అబ్బా టైరు పంక్చర్ అయ్యింది గురూ..! ఇప్పుడేంటి పరిస్థితి?

By Ravi

టైర్ పంక్చర్.. వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొని ఉన్న సమస్య ఇది. కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలలో టైర్ పంక్చర్ అత్యంత సర్వసాధారణమైనది. టైర్లు సరిగ్గా లేకపోయినా లేక మనం నడిపే రోడ్లు బాగోలేకపోయినా కారు టైర్లు పంక్చర్‌కు గురవుతుంటాయి.

చాలా మంది కొత్త వారికి కారు టైరు పంక్చర్ అయితే, ఆ టైరును ఎలా రీప్లేస్ చేసుకోవాలో తెలిసి ఉండకపోవచ్చు. సాధారణంగా అలాంటి వారు తమ మార్గ మధ్యంలో కారు టైరు పంక్చర్‌కు గురైతే, కంగారుపడిపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాక వారికి, వీరికి ఫోన్ చేసేస్తుండటం లేదా దగ్గర్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారేమోనని ఆరా తీయటం చేస్తుంటారు.

వాస్తవానికి మనం ప్రయాణిస్తున్న కారులో స్పేర్ టైర్ ఉన్నట్లయితే, పంక్చర్ అయిన టైరును మనమే సులువుగా మార్చుకోవచ్చు. అదెలాగో మరియు ఇలా ఫ్లాట్ టైరును మార్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమచాారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పంక్చరైన కారు టైరును మార్చడం ఎలా?

తర్వాతి స్లైడ్‌లలో పంక్చర్ అయిన కారును టైరును ఎలా మార్చాలో మరియు టైరును మార్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.

స్టెప్ 1:

స్టెప్ 1:

మార్గ మధ్యంలో మీ కారు టైరు పంక్చర్ అయిందని మీరు నిర్ధారించుకున్న తర్వాత, రోడ్డుకు పక్కగా సురక్షితంగా ఉన్న ప్రదేశంలోకి మీ వాహనాన్ని తీసుకురావటానికి ప్రయత్నించండి. ఇలా రోడ్డు పక్కగా మీ వాహనాన్ని నిలిపిన తర్వాత హాడర్డ్ లైట్స్ స్విచ్ (అన్ని ఇండికేటర్లు వెలుగుతూ ఆరుతూ ఉండేలా చేసే స్విచ్)ని ఆన్ చేయండి. ఇలా చేయటం వలన మీ వెనుక నుంచి లేదా ముందు నుంచి వచ్చే వాహనాలకు సంకేతం ఇచ్చినట్లు అవుతుంది.

స్టెప్ 2:

స్టెప్ 2:

పంక్చర్ అయిన టైరును మార్చటం కోసం వాహనాన్ని రోడ్డు పక్కగా నిలిపేటప్పుడు, నేల చదునుగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి, అక్కడ కారును నిలపండి. కారును పార్క్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయటమే కాకుండా, వాహనాన్ని గేర్‌లో ఉంచండి. ఇలా చేయటం వలన మీరు మార్చాలనుకున్న టైరు కదలకుండా ఉండటమే కాకుండా, వాహనం దొర్లే ప్రమాదం కూడా ఉండదు.

స్టెప్ 3:

స్టెప్ 3:

వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత బూట్ డోర్ (డిక్కీ) ఓపెన్ చేసి, పంక్చర్ అయిన కారు టైరును మార్చడానికి కావల్సిన స్పేర్స్ (స్టెప్నీ, జాక్, జాక్ రాడ్, వీల్ స్పానర్, ఎమెర్జెన్సీ బ్రేక్‌డౌన్ సేఫ్టీ ట్రయాంగిల్)ను బయటకు తీయండి. ముందుగా.. మీ వాహనం సమస్యలో ఉందని ఇతరలకు అర్థమయ్యేలా చేసేందుకు రిఫ్లెక్టర్ ట్రయాంగిల్‌ను ఓపెన్ చేసి, కారు నుంచి కాస్తంత దూరంలో నిలబెట్టండి.

స్టెప్ 4:

స్టెప్ 4:

పంక్చర్ టైరును ఊడదీసేటప్పుడు మీ దుస్తులకు దుమ్ము అంటకుండా ఉండాలంటే, కారులోని డ్రైవర్ సైడ్ ఫ్లోర్ మ్యాట్‌ని నేలపై పరిచి, దానిపై కూర్చొని లేదా మోకాళ్లపై నిలబడి వీల్ నట్స్ ఊడదీయండి. టైర్ బోల్టులను ఊడదీసేటప్పుడు, ముందుగా వాటిని వ్యతిరేక దిశలో (X) వదులు చేయండి. ఆ తర్వాత జాక్‌ని పైకి లేపండి. ఇలా చేయటం వలన జాక్ పైకి లేపిన తర్వాత టైరు సులువుగా ఊడిపోతుంది. టైరును జాక్‌పై ఉండగా తొలగించడం కొన్నిసార్లు కష్టమవుతుంది.

