మాన్‌సూన్ డ్రైవింగ్ టిప్స్: వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయటానికి

By Super Admin

కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి.. వర్షపు చినుకులు మనల్ని పలకరిస్తున్నాయి.. ఇక మనం వర్షాకాలంలో డ్రైవ్ చేయటానికి సిద్ధంగా ఉండాలి. తడిసిన రోడ్లపై డ్రైవింగ్ అంత సురక్షితం కాదు. కాబట్టి, మనం మన జాగ్రత్తలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇతర సీజన్లతో పోల్చుకుంటే, వర్షాకాలపు సీజన్‌లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందుకు వాతావరణం అనుకూలించక పోవటం, రోడ్లు తడిగా ఉండటం, మ్యాన్‌హోల్స్, పాట్ హోల్స్, డ్రైవింగ్ పట్ల అవగాహన లేకపోవటం ఇలా అనేక కారణాలను చెప్పుకోవచ్చు.

వర్షాకాలంలో మన జాగ్రత్తలో మనం ఉన్నట్లయితే, ప్రమాదాలను కొంత మేరకైనా తప్పించుకోవచ్చు. ఈనాటి మన కార్ టాక్ శీర్షికలో వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలను తెలుసుకుందాం రండి.
మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు: అగ్ని మిస్సైల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు...

మాన్‌సూన్ డ్రైవింగ్ టిప్స్

మాన్‌సూన్ డ్రైవింగ్ టిప్స్ గురించి తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Picture credit: Ohhector via Flickr

నెమ్మదిగా డ్రైవ్ చేయటం

నెమ్మదిగా డ్రైవ్ చేయటం

వర్షంలో తడిసిన/నీటితో నిండిన రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాన్ని స్లో చేయటం క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మితిమీర వేగంతో డ్రైవ్ చేయకూడదు. అనసరంగా బ్రేక్‌లు అప్లయ్ చేయటం, అనవసరంగా యాక్సిలరేట్ చేయటం వంటి చేయకూడదు. అలాగే, వర్షాకాలంలో కారును నడి రోడ్డుకు అంచున నడపకూడదు. వర్షపు నీటి ప్రవాహం వలన రోడ్డు పక్కన మట్టి కరిగి, రోడ్డు కుంగిపోవటం జరిగే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తతో డ్రైవ్ చేయాలి.

Picture credit: Rejik via Flickr

టైర్లు చెక్ చేసుకోండి

టైర్లు చెక్ చేసుకోండి

రోడ్డుకు టైర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి, టైర్లు సరిగ్గా ఉంటే కారు సరిగ్గా వెళ్తుంది. కారు టైర్లు అరిగిపోయాయో లేదో తెలుసుకునేందుకు ఓ కొత్త రూపాయి నాణేన్ని తీసుకొని టెస్ట్ చేయవచ్చు. అదెలా అంటే, టైర్ గ్రూవ్ (టైరు ఉపరితలంపై ఉండే గాడి)లో కొత్త రూపాయి నాణేన్ని నిలువుగా ఉంచినప్పుడు అశోక ముద్ర బయటకు కనిపిస్తే టైర్లు మార్చాల్సిన అవరసం ఉందని అర్థం. అప్పటికీ మీకు అర్థం కాకపోయినట్లయితే, మంచి టైర్ కంపెనీ లేదా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి టైర్లను టెస్ట్ చేయించుకోవచ్చు.

టైర్లు చెక్ చేసుకోండి

టైర్లు చెక్ చేసుకోండి

వర్షాకాలంలో కారుకు మంచి రోడ్ గ్రిప్ ఉన్న టైర్లు ఉండటం ఎంతో అవసరం. ఫ్లాట్ ఉండే టైర్లతో తడిసిన రోడ్లపై డ్రైవ్ చేయటం రిస్క్, అలా చేయటం వలన ప్రమాదవశాత్తు కారు రోడ్డుపై నుంచి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి, మీ కారు టైర్లు కండిషన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, టైర్లను మార్చాలనిపిస్తే, జాప్యం చేయకుండా కొత్త టైర్లను అమర్చుకోవటం మంచిది.

