్ని మండించడానికి సహకరించే స్పార్క్ ప్లగ్స్‌ను కూడా ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుంటూ, అవసరమైనప్పుడల్లా రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. వాస్తవానికి స్పార్క్ ప్లగ్‌ల జీవితకాలం ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ, కారు సరైన కండిషన్‌లో ఉండాలంటే, మీ చెక్ లిస్టులో స్పార్క్ ప్లగ్ కూడా ఉండాల్సిందే.

ఇంజన్ బెల్ట్స్, టైమింగ్ బెల్ట్స్

ఇంజన్ బెల్ట్స్, టైమింగ్ బెల్ట్స్

కారు ఇంజన్ బేలో ఇంజన్ బెల్ట్స్, టైమింగ్ బెల్ట్స్‌ని కూడా నిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి. వదులుగా ఉండే బెల్ట్స్ వలన, బెల్ట్స్ తరచూ ఊడిపోవటం, ఇంజన్ పెర్ఫార్మెన్స్ దెబ్బతినడం జరుగుతుంది. అలాగే టైమింగ్ బెల్ట్స్ (కొన్ని కార్లలో టైమింగ్ చైన్స్ ఉంటాయి)ను రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవాలి. ఈ బెల్టులు ఫెయిల్ అయితే, మేజర్ ఇంజన్ వర్క్ చేయాల్సి రావచ్చు.

సాధారణంగా ఇంజన్ బెల్టులను ప్రతి మూడేళ్లకు లేదా 36 వేల మైళ్లకు ఒకసారి చొప్పున, అలాగే టైమింగ్ బెల్టులను ప్రతి 60 వేల మైళ్ల నుంచి 90 వేల మైళ్ల మధ్యలో రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ కారుకు సంబంధించి సరైన టైమ్ పీరియడ్ కోసం ఓనర్ మ్యాన్యువల్‌ను చూడండి.

టైర్లు

టైర్లు

ఇక ఈ జాబితాలో చివరగా టైర్లను చెక్ చేసుకోవాలి. వేర్ అండ్ టేర్‌ను గుర్తించి, అవసరమైనప్పుడు టైర్లను మార్చుకుంటూ ఉండాలి. మీ కారులో ఎల్లవేళలలో స్పేర్ వీల్ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. టైర్ తరచూ పంక్చర్ అవుతూ ఉంటే దాని ట్యూబ్‌ని లేదా పూర్తి టైరుని (ట్యూబ్‌లెస్ టైరు అయితే) మార్చుకోవాలి. నాలుగు టైర్లలో నిర్దిష్టమైన గాలి పీడనం ఉండేలా చూసుకోవాలి. టైర్లను ప్రతి వారానికి ఒకసారి చొప్పున చెక్ చేసుకుంటూ ఉండాలి.

Most Read Articles

English summary
Maintaining your car can be a bit of a headache. However, here is a simple car maintenance checklist which will help your car run smoothly. Enjoy your drive!
Story first published: Thursday, November 20, 2014, 12:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X