అధిక వేడి వలన కారు బ్యాటరీ తగలబడుతుందా?

Written By:

జూన్ నెల వచ్చినా ఎండలు ఏ మాత్రం తగ్గట్లేదు. ఎండ వేడికి కారులో ప్రయాణం అంటేనే ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల భానుడి ప్రకోపానికి కార్లు సైతం భగ్గుమంటున్నాయి. ఎండా కాలంలో కార్లలో హఠాత్తుగా మంటలు చెలరేగటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాల్లో కార్ బ్యాటరీ కూడా ఒకటి. అవును, సూర్యుడి నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రత వలన కార్ బ్యాటరీలు కాలిపోయే ప్రమాదం ఉంది.

అందుకే కార్ బ్యాటరీలను నిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి వేసవిలో కనీసం వారానికి ఒకసారైనా బ్యాటరీని చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ ప్రత్యేకించి గ్యారేజ్ పార్కింగ్ సౌకర్యం లేని వారు అలాగే కార్లను ఎక్కువ సేపు ఎండలో పార్క్ చేసే వారు తమ కార్ బ్యాటరీల విషయంతో తగు జాగ్రత్తలు తీసుకొని, అప్రమత్తంగా వ్యవహరించాలి.

బ్యాటరీ అధిక వేడి గురైనా లేదా కావల్సిన దాని కన్నా ఎక్కువ చార్జ్ అయినా దాని జీవితకాలం తగ్గిపోతుంది. ఈ కథనంలో మనం వేసవి కాలంలో కార్ బ్యాటరీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఎండ వేడి వలన బ్యాటరీపై పడే ప్రభావం గురించి, దానిని తప్పించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం రండి.

అధిక వేడి వలన కారు బ్యాటరీలోని ద్రవాలు ఆవిరై, బ్యాటరీ లోపలి నిర్మాణం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వేసవి కాలంలో కారును వీలైనంత వరకూ నీడలో పార్క్ చేయటానికి ప్రయత్నించాలి.

వేసవి కాలంలో కారు బ్యాటరీలను తరచూ చెక్ చేసుకుంటూ ఉండి, అందులోని ద్రవాలు ఆవిరైపోయినట్లుగా అనిపిస్తే వాటిని ఎప్పటికప్పుడు టాప్అప్ చేసుకోవాలి.

కారులోని బ్యాటరీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ, క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. క్లాంప్‌లను తొలగించి పాత గ్రీజ్‌ను, మురికిని శుభ్రం చేసి, కొత్త గ్రీజ్ రాయాలి. మురికిగా ఉండే బ్యాటరీ ఛార్జ్‌ను బలహీనం చేస్తుంది.

ఎలక్ట్రికల్ సిస్టమ్ కరెక్ట్ రేట్ వద్ద చార్జింగ్ అవుతుందో లేదో చూసుకోవాలి. అండర్‌చార్జింగ్ కన్నా ఓవర్‌చార్జింగ్ వల్లనే బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అవుతుంది. చార్జింగ్ సిస్టమ్‌లోని లోపపూరితమైన భాగం (సాధారణంగా వోల్టేజ్ రెగ్యులేటర్) చార్జింగ్ రేట్ ఎక్కువై, బ్యాటరీ త్వరగా నాశనం అవుతుంది.

ఒరిజినల్‌గా స్పెసిఫై చేసిన దాని కన్నా కొంచెం అధిక రేటింగ్ కలిగిన బ్యాటరీని ఉపయోగించినా ఫర్వాలేదు కానీ దాని కన్నా తక్కువ రేటింగ్ కలిగిన బ్యాటరీని మాత్రం ఉపయోగించకూడదు.

బ్యాటరీ ఉపరితలం, పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్స్ శుభ్రంగా ఉండాలి. బ్యాటరీపై ఏర్పడే మురికి కండక్టర్‌గా మారి బ్యాటరీ పవర్‌ను హరించి వేస్తుంది. అంతేకాకుండా, బ్యాటరీ టెర్మినల్స్‌పై ఏర్పడే తుప్పు/మురికి ఇన్సులేటర్‌గా మారి విద్యుత్ ప్రవాహానికి ఆటంకంగా మారిపోచ్చు. కాబట్టి బ్యాటరీని క్లీన్‌గా ఉంచడం ఎంతో అవసరం.

వేసవి కాలంలో కారు బ్యాటరీ విషయంలో అశ్రద్ధ వహిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కారులో మంటలు చెలరేగటానికి బ్యాటరీ కూడా కారణం కావచ్చని పలు ప్రమాదాల్లో స్పష్టమైంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Summer’s extreme temperatures can destroy your car battery. Heat causes battery fluid to evaporate, which then damages the internal structure of the battery. To get the most life out of a car battery, we suggests these simple tips.
Please Wait while comments are loading...

Latest Photos