ఘాట్ రోడ్లపై సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా? - చిట్కాలు

డ్రైవింగ్ అంటే అందరికీ సరదాగానే ఉంటుంది. ప్రత్యేకించి అందమైన రోడ్లపై, అందులోను ఘాట్ రోడ్లపై ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తు పల్లాలు, భారీ వంపులు కలిగిన ఘాట్ రోడ్లపై ప్రయాణం ఎంత ఆహ్లాదకరమైనదో అంతే అపాయకరమైనది కూడాను.

ఇది కూడా చదవండి: కార్ జాక్‌ను సురక్షితంగా ఉపయోగించటం ఎలా

డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యం, అవగాహన లేకుండా ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే, ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఘాట్ రోడ్లపై సురక్షితంగా ఎలా ప్రయాణించే తెలిపే చిట్కాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఘాట్ రోడ్లపై సురక్షితం డ్రైవ్ చేయటం ఎలా?

ఘాట్ రోడ్ డ్రైవింగ్ టెక్నిక్స్‌ను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

హ్యాండ్ బ్రేక్ ఉపయోగిస్తూ ఉండండి

హ్యాండ్ బ్రేక్ ఉపయోగిస్తూ ఉండండి

ఇది చాలా బేసిక్‌గా అనిపించవ్చు, కానీ కొండ ప్రాంతాల్లో, ఘాట్ రోడ్లలో వాహనం నడిపేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, మరీ ఎత్తుగా ఉండే రోడ్లపై డ్రైవ్ చేస్తున్నప్పుడు కొందరికి క్లచ్ మరియు యాక్సిలరేషన్‌ను సమానంగా అప్లయ్ చేయటం తెలియకపోవచ్చు లేదా కుదరకపోచ్చు. కాబట్టి, ఎత్తుగా ఉండే రోడ్లపై ప్రయాణించేటప్పుడు, అవసరమైనప్పుడల్లా హ్యాండ్ బ్రేక్‌ను కూడా ఉపయోగించడం మంచిది.

సరైన గేర్ ఉపయోగించండి

సరైన గేర్ ఉపయోగించండి

చదునుగా ఉండే రోడ్లపై 40 కి.మీ. వేగాన్ని దాటగానే మనం 5వ గేర్‌ను అప్లయ్ చేస్తుంటాం, కానీ ఘాట్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు గేర్లను ఆచితూచి మార్చాల్సి ఉంటుంది (వీలైనంత వరకు లోవర్ గేర్స్‌లోనే వెళ్లాలి).

ఎత్తుగా ఉండే రోడ్లపై ప్రయాణించేటప్పుడు లోవర్ గేర్లను ఉపయోగిస్తే మంచి పికప్ ఉంటుంది. అలాగే లోతుగా ఉండే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది మైలేజ్ గురించి ఆలోచిస్తూ, ఇంజన్ ఆఫ్ చేసి లేదా న్యూట్రల్ ఉంచి క్రింది వైపుకు నడుపుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇలా చేయటం వలన మైలేజ్ మాటేమో కానీ బ్రేక్ ఫెయిల్ మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది.

కాబట్టి, లోతుగా లేదా దిగుడుగా ఉండే రోడ్లపై (డైన్‌హిల్) డ్రైవ్ చేసేటప్పుడు వీలైనంత వరకు 3వ లేదా 4వ గేరును అప్లయ్ చేసి, యాక్సిలరేషన్‌ను ఇవ్వకుండా నడపితే మీ ప్రయాణం మరింత సురక్షితంగా సాగిపోతుంది.

