ఏఎమ్‌టి కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.

By N Kumar

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ సింపుల్‌గా చెప్పాలంటే ఏఎమ్‌టి. ఈ మధ్య కాలంలో ఇండియాలో ఏఎమ్‌టి కార్ల అమ్మకాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యువిలతో పాటు దాదాపు అన్ని సెగ్మెంట్లలో కూడా ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ పరిచయం అయ్యింది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లనే ఎందుకు

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్లనే ఎందుకు

చాలా మంది యువ ఔత్సాహికులు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎమ్‌టి) గల కార్లను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వీటిని అవసరాన్ని బట్టి మ్యాన్యువల్‌గా గేర్లు మార్చుకుంటూ డ్రైవ్ చేయవచ్చు అవసరం లేనపుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా డ్రైవ్ చేయవచ్చు.

ఏఎమ్‌టి తొలి పరిచయం

ఏఎమ్‌టి తొలి పరిచయం

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లను ఫార్ములా 1 ఉత్పత్తుల కోసం పరిచయం చేశారు. తరువాత సాధారణ రహదారి మీద పరుగులు తీసే ఫెరారి వంటి ఉత్పత్తుల్లోకి పరిచయం చేసారు. ఇప్పడు ఇండియాలో ఉన్న అత్యంత సరసమైన ఉత్పత్తుల్లో కూడా ఏఎమ్‌టిని పరిచయం అయ్యింది. మారుతి వారి ఎంట్రీ లెవల్ ఉత్పత్తి ఆల్టోకె10 లో కూడా ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇండియన్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల్లో మొదటి సారిగా ఏఎమ్‌టిని పరిచయం చేసింది మారుతినే, మారుతి దీనిని ఆటో గేర్ షిఫ్ట్ (AGS) అని పిలుస్తోంది. భారత దేశపు మొదటి ఏఎమ్‌టి ఉత్పత్తి మారుతి వారి సెలెరియో హ్యాచ్‌బ్యాక్. ఇందులోనే మొదటి ఏఎమ్‌టి గేర్‌బాక్స్ పరిచయం అయ్యింది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

అందుకే ఏఎమ్‌టి ఆప్షన్ గల భారత దేశపు అత్యంత సరసమైన చౌక ఏఎమ్‌టి కారును దృష్టిలో పెట్టుకుని ఏమ్‌టి కారును నడిపేటపుడు ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా నడపాలి అనే అతి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

బ్రేక్ మరియు యాక్సిలరేటర్ కోసం కుడి పాదాన్ని ఉపయోగించండి

బ్రేక్ మరియు యాక్సిలరేటర్ కోసం కుడి పాదాన్ని ఉపయోగించండి

కుడి పాదంతో పోల్చుకుంటే ఎడమ పాదంలో అంతగా చలనం ఉండదు, కాబట్టి వెంటనే స్పదించే గుణమున్న కుడి పాదం ద్వారా బ్రేక్ మరియు యాక్సిలరేటర్లను నియంత్రించండి. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ కార్లను నడిపిన అనుభవం ఉన్నవారికి ఏఎమ్‌టి వాహనాలను నడపడం సులభంగానే ఉంటుంది.

డ్రైవ్ మోడ్‌లో రైజ్ చేయకండి

డ్రైవ్ మోడ్‌లో రైజ్ చేయకండి

ఏఎమ్‌టి కార్లను నడిపే ముందు డ్రైవ్ ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుంది. డ్రైవ్ మోడ్ ఉన్నపుడు అనవసరంగా కారును రైజ్ చేయకండి. ఆ సమయంలో ఇంజన్ యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది, దాని ఒత్తిడి ప్రభావం పూర్తిగా డ్రైవ్‌ట్రైన్ మీద పడుతుంది. అలాంటప్పుడు ఇంజన్‌లోని మృదువైన విడి భాగాలు డ్యామేజ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.

నెమ్మదిగా కదిలే స్వభావం

నెమ్మదిగా కదిలే స్వభావం

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఉన్నపుడు క్లచ్ వదిలే విధానాన్ని బట్టి వాహనం కదిలే తీరు ఉంటుంది. అయితే ఆధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ గల కార్లలో నెమ్మదిగా కదిలే స్వభావం కలదు. అంటే డ్రైవ్ మోడ్ ఆన్ చేసిన తరువాత కారు నెమ్మదిగా కదలడం మొదలు పెడుతుంది. అప్పుడు నెమ్మదిగా క్లచ్ వదులు చేస్తూ యాక్సిలరేటర్‌ను పెంచడం ద్వారా ఇంజన్ నుండి వచ్చే గరిష్ట ఒత్తిడి ఒక్కసారిగా డ్రైవ్‌ట్రైన్‌ మీద పడదు. కాబట్టి ట్రాన్స్‌మిషన్ భాగాలు డ్యామేజ్‌కు గురికాకుండా సులభంగా కారును నడపవచ్చు.

అగి ఉన్నపుడు డ్రైవ్‌ మోడ్‌లో ఉంచకండి

అగి ఉన్నపుడు డ్రైవ్‌ మోడ్‌లో ఉంచకండి

ఒక వేళ మీరు ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద ఏఎమ్‌టి కారు ఆగి ఉన్నారనుకోండి. గుర్తుంచుకోండి మీ కారు తప్పకుండా న్యూట్రల్‌ మోడ్‌లో ఉండాలి. కారు డ్రైవ్‌ మోడ్‌లో ఉన్నపుడు దాని స్వభావం ప్రకారం నెమ్మదిగా కదలడానికి ప్రయత్నిస్తుంది, ఆ సమయంలో మీరు తప్పకుండా బ్రేకులు నొక్కి ఆపేస్తారనుకోండి. ఇలా చేయడం వలన అనవసరంగా కదలడం, మళ్లీ బ్రేకులు అప్లే చేయడం వలన మృదువైన బాగాలు అరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆగి ఉన్నపుడు న్యూట్రల్ మోడ్ తప్పనిసరి.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

దేశవ్యాప్తంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్ల ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఏదో ఒక రోజు మీకూ ఏఎమ్‌టి కారును నడిపే అవకాశం వస్తుంది. అది ఆల్టో కె10 అయినా ఫెరారి అయినా ఎలా నడపాలో తెలుసు కదా...?

ఎక్కువ మంది చదువుతున్న స్టోరీలు మీ కోసం...

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

Most Read Articles

English summary
Read In Telugu: How Drive An Automated Manual Transmission Cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X