వైపర్స్ చెక్ చేయండి

వైపర్స్ చెక్ చేయండి

వర్షాకాలంలో వైపర్స్ పాత్ర చాలా కీలకమైనది. వర్షం పడుతున్నప్పుడు వైపర్స్ సరిగ్గా పనిచేకపోతే, విజిబిలిటీ తగ్గి, కారు లోనుంచి మీరు రోడ్డును స్పష్టంగా చూడలేరు. కాబట్టి వైపర్ బ్లేడ్స్ బాగున్నాయో లేదో, వైపర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వైపర్ బ్లేడ్స్ అరిగినట్లుగా అనిపిస్తే, వాటిని తక్షణమే కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవాలి.

Picture credit: Nadircruise via Flickr

వైపర్స్ చెక్ చేయండి

వైపర్స్ చెక్ చేయండి

వైపర్ బ్లేడ్స్ ఎక్కువ ధరను కలిగి ఉండవు. కాబట్టి, అవి బాగున్నా బాగలేకపోయినా ఏడాది ఒకసారిని వీటిని మార్చుకుంటూ ఉండాలి. కారును ఎక్కువగా ఎండలో పార్క్ చేయటం వలన కూడా వైపర్ బ్లేడ్స్ దెబ్బతిని బీటలుబారి ఉంటాయి. వర్షాకాలంలో వైపర్లు సరిగ్గా పనిచేసే కండిషన్‌లో ఉండాలి. వైపర్లు విండ్‌స్క్రీన్‌పై వేగంగా కదలకపోయినా లేదా ఈ సిస్టమ్‌లో ఏదైనా లోపం ఉన్నా తక్షణమే పూర్తి వైపర్ సిస్టమ్‌ను మోటార్లతో పాటుగా రీప్లేస్ చేయించుకోవటం మంచిది.

Picture credit: Shereen84 via Flickr

హెడ్‌లైట్స్ ఉపయోగించండి

హెడ్‌లైట్స్ ఉపయోగించండి

వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు డేలైట్ ఉన్నప్పటికీ కూడా హెడ్‌లైట్స్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేయటం మంచిది. కొన్ని సందర్భాల్లో ఎదురుగా వచ్చే వాహనాలకు మీ వాహనం కనిపించకపోవచ్చు, అలాంటప్పుడు హెడ్‌లైట్లు ఆన్ చేసుకొని డ్రైవ్ చేస్తే ప్రమాదాలను తప్పించుకోవచ్చు. సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు రోడ్డుపై విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి, వానలో డ్రైవ్ చేసేటప్పుడు హైడ్‌లైట్లను లోబీమ్‌లో ఉంచుకొని డ్రైవ్ చేయాలి.

Picture credit: Cobalt123 via Flickr

అన్ని లైట్లు చెక్ చేసుకోండి

అన్ని లైట్లు చెక్ చేసుకోండి

వర్షాకాలంలో కొన్నిసార్లు దట్టమైన మేఘాల కారణంగా పగటి సమయాల్లోనే చీకటిగా అనిపిస్తూ, రోడ్డుపై కాంతి తగ్గుతుంది. అలాంటి సమయాల్లో హెడ్‌లైట్స్‌తో హాజర్డ్ లైట్స్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేయటం కూడా మంచిదే. మీ కారులో ఫాగ్ ల్యాంప్స్, హాజర్డ్ లైట్స్, సిగ్నల్ లైట్స్, బ్రేక్ లైట్స్, రియర్ పార్కింగ్ ల్యాంప్, రియర్ ఫాగ్ ల్యాంప్స్ మొదలైన అన్ని లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

వర్షం ఎక్కువైతే డ్రైవ్ చేయకండి

వర్షం ఎక్కువైతే డ్రైవ్ చేయకండి

కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు వర్షం తీవ్రత ఎక్కువైనప్పుడు కాసేపు డ్రైవ్ చేయకపోవటమే మంచిది. కుండపోతగా వర్షం పడుతున్నప్పుడు, వైపర్లు ఎంత స్పీడ్‌గా పనిచేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి, రోడ్డు పక్కగా సురక్షితమైన ప్రదేశం చూసుకొని, కారును నిలిపి హాజర్డ్ లైట్స్ ఆన్ చేయండి. వర్షం తగ్గిన తర్వాత తిరిగి డ్రైవ్ చేయటం మొదలు పెట్టండి.

