మోటార్ వెహికల్ సవరణ బిల్ అంటే ఏమిటి? ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు సవరించిన జరిమానాలు

ప్రజలు మరియు ప్రయాణికుల భద్రత దృష్ట్యా మునుపటి మోటార్ వెహికల్ నియమాల ఉల్లంఘనలకు మునుపున్న జరిమానాలో మార్పులు చేస్తూ మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులో సవరణలు చేయడం జరిగింది.

Written By:

నూతన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు 2016 ను మార్చి 31, 2017 న కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. మరియు ఏప్రిల్ 10, 2017 న లోక్ సభ ఈ బిల్లును ఆమోదించింది. లోక్ సభ ఆమోదించిన తరువాత సవరణ బిల్లులో ఉన్న అన్ని నియమాలు అమల్లోకి వస్తాయి.

మోటార్ వాహన చట్టం ఏమిటి ?

కేంద్ర రవాణా శాఖ రహదారి భద్రత పట్ల రహదారి నియమాలను రూపొందించి, వాటిని మెటార్ వాహన చట్టంలో పొందుపరిచింది. అయితే మోటార్ వెహికల్ చట్టంలోని నియమాలను ఉల్లంఘిస్తున్నందున నియమాలను మరింత కఠినతరం చేసేందుకు చట్టసవరణతో మెటార్ వాహన చట్టంలో మార్పులు చేర్పులు చేసింది.

నూతన 2016 మోటార్ వాహన చట్టం ప్రకారం మునుపటి జరిమానాలతో పోల్చుకుంటే కేంద్ర రవాణా అమల్లో ఉంచిన నియమాలను పాటించని వారికి విధించే జరిమానా భారీ సంఖ్యలో పెంచేసింది.

ఏ ఉల్లంఘనకు ఎంత జరిమానా ?

నూతన మోటార్ చట్ట సవరణలోని 177 సెక్షన్ మేరకు సాధారణ జరిమానాను రూ. 100 నుండి రూ. 500 లకు పెంచడం జరిగింది.

నూతన 177ఎ సెక్షన్ మేరకు రహదారి రహదారి నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానాను రూ. 100 నుండి రూ. 500 లకు పెంచడం జరిగింది.

ప్రభుత్వ ప్రయాణసాధనాలలో టెకెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే జరిమానాను రూ. 200 నుండి రూ. 500 లకు పెంచడం జరిగింది.

వివిధ శాఖలు సూచించే భద్రత నియమాలను పాటించని వారికి విధించే జరిమానాను రూ. 500 నుండి 2,000 లవకు పెంచడం జరిగింది.

లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే సెక్షన్ 180 ప్రకారం మునుపున్న రూ. 1000 ల జరిమానాను రూ. 5,000 లక పెంచడం జరిగింది.

డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం సెక్షన్ 185 ప్రకారం రూ. 2,000 ల జరిమానాను రూ. 10,000 లకు పెంచింది.

హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే, మునుపున్న రూ. 100 ల జరిమానాను రూ. 1,000 ల వరకు పెంచడం జరిగింది. మరియు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.

ఓవర్ లోడ్ ద్వారా ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు గాను సెక్షన్ 194 లో ఉన్న రూ. 2,000 నుండి 20,000 ల వరకు మరియు టన్నుకు 2,000 రుపాయల వరకు జరిమానాను పెంచడం జరిగింది.

ఓవర్ స్పీడింగ్ - జనవాసాల మధ్య నిర్ణీత వేగాన్ని మించి ఓవర్ స్పీడ్‌తో ప్రయాణిస్తూ పట్టుబడితే సెక్షన్ 183 మేరకు మునుపున్న రూ. 400 ల జరిమానాను రూ. 1,000 (లైట్ మోటార్ వెహికల్) లకు మరియు మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ. 2,000 లకు పెంచడం జరిగింది.

కొత్త నియమాలు

రవాణా శాఖ మోటార్ వెహికల్ చట్టంలో మూడు కొత్త చట్టాలను చేర్చింది. సెక్షన్ 193 ప్రకారం లైసెన్స్ పరిస్థితులను ఉల్లంఘించేవారికి భారీ జరిమానా విధించనున్నారు. రూ. 25,000 నుండి 1,00,00 ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

194ఇ సెక్షన్ ను కొత్తగా చేర్చారు. అత్యవసర వాహనాలకు మీ ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగిందని తెలిస్తే రూ. 10,000 ల వరకు జరిమానా విధించే నియమాన్ని చేర్చింది.

మరో కొత్త చట్టం 199 సెక్షన్. దీని ప్రకారం పెద్దలు తమ కార్లను పిల్లలకు ఇవ్వడం నేరం. ఈ మేరకు వెహికల్ రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసే అధికారం అధికారులకు ఉంది.

ఓవర్ సైజ్ వెహికల్స్ - కేంద్రం చట్టంలో ఓవర్ సైజ్ వెహికల్ నియమాన్ని చేర్చింది. 182బి సెక్షన్ ప్రకారం రూ. 5,000 ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, April 11, 2017, 19:37 [IST]
English summary
Read In Telugu New Motor Vehicles Bill Passes Heavy Fine For Violations
Please Wait while comments are loading...

Latest Photos