మలుపుల వద్ద గేరు తగ్గించాలి

మలుపుల వద్ద గేరు తగ్గించాలి

ఘాట్ రోడ్డు మలుపుల వద్ద సురక్షితంగా టర్న్ తీసుకోవాలంటే గేరును 2 లేదా 3 లోకి మార్చుకోవాలి. అప్పుడే సునాయాసంగా టర్న్ తీసుకోవటం సాధ్యమవుతుంది. వేగంగా వచ్చి బ్రేక్ అప్లయ్ చేసినా లేదా అదే వేగంతో టర్న్ చేయాలని ప్రయత్నించినా వాహనం లోయలోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మీరు గమనించినట్లయితే, మలుపులు వద్ద వేగంగా వచ్చే కార్లు తమ లైను దాటి మీ లైనులో రావటాన్ని గుర్తించవచ్చు. ఇందుకు కారణం మలుపుల వద్ద వేగంగా రావటం వలన టార్క్ తగ్గి సరైన స్థలంలో టర్న్ తీసుకోవటం సాధ్యం కాదు, అందుకే పక్క లైను లోకి వెళ్లటం, ఫలితంగా ప్రమాదాలను కొని తెచ్చుకోవటం జరుగుతుంటుంది.

ఓపికగా ఓవర్‌టేక్ చేయండి

ఓపికగా ఓవర్‌టేక్ చేయండి

ఘాట్ రోడ్లపై డ్రైవ్ చేసేటప్పుడు ఎంతో ఓపికగా వ్యవహరించాలి. మీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయాలనుకున్నప్పుడు సరైన అవగాన, సహనం రెండూ అవసరం. మొండిగా సాధారణ రోడ్లపై వేగంగా వాహనాలను ఓవర్‌టేక్ చేసినట్లు చేస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఘాట్ రోడ్లపై నేరుగా ఉండే రోడ్డుపై మాత్రమే వాహనాన్ని ఓవర్‌టేక్ చేయాలే తప్ప మలుపులు ఉన్నచోట ఓవర్‌టేక్ చేయకూడదు. ఓవర్‌టేక్ చేసేప్పుడు ముందున్న డ్రైవర్‌కు హారన్ ద్వారా కానీ లేదా లైట్ల ద్వారా కానీ సంకేతం ఇవ్వాలి.

ఒకవేళ మీ ముందు ఏదైనా భారీ వాహనం నెమ్మదిగా వెళ్తుంటే, మీరు చిరాకు పడకుండా ఆ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి సురక్షితమైన ప్రదేశం, సమయం వచ్చే వరకు దాని వెనుకనే నెమ్మదిగా వెళ్తూ ఉండండి.

మలుపుల వద్ద హారన్ ఉపయోగించండి

మలుపుల వద్ద హారన్ ఉపయోగించండి

ఘాట్ రోడ్లపై ప్రయాణించడానికి ముందే వాహనాల హారన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో సరిచూసుకోవాలి. ఇలాంటి రోడ్లపై పగటిపూట ప్రయాణిస్తున్నప్పుడు కంటికి కనిపించని మలుపుల (బ్లైండ్ కర్వ్స్) వద్ద తప్పనిసరిగా హారన్ కొడుతూ వాహనాన్ని ముందుకు పోనివ్వాలి. అదే రాత్రివేళ్లలో అయితే మీ హెడ్‌లైట్లను బ్లింక్ చేయటం లేదా హాజర్డ్ లైట్లను ఉపయోగించి డ్రైవ్ చేయటం సురక్షితం.

ఎగుడు రోడ్లపై ట్రాఫిక్‌‌కు దారి వదలాలి

ఎగుడు రోడ్లపై ట్రాఫిక్‌‌కు దారి వదలాలి

ఎగుడు రోడ్లపై ట్రాఫిక్‌కు తప్పనిసరిగా దారి వదలాలి. ఇలాంటి రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు అవి ఎత్తు రోడ్లను ఎక్కటానికి సాధారణం కన్నా మరింత ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కాబట్టి, రోడ్డుకు ఒక పక్కగా మీ వాహనాన్ని నడుపుతూ ఎవరైనా మీ కన్నా ముందుగా పోవటానికి ప్రయత్నిస్తే వారికి దారి వదలాలి.

