YouTube

ఈ 'తప్పనిసరి రోడ్డు సంకేతాల' గురించి మీకు తెలుసా?

By Staff

వాహనాన్ని డ్రైవ్ చేయటం నేర్చుకోవటం కన్నా ముందు, రోడ్డు సంకేతాల (సంజ్ఞల) గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం. సాధారణంగా, డ్రైవింగ్ నేర్చుకోవటానికి డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినా లేదా లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లినా వారు ముందుగా పరీక్షించేది మన డ్రైవింగ్ సరళిని కాదు, మనకు రోడ్ సైన్‌బోర్డుల విషయంలో ఎంత అవగాహన ఉందనేది పరీక్షించిన తర్వాతనే, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్టును నిర్వహిస్తుంటారు.

ఇది కూడా చదవండి: ఫన్నీ రోడ్ సైన్స్ (నవ్వు గ్యారంటీ)

మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు నిత్యం అనేక రకాల రోడ్డు సంకేతాలను చూస్తుంటాం. అందులో కొన్ని దారి చూపేవైతే, మరికొన్ని సమాచారాన్ని అందించేవి, ఇంకొన్ని డ్రైవర్లను అప్రమత్తం చేసివిగా ఉంటాయి. సాధారణంగా ఆర్ అండ్ బి వాళ్లు ఇలాంటి సంకేతాలను రోడ్డుకు పక్కగా రాత్రివేళల్లో సైతం స్పష్టంగా కనిపించేలా రేడియం పెయింట్‌తో తయారు చేసిన వాటిని ఏర్పాటు చేస్తుంటారు.

ఇచ్చట పార్కింగ్ చేయరాదు, ఇక్కడ కుడి/ఎడమ వైపుకు టర్నింగ్ లేదు, నిర్ధిష్ట వేగానికి మించి వెళ్ల కూడదు, ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, అనవసరంగా హారన్ కొట్టరాదు, ముందు రైల్వే ట్రాక్ ఉన్నది.. ఇలా అనేక రకాల సైన్ బోర్డులను మనం గమనిస్తూ ఉంటాం. ఇందులో కొన్ని తప్పనిసరి సంకేతాలు ఉంటాయి, వీటిని అతిక్రమిస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి, అందుకు తగిన జరిమానా విధించడం జరుగుతుంది.

మరి ఈ కథనంలో కొన్ని తప్పనిసరి రోడ్డు సంకేతాల గురించి తెలుసుకుందాం రండి..!

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో ఎంట్రీ (ప్రవేశము నిషిద్ధం).

ఈ సంకేతం ఉన్న రోడ్డులో వాహనాలను నడపకూడదు, అలాచేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకు తగిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో పార్కింగ్ (వాహనాలను పార్కింగ్/నిలుపుదల చేయరాదు).

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలను పార్క్ చేయకూడదు. అలాచేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది, అందుకు తగిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో స్టాండింగ్ (వాహనాలను నిలుపరాదు)

ఈ సంకేతం ఉన్న రోడ్డుపై వాహనాలను నిలుప కూడదు. అలాచేస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది, అందుకు తగిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

వన్ వే (ఒకవైపు మాత్రమే వాహనాలకు ప్రవేశం)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలకు ఒకవైపు మాత్రమే ప్రవేశం ఉంటుంది. రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో లెఫ్ట్ టర్న్ (ఎడమ వైపుకు అనుమతి లేదు)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలను ఎడమవైపుకు తిప్పరాదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో రైట్ టర్న్ (కుడి వైపుకు అనుమతి లేదు)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలను కుడివైపుకు తిప్పరాదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

స్పీడ్ లిమిట్ (వేగ పరిమితి)

ఈ సంకేతం ఉన్న చోట నిర్ధిష్ట వేగానికి మించి వాహనాన్ని నడపకూడదు. ఈ ఫొటోలో సంకేతం ప్రకారం, వాహనాన్ని 50 కి.మీ. కంటే వేగంగా నడపకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో ఓవర్‌టేకింగ్ (వాహనాలను ఓవర్‌టేక్ చేయకూడదు)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలను ఓవర్‌టేక్ చేయటం చాలా ప్రమాదకరం.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో పెడస్ట్రైన్స్ (పాదచారులకు అనుమతి లేదు)

ఈ సంకేతం ఉన్న చోట్ పాదచారులు నడవటానికి/రోడ్డు దాటడానికి అనుమతి ఉండదు. అలా చేయటం ప్రమాదకరం.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

టాంగాస్ ప్రొహిబిటెడ్ (గుర్రపు జెట్కా బండ్లు/టాంగాలు నిషిద్ధం).

ఈ సంకేతం ఉన్న చోట గుర్రపు జెట్కా బండ్లు/టాంగాలను నడపకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

నో యూ టర్న్ (యూ టర్న్ లేదు)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలను యూ టర్న్ చేయకూడదు. అలా చేయటం నేరం మరియు ప్రమాదకరం.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

వెహికల్స్ ప్రొహిబిటెడ్ (వాహనాలకు అనుమతి లేదు)

ఈ సంకేతం ఉన్న చోట రెండు వైపుల నుంచి వాహనాలకు అనుమతి ఉండదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

విడ్త్ లిమిట్ (రోడ్డు వెడల్పు పరిమితి)

ఈ సంకేంత ఉన్న చోట రోడ్డు వెడల్పు కేవలం 2 మీటర్లు మాత్రమే ఉంటుంది. దానికి అనుగుణంగా రోడ్డుపై నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

