మీ కారులో ఇలాంటి వాసనల పట్ల అప్రమత్తంగా ఉండండి - చిట్కాలు

కారును కొనగానే సరిపోదు, కారు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవటం ఎంతో అవసరం. కారును స్టార్ట్ చేసి బయలుదేరిన తర్వాత నుంచి గమ్యం చేరుకునే వరకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలి, అప్పుడే మనం సుఖంగా, సురక్షితంగా మరియు సౌకర్యంగా గమ్యం చేరుకోవటం సాధ్యమవుతుంది.

చదవటం మరిచారా: వర్షాకాలంలో కారులో చెక్ చేయాల్సిన పార్ట్స్

కారులోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడే అసాధారణమైన వాసన (స్మెల్) ఆధారంగా ఆ కారులో సమస్య ఉందో తెలుసుకోవచ్చు. అదెలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. కారులో ఈ వాసనలను ముందుగానే గుర్తిస్తే, ఆ తర్వాత ఎదుర్కోబోయే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ అసాధారణమైన వాసనలు ఏంటి, అవి కారులో ఏ ప్రాంతం నుండి వస్తాయో చూద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కార్ వార్నింగ్ స్మెల్స్

కారు నుంచి వెలువడే అసాధారణమైన వాసనల గురించి, వాటి వలన కలిగే ప్రమాదాల గురించి తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

1. కాలిన రబ్బరు వాసన

1. కాలిన రబ్బరు వాసన

కారు లోనుంచి లేదా ఇంజన్ కంపార్ట్‌మెంట్ నుంచి కాలిన రబ్బరు వాసన వస్తుంటే, డ్రైవ్ బెల్ట్స్ ఏమైనా జారిపోయాయో లేక రబ్బర్ హోస్ పైపులు ఏవైనా తిరుగుతున్న పరికారాల (రొటేటింగ్ యాక్ససరీస్)తో రాజుకుంటున్నాయో చెక్ చేసుకోండి. ఇంజన్ కంపార్ట్‌మెంట్ వేడిగా ఉంటే, కారును కాసేపు నీడగా ఉన్నచోట పార్క్ చేసి, ఇంజన్ చల్లబడిన తర్వాత దీనిని చెక్ చేయండి. దీనిని చెక్ చేయకుండా అలానే వదిలేస్తే డ్రైవ్ బెల్ట్స్‌పై ఆధారపడి ఉండే మోటార్లు పనిచేయకపోవటం, హోస్ పైపుల నుంచి ఫ్లూయిడ్స్/ఎయిర్ లీక్ కావటం లేదా ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగటం జరగవచ్చు.

2. వేడి నూనె వాసన

2. వేడి నూనె వాసన

కారు నుంచి వేడి నూనె వాసన వస్తుంటే, సైలెన్సర్‌లోకి ఆయిల్ లీక్ అవుతున్నట్లు అర్థం. కారు నుంచి ఇలాంటి వాసన రాగానే కారును పక్కకు నిలిపి నేలపై ఏదైనా ఆయిల్ లీక్ అవుతుందా లేక ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఏదైనా పొగవస్తుందోమేనని చెక్ చేసుకోవాలని. ఈ వాసనను విస్మరిస్తే కారులో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

3. పెట్రోల్/డీజిల్/గ్యాస్ వాసన

3. పెట్రోల్/డీజిల్/గ్యాస్ వాసన

కారు నుంచి పెట్రోల్/డీజిల్/గ్యాస్ వాసన వస్తుంటే, ఇంజన్ కంపార్ట్‌మెంట్ వద్ద ఫ్యూయెల్ ఇంజెక్టర్ లైన్‌లో కానీ లేదా ఫ్యూయెల్ ట్యాంక్ వద్ద కానీ ఇంధనం లీక్ అవుతున్నట్లు అర్థం. కారు నుంచి ఇలాంటి ఇంధన వాసన రాగానే కారును పక్కగా నిలిపి, ఎక్కడైనా ఇంధన లీక్ అవుతుందేమోనని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంధం లీక్ అవుతున్నట్లు అనిపిస్తే, తక్షణమే రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌కు కానీ లేదా సమీపంలోని అధీకృత సర్వీస్ సెంటర్‌కు కానీ కాల్ చేయాలి.

