మీ కారు నుండి తక్కువ పొగ, ఎక్కువ శక్తినిచ్చే ఆరు సులభ చిట్కాలు

By N Kumar

దేశ వ్యాప్తంగా వాహన కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు కొదవే లేదు. ఎన్నో ప్రముఖ నగరాల కాలుష్య కోరల్లో బంధీలుగా ఉన్నాయి. ఒక్క కేంద్ర రాజధాని నగరంలోని గాలిలో కాలుష్యాల పరిమాణం 153µg/m3 ఉన్నట్లుగా కొన్ని సంస్థలు ప్రకటించాయి. ఆరోగ్యకరమైన గాలి కోసం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మరియు ప్రపంచ ఆరోగ్య ఆర్గనైజేషన్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి.

ఇంతటి సమస్యలకు కారణం హానికరమైన కాలుష్యాలను వెదజల్లే డీజల్ మరియు పెట్రోల్ కార్లు. అందుకోసం మీ కార్ల నుండి తక్కువ పొగ వచ్చేట్లు చేస్తూ అదే విధంగా అధిక శక్తివంతంగా మార్చే ఆరు చిట్కాలను డ్రైవ్‌స్పార్క్ అందిస్తోంది. వాటి గురించి...

1. తరచూ సర్వీసింగ్ చేయించడం

1. తరచూ సర్వీసింగ్ చేయించడం

ఇంజన్‌లో మెకానికల్ సమస్యలు తలెత్తినా కూడా అధిక పొగ వెలువడుతుంది. సరైన క్రమంలో సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడం ఒక కారణం. ముఖ్యంగా ఎయిర్ మరియు ఫ్యూయల్ ఫిల్టర్లను సర్వీస్ చేయించడం. ఇంజన్ ఆయిల్ చెక్ చేసి మార్పిచడం వంటి చేయాలి. ఇంజన్‌లో ఎక్కువగా కదిలే భాగాలు ఉంటాయి కాబట్టి ఇంజన్ ఆయిల్ గురించి ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. సరైన క్రమంలో సర్వీసింగ్ చేయించడం ద్వారా కూడా తక్కువ పొగ వెలువడుతుంది.

2. ఐడ్లింగ్‌ను తగ్గించడం

2. ఐడ్లింగ్‌ను తగ్గించడం

మీరు సిగ్నల్స్ వద్ద గ్రీన్ లైట్ కోసం ఆగిఉన్నపుడు, ఆ సమయం అర నిమిషం కన్నా ఎక్కువ అయితే ఇంజన్‌ను ఆఫ్ చేయడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం బద్దకం ఉన్న వారి కోసం ఈ మధ్య కాలంలో ఇంజన్ ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ వచ్చింది.

3. క్రమ మార్గంలో నడపడం

3. క్రమ మార్గంలో నడపడం

సిటిలలో డ్రైవింగ్ చేసేటపుడు ఒక దాని వెంట ఒకటి క్రమంలో నడపడం ఎంతో ఉత్తమం. ఎందు కంటే, వాహనాన్ని ఉన్నట్లు మలుపులకు గురిచేయడం, వెంటనే బ్రేకులు వేసి ఆ వెంటనే యాక్సలరేట్ చేయడం మళ్లీ వెంటనే సాధారణ స్తితికి తీసుకువచ్చి నడపడం వలన ఇంజన్ అధిక ఒత్తిడికి గురవుతుంది. తద్వారా అధిక కాలుష్యాన్ని వెదజల్లుతుంది. దీనికి పరిష్కారం ఒక వాహనాన్ని ఒకటి ఫాలో అవడం. తద్వారా ఇంజన్‌ మీద ఒత్తిడి తగ్గి తక్కువ పొగ విడుదలవుతుంది.

4. సరైన ప్రణాళికతో

4. సరైన ప్రణాళికతో

తెలియని ప్రదేశాలకు వెళ్లినపుడు రూట్లు కోసం తెలియని దారులన్ని కలియతిరగడం వలన కారులో ఎంత ఇంధన వృదా అవుతుందో అంతే కాలుష్యం కూడా వెలువడుతుంది. అయితే ఇలాంటి వాటిని నివారించేందుకు గూగుల్ మ్యాప్స్ మరియు కార్ ఇన్ బిల్ట్ న్యావిగేషన్ సిస్టమ్ వంటివి ఎంతగానో ఉపోయోగపడుతాయి. వీటి ద్వారా మనం ఉన్న ప్రదేశం నుండి వెళ్లాల్సిన ప్రదేశాలకు మధ్య గల అతి తక్కువ దూరం ఉండే రూట్లను సూచిస్తుంది.

5. కార్ పూలింగ్

5. కార్ పూలింగ్

ఇది కారుకు చేయాల్సిన చికిత్స కాదు, మనలో రావాల్సిన మార్పు. ఎందుకంటే కారు పూలింగ్ అనేది ప్రస్తుతం ప్రజా రావాణ క్రిందకు చేరిపోయింది. అంటే ఒక రూట్లో ఒకరే కారులో వెళుతుంటే అదే రూట్లో వెళ్లే వారికి లిఫ్ట్ ఇవ్వడం అన్నమాట. అందుకుగాను మీతో పాటు ప్రయాణించే వారు కొంత మొత్తం డబ్బును కూడా అందిస్తారు. తద్వారా ఇద్దరు కార్లను వినియోగించడం కన్నా, ఒకే కారును ఇద్దరూ వాడితే డబ్పు ఆదాతో పాటు కాలుష్యం కూడా తగ్గించవచ్చు. కార్ పూలింగ్ గురించి మరింత తెలుసుకోండి.

6. గో గ్రీన్

6. గో గ్రీన్

ఇది అన్నింటి కన్నా ఉత్తమం. ఎందుకంటే ఈ కార్లు వాడితే ఇంధన నింపాల్సిన అవసరం ఉండదు తద్వారా పొగ వచ్చే అవకాశం అసలే ఉండదు. కాబట్టి డీజల్ లేదా పెట్రోల్ కార్లను కొనుగోలు చేసే ముందు ఒక సారి ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆరా తీస్తే మంచింది. అప్పటికి అవే కార్లు కావాలంటే పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లతో హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. లేదంటే సిఎన్‌జి వేరియంట్లలో ఉన్న కార్లను ఎంచుకున్నా పర్వాలేదు.

ఇండియాలో అందుబాటులో ఉన్న ఉత్తమ సిఎన్‌జి కార్ల గురించి.

మీ కారు నుండి తక్కువ పొగ, ఎక్కువ శక్తిని ఇచ్చే ఆరు చిట్కాలు

ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

Most Read Articles

English summary
Six ways to make your car less polluting and more efficient
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X