Picture credit: SEATCordoba via Wiki Commons

కారు జారితే ఏం చేయాలి

కారు జారితే ఏం చేయాలి

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అన్న సామెతను గుర్తు చేసుకోండి, ప్రమాదం ఎదుర్కోవటానికి ముందు దానిని నివారించే మార్గాన్ని అనుసరించండి. సింపుల్‌గా చెప్పాలంటే నెమ్మదిగా డ్రైవ్ చేయండి. టర్నింగ్ తీసుకోవటానికి ముందుగానే బ్రేక్స్ అప్లయ్ చేసి, కారు వేగాన్ని కంట్రోల్‌కి తెచ్చుకోండి. అంతేకానీ, కారు టర్నింగ్ మధ్యలో ఉన్నప్పుడు బ్రేక్స్ వేయకండి. టర్నింగ్స్‌లో యాక్సిలరేటర్‌పై బలప్రయోగం చేయకండి. ఒకవేళ మీ కారు జారిపోతుందని అనిపిస్తే, కంగారు పడి స్టీరింగ్ అటూ ఇటూ తిప్పేయటం, యాక్సిలేటర్ ప్రెస్ చేయటం, బ్రేక్స్ అప్లయ్ చేయటం వంటివి చేయకండి. ఇలాంటి పరిస్థితుల్లో స్టీరింగ్‌ను నెమ్మదిగా కారు జారిపోతున్న దిశకు అపసవ్యదిశలో (ఫొటోలో చూపిన విధంగా) తిప్పటానికి ప్రయత్నించండి. ఇలాంటప్పుడు ఎంత కామ్‌గా వ్యవహరిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.

Picture credit: Xavier33300 via Flickr

హైవేపై నడిపేటప్పుడు

హైవేపై నడిపేటప్పుడు

హైవేపై నడిటేప్పుడు ముందున్న వాహనాలకు, వెనుకగా వచ్చే వాహనాలకు మధ్య వీలైనంత దూరాన్ని పాటించాలి. సాధారణ వాతవరణ పరిస్థితుల్లో మాదిరిగా కాకుండా, వర్షాకాలంలో హైవేపై కారు నడిపేటప్పుడు వాహనాలకు, వాహనాలకు మధ్య దూరం వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఎందుకుంటే, ముందున్న వాహనం హఠాత్తుగా బ్రేక్ వేయాల్సిన వచ్చినప్పుడు మనం అంతే వేగంగా రియాక్ట్ అయినప్పటికీ, తడిరోడ్డుపై వాహనం జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి.

హైవేపై నడిపేటప్పుడు

హైవేపై నడిపేటప్పుడు

హైవేపై వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ముందున్న ట్రక్కులు, బస్సులు మొదలైన భారీ వాహనాలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎందుకుంటే, పెద్ద టైర్లున్న ఆ వాహనాలు అధిక మొత్తంలో నీటిని చిమ్ముతుంటాయి కాబట్టి, అవి మీ కారు విండ్‌స్క్రీన్ మీద పడితే మీ విజిబిలిటీ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు రాత్రివేళల్లో వీలైనంత వరకూ డ్రైవ్ చేయకండి. ఎందు కంటే, హెడ్‌లైట్స్ మీద పడే బురద నీటి వాటి వలన రోడ్డుపై కాంతి తగ్గే అవకాశం ఉంటుంది.

Picture credit: Pleeker via Flickr

రోడ్డుపై ఆయిల్స్

రోడ్డుపై ఆయిల్స్

రోడ్డుపై పడిన ఆయిల్స్ వర్షాకాలంలో డేంజర్‌గా మారే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మలుపుల వద్ద రోడ్డుపై ఆయిల్స్ పడి ఉంటే వాహనం జారిపోయే ఆస్కారం ఉంటుంది. భారీ ట్రక్కులు, బస్సులు ఎక్కువగా హాల్ట్ అయ్యే ప్రదేశాల్లో ఆయిల్స్ లీక్ అయ్యి రోడ్డుపై ఇంధ్ర ధనుస్సు రంగులో కనిపిస్తూ ఉంటాయి. స్టీరింగ్, గేర్, యాక్సిలరేషన్ ఈ మూడింటినీ సమపాళ్లలో కంట్రోల్ చేస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