ఘాట్‌పై వాహనం ఆపాల్సి వచ్చినప్పుడు

ఘాట్‌పై వాహనం ఆపాల్సి వచ్చినప్పుడు

ఒకవేళ ఘాట్ రోడ్డుపై మీ వాహనం ఆగిపోయినా లేక తప్పనిసరిగా ఆపాల్సి వచ్చినా, వాహనాన్ని రోడ్డుకు పక్కగా నిలిపాలి. ఇలా నిలిపేటప్పుడు మీ వాహనం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాలకు అంతరాయం కలిగించకుండా ఉండేలా, సురక్షితమైన స్థలం చూసుకొని కారును నిలపాలి. సన్నగా లేదా ఇరుకుగా ఉండే రోడ్లపై కారును నిలపకండి. ఇందుకోసం కారులో మీతో పాటు ఎవరైనా ప్రయాణిస్తుంటే, వారిలో ఒకరిని క్రిందకు దిగమని చెప్పి వాహనాన్ని నిలపటానికి సురక్షితమైన ప్రదేశానికి మిమ్మల్ని గైడ్ చేయమని అడగటం ఉత్తమం.

రేసింగ్ లైన్స్ ఉపయోగించకండి

రేసింగ్ లైన్స్ ఉపయోగించకండి

రేసింగ్ లైన్ అనేది మలుపు వద్ద ఉండే అతి చిన్న దూరం అని అర్థం, ఇలాంటి రేసింగ్ లైన్లను రేస్‌ట్రాక్‌లపై మాత్రమే ట్రై చేయాలి కానీ పబ్లిక్ రోడ్లపై ట్రై చేయకూడదు. చాలా మంది డ్రైవర్లు చేసే తప్పిదం కూడా ఇదే, తర్వాతి మలుపును త్వరగా చేరుకోవాలనే ఉద్దేశ్యంతో లైన్లను క్రాస్ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చకుంటుంటారు.

కాబట్టి ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు మీ లైన్‌లోనే వాహనం నడపండి, సరక్షితం అనిపిస్తేనే లైన్ దాటి ఓవర్‌టేక్ చేయాలి తప్ప అవతిలి లైన్‌లో మాత్రం వాహనాన్ని నడపకూడదు.

ఘాట్ రోడ్డుపై మంచిగా ప్రవర్తించండి

ఘాట్ రోడ్డుపై మంచిగా ప్రవర్తించండి

హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వే లపై రయ్ రయ్ మని వాహనాలను నడిపినట్లు ఘాట్ రోడ్డుపై వాహనాన్ని నడపకూడదు. ఘాట్ రోడ్లపై వాహనం నడుపుతున్నప్పుడు ఓర్పు, సహనం, నైపుణ్యం, మెళకువ, అప్రమత్త మొదలైనవి చాలా అవసరం. ఘాట్ రోడ్డుపై మీరు ఎంత ప్రశాంతంగా వాహనాన్ని నడపగలిగితే అంత సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోగలరు. అనసరమైన కంగారు, భయాలను పక్కనపెట్టి ధైర్యంగా డ్రైవ్ చేయండి. సాటి డ్రైవర్లకు మర్యాదనిస్తూ, సాఫీగా ముందుకు సాగిపోండి.

ఈ చిట్కాలు/సూచనలు తప్పకుండా పాటించండి

ఈ చిట్కాలు/సూచనలు తప్పకుండా పాటించండి

ఘాడ్ రోడ్డులో సురక్షితంగా ప్రయాణించేందుకు మేము చెప్పిన ఈ చిట్కాలు మరియు సూచనలను మీరందరు తప్పనిసరిగా పాటిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఈ కథనంపై మీ విలువైన ఫీడ్‌బ్యాక్ కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే, దీనిని మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయగలరు.

Most Read Articles

English summary
Driving in the hills requires a very different style to driving on flat roads in the plains. This is because of several factors like much narrower roads, steep inclines and descents, blind curves, the presence of inexperienced ghat road users that pose a serious danger to others, and so on. In an effort to improve awareness about proper hill-driving etiquette, we have compiled a list of things to keep in mind while driving in the ghats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X