అలర్ట్: పొగమంచులో డ్రైవ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన లైఫ్ సేవింగ్ టిప్స్..!

Written By:

దట్టమైన పొగ మంచు ఇప్పటికీ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. వాతావరణంలో మార్పుల వలన సీజన్‌ను బట్టి పొగమంచు దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఇప్పటికీ దాదాపుగా 99 శాతం మంది డ్రైవర్లు దట్టమైన పొగమంచులో డ్రైవ్ చేయడానికి తడబడుతుంటారు.

నేటి చిట్కాలు శీర్షిక ద్వారా దట్టమైన పొగమంచులో సురక్షితమైన ప్రయాణం కోసం పాటించాల్సిన పది ముఖ్యమైన లైఫ్ సేవింగ్ టిప్స్ మీకోసం....

1. లో భీమ్ లైట్లు మాత్రమే వినియోగించండి

సాధారణంగా ఇండియన్ డ్రైవర్ల ప్రకారం, లో భీమ్ తక్కువ కాంతిని మరియు హై భీమ్ ఎక్కువ కాంతిని ఇస్తుంది అనే ధోరణిలో ఉంటారు. తద్వారా దట్టమైన పొగమంచులో హై భీమ్ లైట్ ను ఉపయోగిస్తారు. దీని ద్వారా లైట్ యొక్క గరిష్ట కాంతి పొగమంచుతో కలిసిపోతుంది. అదే లో భీమ్ లైట్‌ను వినియోగించడం ద్వారా ఎదురుగా వస్తున్న వ్యక్తులకు గానీ లేదా డ్రైవర్లకు మీ ఉనికి తెలుస్తుంది. వీటికి తోడుగా ఫాగ్ లైట్లను కూడా ఆన్ చేసుకోవాలి. ఇది ఎంతో ముఖ్యమైనది.

2. కారులోని విపత్తు హెచ్చరికల లైటును ఆన్ చేయండి

ఏదైనా లోపం ఉన్నా, ప్రమాదంలో ఉన్నా లేదంటో సమస్య ఉన్నపుడు ఈ హెచ్చరిక లైటును వినియోగించాల్సి ఉంటుంది. అయితే దట్టమైన పొగమంచులో వెళ్తునపుడు ఈ లైటును ఆన్ చేసుకొని వెళ్లడం మంచిది. ఇలా చేయడం ద్వారా రహదారి మీద కారు ఉనికిని ఇతర వాహనాలు గుర్తించే అవకాశం ఉంటుంది.

3. నిదానంగా వెళ్లండి

పగటి పూట వెళ్లే వేగంతో పొగ మంచు లో వెళ్లడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే వాహనాల మీద దృష్టి సారిస్తూ చేతులను ఎప్పుడూ స్టీరింగ్ మీదనే ఉంచి మలుపుల్లో వెంటనే స్పందించి స్టీరింగ్ చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే తక్కువ వేగంతో నడపడం ఎంతో ముఖ్యం.

4. రహదారి మీద గుర్తులను ఫాలో అవ్వండి

ప్రస్తుతం చాలా వరకు జాతీయ మరియు రాష్ట్రీయ రహదారులను రేడియమ్ లైటింగ్స్ అందించారు. ఇవి రోడ్డును రెండుగా విభిజిస్తాయి మరియు వంతెనలు, ఇరుకైన రోడ్డు వద్ద అదనపు రేడియమ్ లైటింగ్స్ మరియు తెలుపు , పసుపు రంగులో రోడ్డు మార్కులు ఉంటాయి. వీటిని అనుసరించడం ద్వారా ప్రమాదాలను అదిగమించవచ్చు.

5. ఢీ ఫాగర్

డీ ఫాగర్: వాహనం యొక్క అద్దాల మీద ఉన్న మంచును కరిగించడానికి వివియోగిస్తారు.
చలికాలంలో ఎక్కువ పొగమంచు కారణంగా కారులో ఉన్న ముందు మరియు వెనుక వైపున అద్దాల మీద తెల్లగా మంచు పేరుకుపోతుంది, తద్వారా రహదారిని సరిగా చూడలేము. అయితే మంచును ఆటోమేటిక్‌గా కరిగించడానికి చాలా కార్ల తయారీ సంస్థలి డీ ఫాగర్‌ను అందిస్తున్నాయి. దీని ద్వారా అద్దం కాస్త వేడెక్కి పేరుకున్న మంచు కరిగిపోతుంది.

