ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

By N Kumar

ఈ కాలంలో బైకు లేదంటే కారు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉండే ఉంటుంది. మీ ప్రయాణంలో ఏదో రోజున ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపిన సంధర్బాలు చాలానే ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులకు ఉండే పవర్ గురించి సమాజంలో చాలా వివిధ రకాల దురభిప్రాయాలు ఉంటాయి. ఒక వేళ మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు మీరు చేయాల్సిన మరియు చేయకూడని విషయాల గురించి....

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

1. మీ దగ్గర నుండి డ్రైవింగ్ లైసెన్స్‌ను దూరంగా తీసుకెళుతున్నపుడు, దానికి ప్రతి రూపంగా చెల్లుబాటయ్యే పత్రాన్ని కోరండి.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

2. రెడ్ సిగ్నల్ దాటినా, ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా, మద్యం సేవించి, డ్రైవింగ్‌లో మొబైల్ వాడుతున్నా మీ లైసెన్స్‌ను రద్దు చేయగలగే పవర్ ట్రాఫిక్ పోలీస్‌కు ఉంటుంది.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

3. మీరు కారులో కూర్చున్నపుడు మీ వాహనాన్ని తీసుకెళ్లే హక్కు వారికి లేదు.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

4. మీరు స్త్రీ అయితే లేదంటే స్త్రీతో కలిసి ప్రయాణిస్తున్నపుడు, సాయంకాలం 6 గంటల తరువాత మీ వాహనాన్ని పోలీసులు ఆపితే చెక్ చేయడానికి వారితో ఖచ్చితంగా ఒక మహిళా పోలీస్ ఉండాలి. పురుష పోలీసులు చెక్ చేయకూడదు.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

5. పోలీసులు మీకు చలానా లేదా జరిమానా విధించే సమయంలో అతని వద్ద చలానా బుక్, ఇ-చలానా మెషీన్ ఉంటేనే చెలనా చెల్లించండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి డబ్బు ఇవ్వకండి.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

6. సెక్షన్ 130: సెక్షన్ 130 ప్రకారం మీరు నిజంగానే చట్టాన్ని అధిగమించినపుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఇన్సూరెన్స్ వంటి వాటిని కేవలం చూపించవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం మీ డాక్యుమెంట్లను ట్రాఫిక్

పోలీసులకు అందించనవసరం లేదు.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

7. సాధారణ వస్త్రధారణలో వచ్చి నేను పోలీసును మీ డాక్యుమెంట్లు చూపించండి, ఫైన్ చెల్లించండి అని అడిగితే ముందుగా అందుకు నిరాకరించి. మర్యాదపూర్వకంగా అతని పేరు, బ్యాచ్ నెంబర్ మరియు ఐడి కార్డు అడిగి తరువాత పోలీసే అని నిర్థారించకోండి. పోలీసులు మిమ్మల్ని ఆపినపుడు వారి పేరు, బ్యాచ్ నెంబర్‌తో పాటు ఉన్న యునిఫార్మ్‌లో ఉండాలి.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

8. మీ కారు లేదా బైకు నుండి ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా, దౌర్జన్యంగా వెహికల్ కీ లను లాక్కునే హక్కు వారికి లేదు.

ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు చేయకూడనివి, చేయాల్సినవి..!!

9. చట్టాన్ని అధిగమించినపుడు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి, అప్పటికీ మిమ్మల్ని అదుపులోకి తీసుకుని ఉంటే 24 గంటలలోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది.

.

  • విదేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌ వాడితే ఇవి ఖచ్చితంగా పాటించండి
  • .

    కామన్ సెన్స్ సరే.... రోడ్ సెన్స్ ఉందా ?

Most Read Articles

English summary
Know Your Rights If You Are Stopped By Traffic Cop
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X