పోర్టబల్ జిపిఎస్ నావిగేషన్ డివైజ్ ఎలా పనిచేస్తుంది?

By Ravi

జిపిఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లో కీలకంగా మారుతోంది. ప్రత్యేకించి ఆటోమొబైల్స్‌లో జిపిఎస్ వినియోగం నానాటికీ పెరుగుతోంది. కొత్త ప్రాంతంలో లేదా మనకు ఏమాత్రం తెలియని ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు జిపిఎస్ సాయంతో గమ్యాన్ని దిశానిర్దేశం చేయటంలో జిపిఎస్ ఎంతగానో సహకరిస్తుంది.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా?

ఈ జిపిఎస్ వ్యవస్థలో కూడా మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తుండటంతో ఇవి ధ్వని ఆధారిత మార్గనిర్దేశకం చేస్తుంది. సమీపంలోని హోటళ్లు, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు మొదలైన సమాచారాన్ని జిపిఎస్ సాయంతో తెలుసుకోవచ్చు. అంతేకాదు, వాహనం చోరీకి గురైనా జిపిఎస్ సాయంతో తక్షణమే అది ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవచ్చు. మరి మనకు ఇంతగా ఉపయోగపడే జిపిఎస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

జిపిఎస్ ఎలా పనిచేస్తుంది?

తర్వాతి స్లైడ్‌లలో జిపిఎస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి.

జిపిఎస్ ఎలా పనిచేస్తుంది?

కారులో ఉండే ఓ చిన్న పరికరం (జిపిఎస్ డివైజ్) మరియు విశ్వంలో ఉండే ఉపగ్రహాలకు (శాటిలైట్) మధ్య అనుసంధాన వ్యవస్థ ఉంటుంది. కారులోని జిపిఎస్ డివైజ్ ఈ శాటిలైట్ సాయంతో పనిచేస్తుంది. విశ్వంలో ఉండే ఈ శాటిలైట్ కారులోని జిపిఎస్ డివైజ్‌ను ట్రాక్ చేస్తుంటుంది.

జిపిఎస్ ఎలా పనిచేస్తుంది?

భూ ఉపరితలం పైనుంచి 11 వేల నాటికల్ మైళ్ళ దూరంలో మొత్తం 24 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తూ రేడియో తరంగాలను వెదజల్లుతూంటాయి. ఈ 24 ఉపగ్రహాలలో భూమి చుట్టూ 6 కక్ష్యలలో ఉండే 4 ఉపగ్రహాలతో ఈ జిపిఎస్ డివైజ్ అనుసంధానమై ఉంటుంది.

జిపిఎస్ ఎలా పనిచేస్తుంది?

కారులోని జిపిఎస్ డివైజ్ ఎలాంటి వాతావరణంలో అయినా సిగ్నల్స్‌ను (మబ్బులు, ప్లాస్టిక్ గుండా సిగ్నల్స్ పాస్ అవుతాయి) సమర్థవంతంగా గ్రహించగలదు. కానీ, బిల్డింగ్స్ వంటి ధృడమైన/ఘనమైన వస్తువుల గుండా ఈ సిగ్నల్స్ పాస్ కావు.

జిపిఎస్ ఎలా పనిచేస్తుంది?

శాటిలైట్ కారులోని జిపిఎస్ డివైజ్‌ను యాక్సెస్ చేసుకొని, అది ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉందనే సమాచారాన్ని భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. జిపిఎస్ డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్న మ్యాప్స్ ఆధారంగా ఇది సాధ్యమవుతుంది.

జిపిఎస్ ఎలా పనిచేస్తుంది?

కేవలం జిపిఎస్ డివైజ్‌ల ద్వారానే కాకుండా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ఖరీదైన ఫోన్లలో కూడా జిపిఎస్ సిస్టమ్ అందుబాటులో ఉంటోంది. ఫోన్‌లోని జిపిఎస్ సాయంతో సదరు వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసుకోవచ్చు.

** 1978లో తొలి జిపిఎస్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వరసగా 1994 వరకు మొత్తం 24 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.

Most Read Articles

English summary
Traveling to an unknown destination in the modern world has become easy. GPS navigational devices have brought knowledge about different destinations to our fingertips, whether driving a car or riding a motorcycle.
Story first published: Thursday, July 31, 2014, 10:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X