కార్ ఇన్సూరెన్స్ కోసం పది ఉత్తమ సంస్థలు

By N Kumar

విదేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ప్రమాదాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అయితే లక్షలు వెచ్చించి కొనుగోలు చేసే వారు ప్రమాదాల వలన చెడిపోయిన కార్లను విడిచిపెట్టలేరు. ఏదో ఒక విధంగా వాటిని రిపేరి చేయించి వాడుకుంటారు. అదే ప్రమాదం చాలా పెద్దది అయితే అలాంటి కార్లు ఖచ్చితంగా భీమాను కలిగి ఉండాలి. అప్పుడు స్వయానా భీమా సంస్థలు ఆ కార్లను రిపేరి చేయిస్తాయి.

2016 ఏడాదిలో ఉత్తమ ఆఫర్లు, విభిన్నమైన పథకాలు, అమ్మకాల తరువాత ఉత్తమ సర్వీసింగ్, క్లెయిమ్ (దావా) పరిష్కారాలు వంటి రికార్డుల పరంగా ఇండియాలో ఉన్న టాప్ 10 ఉత్తమ కారు ఇన్సూరెన్స్ సంస్థలను మీ ముందుకు తీసుకువచ్చాము. వినియోగదారుల ఎంపికను బట్టి రికార్డుల పరంగా ఈ పది సంస్థలను ఎంచుకోవడం జరిగింది.

10. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్

10. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం లిమిటెడ్ భారత ప్రభుత్వం యొక్క అనుభంద సంస్థ.

  • మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా పాలసీని పునరుద్దరణ చేసుకోవచ్చు.
  • ప్యాకేజి విధానం మరియు భాద్యత విధానం వంటి రెండు ప్యాకేజిలను అందిస్తోంది.
  • వినియోగదారుల అవసరాల ఆధారంగా ఆకర్ణణీయమైన పథకాలను అప్పటికప్పుడు అందిస్తుంది.
  • 09. టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్

    09. టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్

    2011లో టాటా మోటార్స్ ప్రారంభించిన జనరల్ ఇన్సూరెన్స్ కమర్షియల్ వాహనాలు, కార్లు మరియు సెకండ్ హ్యాండ్ కార్లకు భీమాను అందిస్తోంది.

    • ఉచితంగా కారును పికప్ చేసుకుంటారు.
    • ప్రమాదం జరిగిన వాహనాలకు ఆరు నెలల వరకు రిపేరి చేయించుకునే అవకాశం
    • కేవలం వారం రోజుల్లోనే క్లెయిమ్ పరిష్కరించే సదుపాయం
    • గ్యారేజిల్లో డబ్బు చెల్లించకుండానే సెటిల్‌మెంట్లు చేయును.
    • 08. రాయల్ సుందరమ్ జనరల్ ఇన్సూరెన్స్

      08. రాయల్ సుందరమ్ జనరల్ ఇన్సూరెన్స్

      రాయల్ సుందరమ్ జనరల్ ఇన్సూరెన్స్ వారు ఉత్తమ పాలసీ విధానాల ద్వారా లాభదాయకమైన కార్ ఇన్సూరెన్స్‌లను అందుబాటులో ఉంచింది.

      • 24x7 అత్యవసర సమయాల్లో రోడ్ సైడ్ అసిస్టెన్స్
      • పాలసీ దారులకు ఉత్తమ సమాచారాన్ని అందివ్వడానికి 24x7 హెల్ప్‌లైన్ సెంటర్‌ను అందుబాటులో ఉంచారు.
      • ప్రమాదాలకు గురైన కార్లకు త్వరితగతిన రిపేరి మరియు సమస్యను పరిష్కరిస్తారు.
      • 07. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్

        07. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్

        1947 లో ప్రారంభించడబడిన ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ. గరిష్ట క్లెయిమ్‌లను పరిష్కరించిన సంస్థగా కూడా ఇది పేరుగాంచింది.

        • రికార్డుల పరంగా అత్భుతమైన క్లెయిమ్‌ పరిష్కరించిన సంస్థ
        • దేశవ్యాప్తంగా 1800 కన్నా ఎక్కువ బ్రాంచీలు
        • ఆన్ లైన్ ద్వారా కొత్త ఇన్సూరెన్స్ మరియు రెన్యూవల్ చేసుకోవచ్చు.
        • వినియోగదారులకు ధృడమైన మద్దతు మరియు విసృతమైన ఏజెంట్ నెట్‌వర్క్
        • 06.న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్

          06.న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్

          1919 లో సర్ దొరబ్జి టాటా చేత స్థాపించబడిన ఈ సంస్థ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా రూపాంతరం చెందింది. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా మొత్తం 22 శాఖలు ఉన్నాయి. మరియు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ద్వారా రేటింగ్ పొందిన ఏకైక భారత ఇన్సూరెన్స్ సంస్థ ఇది.