నీటిలో నడపాల్సి వచ్చినప్పుడు

నీటిలో నడపాల్సి వచ్చినప్పుడు

రోడ్డుపై నిల్వ ఉండే నీటి గుండా కారును నడపటం లేదా వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాహనం నడపటం అత్యంత ప్రమాదకరం. అప్పటికీ రిస్క్ చేసి కారు సగం మునిగే నీటిలో డ్రైవ్ చేస్తే, కారులోని కొన్ని కీలక ఎలక్ట్రికల్ సిస్టమ్స్ చెడిపోయే ఆస్కారం ఉంటుంది. కారు డోర్లు క్రింది భాగం మునిగేంత నీరు ఉన్నప్పుడు, అసలు ఆ రోడ్డుపై డ్రైవ్ చేయకపోవటమే మంచిది. లేకపోతే, ఇదిగో ఈ ఫొటోలో చూసినట్లుగా మీ కారు కూడా నీటిలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో నీటిలో కారును నడపాల్సి వచ్చినప్పుడు, క్లచ్‌ను పూర్తిగా నొక్కిపట్టి, ఫస్ట్ గేర్ వేసిన తర్వాత క్లచ్ కొద్దిగా రిలీజ్ చేసి యాక్సిలేట్ చేస్తూ నెమ్మదిగా ముందుకు సాగాలి. ఇలా చేయటం వలన సైలెన్సర్ గ్యాసెస్ టెయిల్ పైప్ నుంచి బయటకు వస్తూ, సైలెన్సర్ బ్లాక్ అవ్వదు.

ఏమరపాటు వద్దు

ఏమరపాటు వద్దు

వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఏమరపాటు పనికిరాదు. కారులో స్టీరియో సిస్టమ్ సౌండ్ తగ్గించుకోవాలి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చునే ప్యాసింజర్ కూడా పదే పదే డ్రైవర్‌తో మాట్లాడుతూ వారి ఏమరపాటుకు గురయ్యేలా చేయకూడదు. సెల్‌ఫోన్‌లో మాట్లాడటం (బ్లూటూత్ ద్వారానైనా సరే), టెక్స్టింగ్ చేయటం మానుకోవాలి. ఇలా చేయటం వలన మీరు మీ జీవితాన్ని రిస్కులో పెట్టుకోవటమే కాకుండా, పక్కవాళ్ల జీవితాలను కూడా రిస్కులో పెట్టిన వారు అవుతారు.

Picture credit: Juliarowe via Flickr

ఎయిర్ కండిషన్ పనిచేస్తుండాలి

ఎయిర్ కండిషన్ పనిచేస్తుండాలి

వర్షాకాలంలో కారులో ఏసి పనిచేయటం ఎంతో అవసరం. డిఫ్రోస్టర్ పనిచేయకపోతే, కారు విండ్‌స్క్రీన్ లోపలివైపు మంచు పేరుకొని విజిబిలిటీ తగ్గుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఏసి వర్కింగ్ కండిషనింగ్‌లో ఉండటం అవసరం. ఒకవేళ మీ కారులో ఏసితో పాటుగా హీటర్ సదుపాయం కూడా ఉన్నట్లయితే, బ్లోయెర్ స్విచ్ ద్వారా ఎయిర్ ఫ్లోను విండ్‌స్క్రీన్ వైపుకు మళ్లించి హీటర్ ఆన్ చేసినట్లయితే, అద్దంపై పేరుకునే మంచు/ఆవిరి కరిగిపోవటమే కాకుండా, కారులో వాతావరణం కూడా వెచ్చగా ఉంటుంది.

ఇతరులపై నీటిని చిమ్మేలా డ్రైవ్ చేయకండి

ఇతరులపై నీటిని చిమ్మేలా డ్రైవ్ చేయకండి

రోడ్డుపై కారు నడుపుతున్నప్పుడు అవతలి వారిని గౌరవించడం మన కర్తవ్యం. కాబట్టి, నీరు నిలిచిన రోడ్లపై డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ నీరు రోడ్డు పక్కగా ఉండే వారిపై పడకుండా ఉండేలా నెమ్మదిగా డ్రైవ్ చేయండి.

Picture credit: Andym8y via Flickr

మాన్‌సూన్ డ్రైవింగ్ టిప్స్

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో మీ కారులో చెక్ చేసుకోవాల్సిన 15 ముఖ్యమైన అంశాలు

Most Read Articles

English summary
We are going to take you through some important aspects of road safety during this potentially dangerous time, and hope that you adapt your driving to create a safety buffer for you and your loved ones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X