4. సిరప్ లాంటి తీపి వాసన

4. సిరప్ లాంటి తీపి వాసన

కారు ఇంజన్ కంపార్ట్‌మెంట్ నుంచి సిరప్ లాంటి తీపి వాసన వస్తుంటే, ఇంజన్ ఆయిల్ కూలెంట్ లీక్ అవుతుందేమోనని చెక్ చేయాలి. కార్ కూలింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ఏ పార్ట్ నుండైనా కూలెంట్ ఆయిల్ లీక్ అవుతుంటే ఇలాంటి వాసన వస్తుంది. అలాంటప్పుడు కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లి ఈ సమస్యను సరి చేయించుకోవాలి. ఇంజన్ వేడిగా ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్‌ను ముట్టుకోకండి. దీనిని ఇలానే వదిలేస్తే, కూలెంట్ ఆయిల్ లెవల్ తగ్గి ఇంజన్ వేడెక్కడటంతో పాటు దాని పనితీరు కూడా దెబ్బతింటుంది.

5. కాలుతున్న కార్పెట్ వాసన

5. కాలుతున్న కార్పెట్ వాసన

కారు నుంచి కాలుతున్న కార్పెట్ వాసన వస్తుంటే, అది బ్రేక్ సమస్యకు చిహ్నం అని గుర్తుంచుకోండి. అలాంటి వాసన వచ్చిన వెంటనే బ్రేక్‌లను సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోండి. ప్రత్యేకించి సాధారణ డ్రైవింగ్ పరిస్థితుల్లో అలాంటి వాసన వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. ఈ సమస్యను ఇలానే వదిలేస్తే బ్రేక్స్ ఫెయిలయ్యే ఆస్కారం ఉంటుంది.

6. కుళ్లిన కోడిగుడ్డు వాసన

6. కుళ్లిన కోడిగుడ్డు వాసన

కారు నుంచి కుళ్లిన కోడిగుడ్డు వాసన వస్తుంటే, సైలెన్సర్‌కు సంబంధించిన క్యాటలైటిక్ కన్వర్టర్‌లో సమస్య ఉన్నట్లు అర్థం. సైలన్సర్‌కు అమర్చబడి ఉండే క్యాటలైటిక్ కన్వర్టర్‌ సైలెన్సర్‌లోని హైడ్రోజన్ సల్ఫైడ్‌ను సల్ఫర్ డైఆక్సైడ్‌గా సరిగ్గా కన్వర్ట్ చేయకపోయినట్లయితే ఇలాంటి వాసన వస్తుంది. దీనిని అలానే వదిలేస్తే, ఇంజన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి, క్యాటలైటిక్ కన్వర్టర్‌‌పై ఓవర్‌లోడ్ పడటం ఫలితంగా అది కరిగిపోయి ఫెయిల్ అవ్వటం జరుగుతుంది.

ఫొటో మూలం: commons.wikimedia

మరిన్ని వాసనలు

మరిన్ని వాసనలు

ఇవే కాకుండా, కారు ఇంజన్ నుంచి కానీ లేదా కారులోని వివిధ ప్రాంతాల నుంచి కానీ ఎలాంటి అసాధారణమైన వాసనలను మీ ముక్కు పసిగట్టినట్లయితే, వాటిని విస్మరించకుండా అందుకు తగిన కారణాలను అన్వేషించండి. ఇందులో మీకేదైనా సందేహం వచ్చినట్లయితే, జాప్యం చేయకుండా తక్షణమే నిపుణలైన మెకానిక్/టెక్నీషియన్‌ను సంప్రదించండి.

చివరిమాట

చివరిమాట

మీ కారులో కూడా ఈ కథనంలో పేర్కొన్నట్లుగా ఏవైనా అసాధారణ వాసనలు వస్తుంటే, వెంటనే స్పందించి తగిన మరమ్మత్తులు చేయించుకోవటం వలన భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం/బ్రేక్‌డౌన్ నుంచి తప్పించుకోవచ్చు.

ఈ కథనం మీకు నచ్చినట్లయితే, మీ మిత్రులతో దీనిని షేర్ చేయగలరు.

Most Read Articles

English summary
Unusual smells in your car can be the sign of serious trouble for your vehicle. By acting quickly and making necessary repairs, you avoid major risks. DriveSpark recommends a sniff test of your car to identify any unusual smells, including the the above mentioned warning signs. Take a look.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X