స్టెప్ 5:

స్టెప్ 5:

పంక్చర్ అయిన టైరు బోల్టులను వదులు చేసిన తర్వాత, కారు క్రింది భాగంలో ధృడంగా ఉన్న ప్రాంతంలో జాక్‌ని ఉంచి, జాక్ హ్యాండిల్‌ను తిప్పుతూ పైకి లేపండి. మీ కారులో జాక్‌ను కరెక్టుగా ఎక్కడ ఉంచాలనే విషయాన్ని ఓ మీ కారు ఓనర్స్ మ్యాన్యువల్‌లో ముద్రించబడి ఉంటుంది. సాధారణంగా వాహన షాషీ క్రింది భాగంలో జాక్‌ని ఉంచడం జరుగుతుంది.

స్టెప్ 6:

స్టెప్ 6:

జాక్‌ని పైకి లేపిన తర్వాత, సురక్షితంగా ఉందో లేదోనని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. పంక్చర్ అయిన టైరుకు మరియు నేలకు మధ్య దాదాపు రెండు ఇంచ్‌ల ఖాలీ ఏర్పడే వరకూ జాక్‌ని పైకి లేపాలి. ఎందుకంటే, పంక్చర్ అయిన టైరుతో పోల్చితే స్పేర్ టైరులో గాలి ఉండటం వలన అది పంక్చర్ అయిన టైరు కన్నా ఎత్తుగా ఉంటుంది కాబట్టి.

స్టెప్ 7:

స్టెప్ 7:

ఇప్పుడు ఇదివరకు పంక్చర్ అయిన టైరు నేలపై ఉన్నప్పుడు వదులు చేసిన నట్లను పూర్తిగా తొలగించి, వాటి దొర్లిపోకుండా ఉండే చోట భద్రంగా ఉంచండి.

స్టెప్ 8:

స్టెప్ 8:

పాత టైరును తొలగించి దాని స్థానంలో కొత్త టైరును అమర్చి నట్ బోల్టులను బిగించుకోవాలి. పంక్చర్ అయిన టైరు విషయంలో ఎలాగైతే నట్ బోల్టులను అపసవ్య దిశలో (X) వదులు చేశామో, ఈ స్పేర్ టైరును అమర్చేటప్పుడు కూడా అలానే అపసవ్య దిశలో బిగించాలి. ఈ దశలో బోల్టులను పూర్తి గట్టిగా బిగించకూడదు. ముందుగా వీటిని చేతితో బిగించడానికి ప్రయత్నించండి.

స్టెప్ 9:

స్టెప్ 9:

ఇలా స్పేర్ వీల్ నట్ బోల్టులను చేతితో బిగించిన తర్వాత, జాక్‌ని డౌన్ చేసి, స్పానర్ సాయంతో బోల్టులను బిగుతుగా బిగించాలి. ఈ సందర్భంలో వీల్ నట్లు పూర్తి బిగుతుగా, సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

స్టెప్ 10:

స్టెప్ 10:

ఇక చివరిగా పంక్చర్ అయిన టైరును మరియు ఇతర సామాగ్రిని కారు బూట్ స్పేస్‌లో సురక్షితంగా భద్రపరచుకొని, టైరు పంక్చర్ వలన బ్రేక్ పడిన మీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించండి.

చివరిమాట

చివరిమాట

టైరు పంక్చర్ అయినప్పుడు మీ కారులో స్పేర్ వీల్ ఉన్నట్లయితే, మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఈ 10 స్టెప్స్‌ని ఫాలో అయిపోవటం వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. అంతేకాకుండా.. మన కారు టైరుని మనమే మార్చుకున్నామన్న సంతృప్తి కూడా కలుగుతుంది.

గమనిక

గమనిక

కార్ మేకర్లు కారుతో పాటుగా ఇచ్చే వీల్ నట్ స్పానర్, కంపెనీ అందించే ఒరిజినల్ వీల్స్‌కి మాత్రమే సూట్ అవుతుంది. ఒకవేళ మీ వాహన చక్రాలను మీరు అప్‌గ్రేడ్ చేసుకొని, టైర్లు/చక్రాలు/బోల్టులను మార్చుకున్నట్లయితే ఈ స్పానర్ పనిచేయకుండా పోయే ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీ టైరుకు ఉండే నట్ బోల్టులకు సరిపోయే స్పానర్‌ను మీ కారులో ఉంచుకోవటం మంచిది.

Most Read Articles

English summary
In this article, we show you step-by-step how a punctured tyre can be changed, in just a matter of 15 minutes and how easy changing a tyre really is.
Story first published: Wednesday, January 7, 2015, 15:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X