          • కేవలం మూడు రోజుల్లోనే క్లెయిమ్ పరిష్కారం
          • క్లెయిమ్ ధాఖలు చేసుకున్న తరువాత కేవలం రెండు రోజుల్లో సర్వేయర్ క్లెయిమ్‌ను గమనిస్తాడు.
          • కేవలం మూడు రోజుల్లోనే పాలసీదారునికి క్లెయిమ్ ప్రతిఫలాలను అందిస్తారు.
          • క్లెయిమ్‌లను స్వీకరించి ప్రతి 15 రోజులకు ఒక సారి గ్రీవెన్స్ నిర్వహిస్తారు.
          • 05. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్

            05. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్

            దేశీయంగా ఉన్న అతి పెద్ద ప్రయివేట్ రంగం సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్. ఇది కార్ల కోసం జనరల్ ఇన్సూరెన్స్‌ను ప్రారంభించింది.

            • కేవలం వాయిదా పద్దతుల్లో కొనుగోలు చేసే కార్లకు మాత్రమే ఇన్సూరెన్స్ కల్పిస్తారు.
            • దేశ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 3300 లకు పైబడి గ్యారేజిల్లో డబ్బు చెల్లించకుండా రిపేరి చేయిస్తారు.
            • ఎక్కువ డ్యామేజ్ అయిన కార్లను అక్కడి నుండి గ్యారేజికి తరలించడానికి సహాయం అందిస్తుంది.
            • 04. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

              04. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

              విభిన్నమైన అవార్డులు గ్రహించిన హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆటో ఇన్సూరెన్స్ 2002 లో స్థాపించబడింది.

              • వీరి వద్ద ఉన్న పాలసీల్లో వయస్సు మరియు వృత్తి పరంగా విభిన్నమైన డిస్కౌంట్లను అందిస్తారు.
              • డాక్యుమెంటేషన్ పూర్తిగా ఉచితం.
              • త్వరితగతిన క్లెయిమ్‌ల పరిష్కారం.
              • 1600 కన్నా ఎక్కువ గ్యారేజీల వద్ద డబ్బులేకుండా రిపేరి చేయించడం.
              • ఒకే పాలసీ మీద ఎక్కువ డిస్కౌంట్లు వీరి ప్రత్యేకత.
              • 03. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్

                03. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్

                2008 లోదేశ వ్యాప్తంగా భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఉత్తమమైన ఇన్సూరెన్స్‌లను ఇది అందిస్తోంది.

                • ఇన్సూరెన్స్ విధానంలో నాలుగైదు రకాల అవకాశాలను వినియోగదారులకు అందిస్తోంది.
                • క్లెయిమ్‌లను పరిష్కరించేటపుడు డబ్బును చెల్లించే విషయంలో 100 శాతం గ్యారంటీ.
                • రబ్బర్, బ్యాటరీలు మరియు ఎక్ట్సీరియర్ రిపేరి ఖర్చును పూర్తిగా సంస్థ భరిస్తుంది.
                • మెడికల్, హాస్పిటల్ మరియు అంబులెన్స్ ఖర్చులను కూడా భరిస్తుంది.
                • 02. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్

                  02. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్

                  ఇండియన్ మార్కెట్లో కార్ ఇన్సూరెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న వాటిలో బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్. దీనిని 2001 మార్చిలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

                  • ఒక లక్ష రుపాయల వరకు అదనపు సహకారం.
                  • వాహనం యొక్క పాలసీ గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు.
                  • కారు ప్రమాదానికి గురైతే దానిని తరలించడానికి సహకరిస్తారు.
                  • సుమారుగా 1500 కన్నా ఎక్కువగా ఉన్న గ్యారేజీల్లో డబ్బు లేకుండా రిపేరి అందిస్తారు.
                  • క్యాష్ లెస్ సర్వీస్ లేని ప్రదేశాల్లో పాలసీ మొత్తంలో సుమారుగా 75 శాతం వరకు సొమ్మును పాలసీదారులకు అందిస్తారు.
                  • 01. రిలయన్స్ జనరల్ కారు ఇన్సూరెన్స్ కంపెనీ

                    01. రిలయన్స్ జనరల్ కారు ఇన్సూరెన్స్ కంపెనీ

                    రిలయన్స్ దిగ్గజం ఇన్సూరెన్స్ రంగంలోకి 2000 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఐఎస్ఓ 9001:2000 సర్టిఫికేట్ పొందిన మొదటి ఇన్సూరెన్స్ సంస్థ ఇది.

                    • ఉచితంగా రోడ్ సైడ్ అసిస్టెన్స్ కల్పిస్తారు.
                    • పాలసీదారులు నో క్లైమ్ బోనస్‌ను పొందే అవకాశం కూడా కలదు.
                    • దేశవ్యాప్తంగా ఉన్న సుమారుగా 2,300 గ్యారేజిల్లీ క్యాష్ లెష్ సర్వీస్ అందిస్తారు.
                    • కార్ ఇన్సూరెన్స్ కోసం పది ఉత్తమ సంస్థలు

                      కారు ఇన్సూరెన్స్‌లో పాత విధానాన్ని ఫాలో అవుతున్నారా ? అయితే నష్టపోయినట్లే..! మీ కోసం కొత్త విధానం

Most Read Articles

English summary
Read In Telugu: Top 10 Best Car Insurance Companies of 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X