కారు బ్యాటరీ మెయింటినెన్స్ చిట్కాలు

By Ravi

కారును కొనగానే సరిపోదు, దానిని సరిగ్గా నిర్వహించడం తెలియకపోతే రిపేర్ల కోసం వేలకు వేలు ఖర్చు చేయక తప్పదు. కారులో ఎప్పటికప్పుడు తరచూ చెక్ చేసుకోవాల్సిన భాగాల్లో బ్యాటరీ కూడా ఒకటి, కారు ఇంజన్ స్టార్ట్ కావడానికి ఇది అత్యంత కీలకమైనది. కాబట్టి బ్యాటరీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

కారులోని బ్యాటరీ గాడి తప్పకుండా ఉండాలంటే దాన్ని నిత్యం శుభ్రం చేయాలి. అలా చేయకపోయినట్లయితే, బ్యాటరీ టెర్మినళ్లపై దుమ్ము దూళి పొరలా పేరుకుపోయి, విద్యుత్ ప్రవాహానికి ఆటంకం వాటిళ్లుతుంది. కాబట్టి, బ్యాటరీ థర్మల్‌కు క్రమం తప్పకుండా తెల్లటి గ్రీజ్ పెడుతూ ఉంటే కార్బన్ పట్టదు. బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ స్ధాయి తగ్గితే యాసిడ్ పేరుకుని ప్లేట్లు పాడవుతాయి.

మరి అన్ని కాలాల్లోను బ్యాటరీని సురక్షితంగా, సేఫ్‌గా ఉంచుకోవటం ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారు బ్యాటరీ మెయింటినెన్స్ చిట్కాలు

కారులో ఎప్పటికప్పుడు తరచూ చెక్ చేసుకోవాల్సిన భాగాల్లో బ్యాటరీ కూడా ఒకటి, కారు ఇంజన్ స్టార్ట్ కావడానికి ఇది అత్యంత కీలకమైనది. కాబట్టి బ్యాటరీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.

కారును గ్యారేజ్‌లో పార్క్ చేయండి

కారును గ్యారేజ్‌లో పార్క్ చేయండి

కారును పూర్తిగా ఇన్సులేట్ చేయబడి ఉండే గ్యారేజ్‌లో పార్క్ చేయండి. ఇలా చేయటం వలన కారులోని బ్యాటరీ శీతాకాలంలో కూడా వెచ్చగా ఉండి, త్వరగా స్టార్ట్ అయ్యేందుకు సహకరిస్తుంది.

కారు బ్యాటరీని ఇన్సులేట్ చేయండి

కారు బ్యాటరీని ఇన్సులేట్ చేయండి

ఒకవేళ కారును పార్క్ చేయడానికి మీకు ఇన్సులేటెడ్ గ్యారేజ్ లేకపోయినట్లయితే, బ్యాటరీని ఇన్సులేట్ చేయించండి. బ్యాటరీని సురక్షితంగా ఉంచేందుకు ఇది చవకైన మార్గం.

బ్యాటరీని క్లీన్‌గా ఉంచండి

బ్యాటరీని క్లీన్‌గా ఉంచండి

కారులోని బ్యాటరీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ, క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. క్లాంప్‌లను తొలగించి పాత గ్రీజ్‌ను, మురికిని శుభ్రం చేసి, కొత్త గ్రీజ్ రాయాలి. మురికిగా ఉండే బ్యాటరీ ఛార్జ్‌ను బలహీనం చేస్తుంది.

సౌరశక్తితో రీఛార్జ్ చేయండి

సౌరశక్తితో రీఛార్జ్ చేయండి

మీ కారు బ్యాటరీ కోసం చవకైన సోలార్ ఛార్జర్‌ను కొనుగోలు చేయండి. కృత్రిమ విద్యుత్ కన్నా సౌర విద్యుత్ స్వచ్ఛంగా ఉంటుంది, ఫలితంగా బ్యాటరీ జీవితకాలం మరింత పెరుగుతుంది.

డిస్టిల్డ్ వాటర్ నింపండి

డిస్టిల్డ్ వాటర్ నింపండి

బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దీని స్థాయి తగ్గితే యాసిడ్ పేరుకుని ప్లేట్లు పాడవుతాయి. ఇదే జరిగితే సుమారు నాలుగైదువేలు ఖర్చు అవుతుంది.

బ్యాటరీని భద్రపరచండి

బ్యాటరీని భద్రపరచండి

కారులో బ్యాటరీ స్థిరంగా లేకుండా కదలకుండా ఉండేలా, స్థిరంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా బ్యాటరీ కదులుతూ ఉంటే,అది ఇంజన్‌లోని ఇతర భాగాలకు హాని కలిగించే ఆస్కారం ఉంది. యాసిడ్ చిమ్మే బ్యాటరీ కూడా ప్రమాదకరమే. కాబట్టి బ్యాటరీని స్థిరంగా, శుభ్రంగా, కరెక్టుగా సీటింగ్ అయి ఉండేలా చూసుకోవాలి.

కొత్త బ్యాటరీ

కొత్త బ్యాటరీ

బ్యాటరీ వీక్ అయినట్లు అనిపించినా లేదా తరచూ సమస్యలు వస్తున్నట్లయితే, వెంటనే పాత బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీని అమర్చుకోవటం ఎంతో ఉత్తమం.

Most Read Articles

English summary
Battery is very important for cars. Some people don't know how to maintain car batteries. Step in, to read car battery maintenance tips in Telugu.
Story first published: Thursday, September 5, 2013, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X