ట్రక్స్ ప్రొహిబిటెడ్ (ట్రక్కులకు అనుతి లేదు)

ఈ సంకేతం ఉన్న చోట భారీ వాహనాలు, ట్రక్కులకు ప్రవేశం ఉండదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

హారన్ ప్రొహిబిటెడ్ (హారన్ కొట్టరాదు)

ఈ సంకేతం ఉన్న చోట అవసరం లేకుండా హారన్ కొట్ట కూడదు. అలా కొడితే అది చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకు తగిన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

గివ్ వే (దారి ఇవ్వండి)

ఈ సంకేతం ఉన్న చోట ఎదురుగా లేదా వెనుక గా వస్తున్న వాహనాలకు దారి వదలాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

సైకిల్స్ ప్రొహిబిటెడ్ (సైకిళ్లకు ప్రవేశం లేదు)

ఈ సంకేతం ఉన్న చోట సైకిళ్లకు అనుమతి ఉండదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ సైకిల్ ట్రాక్ (తప్పనిసరి సైకిల్ ట్రాక్)

ఈ సంకేతం ఉన్న రోడ్డుపై తప్పనిసరిగా సైకిళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇది సాధారణంగా రోడ్డుకు పక్కగా ఉంటుంది.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ లెఫ్ట్ (తప్పనిసరి ఎడమ వైపు)

ఈ సంకేతం ఉన్న రోడ్డపు తప్పనిసరిగా ఎడమవైపు మాత్రమే వాహనాలను నడపాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ స్ట్రైట్/ఎహెడ్ (తప్పనిసరిగా నేరుగా)

ఈ సంకేతం ఉన్న రోడ్డుపై తప్పనిసరిగా నేరుగా మాత్రమే వాహనాలను నడపాలి, కుడివైపు కానీ లేదా ఎడమవైపు కానీ వాహనాలను నడపకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ టర్న్ లెఫ్ట్ (తప్పనిసరిగా ఎడమవైపుకు తిరగాలి)

ఈ రోడ్డు సంకేతం ఉన్న చోట తప్పనిసరిగా వాహనాన్ని ఎడమ వైపుకు తిప్పాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ టర్న్ రైట్ (తప్పనిసరిగా కుడి వైపుకు)

ఈ సంకేతం ఉన్న చోట తప్పనిసరిగా వాహనాన్ని కుడివైపుకు తిప్పాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ హారన్ (తప్పనిసరిగా హారన్)

ఈ సంకేతం ఉన్న చోట తప్పనిసరిగా హారన్ కొట్టాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ స్ట్రైట్ ఆర్ రైట్ (తప్పనిసరిగా నేరుగా లేదా కుడి వైపుకు)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాన్ని తప్పనిసరిగా నేరుగా లేదా కుడివైపుకు మాత్రమే నడపాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

కంపల్సరీ స్ట్రైట్ ఆర్ లెఫ్ట్ (తప్పనిసరిగా నేరుగా లేదా ఎడమ వైపుకు)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాన్ని తప్పనిసరిగా నేరుగా లేదా ఎడమ వైపుకు మాత్రమే నడపాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

బుల్లాక్ అండ్ హ్యాండ్ కార్ట్స్ ప్రొహిబిటెడ్ (ఎద్దుల బండ్లు, తోపుడు బండ్లు నిషిద్ధం)

ఈ సంకేతం ఉన్న రోడ్డుపై ఎద్దుల బండ్లు, నెట్టుడు/తోపుడు బండ్లను నడపకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

ఆల్ మోటార్ వెహికల్స్ ప్రొహిబిటెడ్ (అన్ని మోటార్ వాహనాలను నిషిద్ధం)

ఈ సంకేతం ఉన్న రోడ్డుపై అన్ని మోటార్ వాహనాలను నడపకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

యాక్సిల్ లోడ్ లిమిట్ (బరువు పరిమితి)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాల బరువు 4 టన్నులకు మించకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

హైట్ లిమిట్ (ఎత్తు పరిమితి)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాల ఎత్తు 3.5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

లెంత్ లిమిట్ (పొడవు పరిమితి)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాల పొడవు 10 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

లోడ్ లిమిట్ (బరువు పరిమితి)

ఈ సంకేతం ఉన్న రోడ్లపై 5 టన్నులకు మించి బరువు కలిగిన వాహనాలకు ప్రవేశం ఉండదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

హ్యాండ్ కార్ట్స్ ప్రొహిబిటెడ్ (తోపుడు/నెట్టుడు బండ్లకు ప్రవేశం లేదు)

ఈ సంకేతం ఉన్న చోట తోపుడు/నెట్టుడు బండ్లకు ప్రవేశం ఉండదు.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

స్టాప్ (ఆగుము)

ఈ సంకేతం ఉన్న చోట వాహనాలను నిలపాలి.

తప్పనిసరి రోడ్డు సంకేతాలు

రిస్ట్రిక్షన్స్ ఎండ్స్ (ఆంక్షలు ముగిసినవి)

ఈ సంకేతం ఉన్న చోట నుంచి రోడ్డుపై ఆంక్షలు ముగుస్తాయి.

ఫన్నీ రోడ్ సైన్స్

ఫన్నీ రోడ్ సైన్స్

ఆసక్తికరమైన, నవ్వు పుట్టించే ఫన్నీ రోడ్ సైన్స్ (సంకేతాల) గురించి తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Traffic signs and road markings are silent speakers to the road users. Every road user should know the marking and signs on the road and the meaning there of. It is advised to always keep your eyes on the road while driving and also check mandatory road signs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X