టైర్లు ఎందుకు పేళుతాయి, టైర్ల పేలడాన్ని ఎలా నిరోధించాలి మరియు వాటి నిర్వహణ ఏలా చేయాలి ?

Written By:

ఎంత చెట్టుకు అంతగాలి చందంగా ఎన్ని వాహనాలు ఉంటే అన్ని ప్రమాదాలు జరుగుతాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు. కార్ల అమ్మకాలు పెరిగితే వాటి సంఖ్య ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సంఖ్య పెరిగితే ప్రమాదాలు పెరుగుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇందులో మానవ తప్పిదం లేకుండా జరిగే ప్రమాదాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి టైర్లు ప్రేళడం.

టైర్లు ఎందుకు పేళుతాయి, టైర్ల పేలడాన్ని ఎలా నిరోధించాలి మరియు వాటి నిర్వహణ ఏలా చేయాలి వంటి వివరాల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం...

ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ATMA) మరియు ఇండియన్ టైర్ టెక్నికల్ అడ్వైసరీ కమిటీ (ITTAC) వారి వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం . దేశవ్యాప్తంగా జరిగే ప్రమాదాల్లో 40 శాతం యమునా ఎక్స్‌ప్రెస్ వే మీదనే జరుగుతున్నాయి. అది కూడా తరచూ టైర్లు పేళడం వలన అని తేలింది.

ఆగ్రా మరియు ఢిల్లీ నగరాలను కలిపే యమునా ఎక్స్‌ప్రెస్‌వే తో పాటు మరిన్ని ఇతర జాతీయ రహదారులు టైర్లు పేలి వాహనం ప్రమాదానికి గురికావడం వలన రక్తమోడుతున్నాయి. రహదారి నియమాలను పాటించకుండే వెళ్లే వాహనాలు కూడా టైర్లు పేలి ప్రమాదానికి గురవుతున్నాయి.

ఒక్కో వేగానికి ఒక రకమైన టైరు

మన కంటికి చూడటానికి టైర్లన్నీ ఒకలే ఉంటాయి, కాని ఒకే రకమైన వేగం ఉన్న వాహనానికి దాని సంభందిత టైర్లను మాత్రమే ఉపయోగించాలి. వేగాన్ని బట్టి టైర్లను మూడు రకాలుగా విభజించారు.

వేగాన్ని బట్టి టైర్ల రకాలు వాటి వేగం యొక్క పరిమితి

S - అనగా స్టాండర్డ్, ఈ గుర్తు ఉన్న టైర్లను గంటకు 160 కిలోమీటర్లు వేగ పరిమితి ఉన్న వాహనాలలో వినియోగిస్తారు. ఈ టైర్లు 160 కిలోమీటర్ల వేగం వరకు తట్టుకోగలవు.

H - అనగా హై స్పీడ్, ఈ గుర్తు ఉన్న టైర్లు గరిష్టంగా గంటకు 230 కిలోమీటర్ల వేగం వరకు తట్టుకోలగలవు.

V - అనగా వెరీ హై స్పీడ్, ఆంగ్లపు వి గుర్తు ఉన్న టైర్లు హై స్పీడ్ వాహనాలలో గుర్తించవచ్చు. గంటకు 230 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగం వద్ద కూడా ఇవి నడుస్తాయి.

టైరు పేలినపుడు ఎలా వ్యవహరించాలి..?

సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా టైర్లు పేలుతుంటాయి. చాలా మంది టైరు పేలినపుడు భయాందోళనకు గురవుతుంటారు. భయపడకుంటా తటస్థంగా ఉండాలి. నిశ్శబ్ధంగా బయపడకుండా కారు వేగాన్ని తగ్గిస్తూ, స్టీరింగ్‌ను నియంత్రిస్తూ రహదారి ప్రక్కననిలపాలి. రోడ్డుకు మద్యలో ఆపివేయడం వలన ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది.

టైర్లు పేళడాన్ని నియంత్రించే కొన్ని చిట్కాలు

సరైన వేగాన్ని మెయింటెన్ చేయండి. కారు వేగం సున్నా నుండి పెరిగే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాన్ని అధిగమించడానికి అస్సలు ప్రయత్నించకండి.

వాహనం యొక్క వేగాన్ని అదుపు చేయలేనపుడు హార్డ్ బ్రేకింగ్ చేయకండి. గరిష్ట వేగంలో ఉన్న టైర్ల మీద అధిక ఒత్తిడి కలిగి టైరు పేలిపోయే ప్రమాదం ఉంది. బ్రేక్ గ్యాప్ ఇచ్చి ప్రెస్ చేస్తూ వేగాన్ని నియంత్రించాలి.

మలుపుల వద్ద వాహనం యొక్క మొత్తం బరువు ఒక వైపున్న టైర్ల మీద పడుతుంది. అప్పుడు దానికి కాస్త వ్యతిరేఖ దిశలో స్టీరింగ్ ఆపరేట్ చేయడం మంచిది. తద్వారా టైర్లు వాలుగా కాకుండా నిటారుగా ఉండి మలుపులను అధిగమిస్తాయి.

యాక్సిలేటర్ ఉన్నట్లుండి ప్రెస్ చేయడం మరియు గరిష్ట వేగం వద్ద యాక్సిలరేటర్ నుండి వెంటనే పాదాన్ని తీసివేయడం చేయకండి. టైరులో గాలి ఒత్తిడిలో మార్పులు సంతరించుకున్న పగిలిపోయే ప్రమాదం ఉంది. యాక్సిలరేటర్ ను స్మూత్ గా హ్యాండిల్ చేయడం ఉత్తమం.

తరచూ టైర్లను ఇలా చెక్ చేసుకోండి

ప్రతి వారం టైర్లలోని గాలిని చెక్ చేయండి. ప్రత్యేకించి వేసవి కాలంలో ప్రతి రోజు టైర్లలో గాలిని చెక్ చేయడం మరింత ఉత్తమం.

మీ వాహనంలోని టైర్లలో గరిష్టంగా ఎంత గాలిని నింపాలి అనే విషయాన్ని వాహనం యొక్క యూజర్ మ్యాన్యువల్ బుక్ ద్వారా తెలుసుకోండి.

దూర ప్రాంత ప్రయాణానికి ముందు వాహనంలోని అన్ని టైర్లను క్షుణ్ణంగా పరీక్షించండి.

చిన్న చిన్న గుంతలను తప్పిస్తూ నడపడం చాలా ఉత్తమం. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి రోడ్లను ఎక్కువ గమనించవచ్చు.

ఓవర్ లోడ్ కూడా టైర్లు పేలడానికి ఒక కారణంగా చెప్పవచ్చు...

టేర్లు పేలడాన్ని నివారించే చిట్కాలను పాటించి, టైర్ల పేలుడు నివారించండి.... ఈ కథనంపై మీ కామెంట్స్ మరియు మీకు తెలిసిన "టైర్లు పేలడాన్ని నిరోధించే చిట్కాల"ను మాతో పంచుకోండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, November 23, 2016, 17:22 [IST]
English summary
How To Avoid Tyre Burst In Telugu
Please Wait while comments are loading...

Latest Photos