6. మ్యూజిక్ సౌండ్ తక్కువగా ఉంచుకోండి

దట్టమైన పొగ మంచులో ప్రయాణం అనేది కత్తి మీద సాములాంటిదే. రోడ్డు క్లియర్‌గా కనబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్ సమయంలో ఎక్కువగా మనసును కేంద్రీకరించాలి. బయట వచ్చే శబ్దాలను పసిగడుతూ ఉండాలి. తద్వారా పెద్ద పెద్ద వాహనాల రాకపోకలను గమనించవచ్చు. అందుకోసం మ్యూజిక్ సౌండ్ తక్కువగా, వీలైతే ఆఫ్ చేయడం ఉత్తమం.

7. మద్యం సేవించ్ డ్రైవ్ చేయడం మానేయండి

సాధారణ పరిస్థితుల్లో మద్యం మత్తులో డ్రైవ్ చేయడం ఏ మాత్రం సాధ్యం కాదు, అలాంటిది దట్టమైన పొగమంచు కమ్ముకున్నపుడు మద్యం సేవించి వాహనాన్ని నడపడం ఇంకా డేంజర్. అలాంటి సందర్భం వచ్చినపుడు డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం చాలా ఉత్తమం.

8. వెళుతున్నపుడు ప్రక్కకు వాహనాన్ని ఆపే ముందు ఇలా చేయండి

పొగ మంచు దట్టంగా ఉన్నసమయంలో హై మీదగాని బాగా రద్దీగా ఉన్న రహదారి మీద వెళుతున్నపుడు ప్రక్కకు ఆపడానికి ముందుగా టర్న్ సిగ్నల్ వేయండి అలాగే ముందుకు వెళుతూ వేగాన్ని తగ్గించుకూంటూ ప్రక్కకు ఆపడం చేయాలి. తద్వారా మీ వెనుక వస్తున్న వాహన డ్రైవర్ మిమ్మల్ని అనుసరిస్తూ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తపడతాడు.

9. తగినంత దూరాన్ని పాటించండి

పగటివేలలో ప్రయాణంలా కాకుండా మంచులో ప్రయాణిస్తున్నపుడు మీ ముందున్న వాహనానంతో తగినంత దూరాన్ని పాటించండి. తద్వారా ఆ వాహనాలు పొరబాటును ప్రమాదానికి గురైతే వెంటనీ స్పందించి ప్రక్కకు తప్పుకునే అకాశం కలుగుతుంది. పొగ మంచులో ఎదుటి వాహనాలు ఎలా గుర్తించాలనేది మీ ప్రశ్నా..? ఎదుటి వాహనాల టెయిల్ లైట్లు మరియు బ్రేక్ లైట్ల ద్వారా అనుసరించవచ్చు.

10. ప్రయాణానికి ముందు రెండు హైడ్ లైట్ల పనితీరును చెక్ చేసుకోండి

పొగ మంచులో ప్రయాణినికి ముందు మాత్రమే కాదు, రాత్రి వేళల్లో జర్నీ ప్రారంభించే ముందు కూడా హెడ్ లైట్ల పనితీరును చెక్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఒక లైటు మాత్రమే పనిచేస్తున్నపుడు మీ ప్రయాణాన్ని మానుకోవడం మంచిది. అలాగే వెళితే మీకు ఎదురుగా వచ్చే వాహనాలు టూ వీలర్‌అని పొరబడే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రమాదాలు జరుగుతాయి.

చివరిగా

శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాహన డ్రైవర్లు దట్టమైన పొగమంచులో నడపడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు, కాబట్టి ఈ కథనంలో మేము ఇచ్చిన సలహాలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాము. ఈ కథనంలో లేని మీకు తెలిసిన ఇతరత్రా చిట్కాలు మాతో పంచుకోండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu: Driving In The Fog? Here Are 10 Essential Life Saving Tips To Keep In Mind
Please Wait while comments are loading...

Latest Photos