'హెల్మెట్' రాద్దాంతం ముగిసింది, ఇప్పుడు ఎల్లో బాక్స్‌తో బాదుడు షురూ...

Written By:

ఎంతో కాలం నుండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించే దిశగా ట్రాఫిక్ పోలుసులు ఎన్నో కొత్త ఐడియాలతో వచ్చారు. మొత్తానికి కాస్త సక్సెస్ సాధించారు. అయితే ఇప్పుడు సిటి రోడ్ల మీద కొత్త ఎల్లో బాక్సులను ముద్రిస్తున్నారు. ఎల్లో బాక్సులతో బాదుడు షురూ చేయడానికి సిటి ట్రాఫిక్ పోలీసులు సిద్దమయ్యారు.

అసలు ఎల్లో బాక్సులు అంటే ఏమిటి ? ఇక్క ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి వంటి వాటి గురించి పూర్తి వివరాలు...

సిగ్నల్స్ జంప్ అయ్యేవారిని ట్రాఫిక్ పోలుసులు టార్గెట్ చేసారు. సిగ్నల్స్ జంప్ అవ్వడం భారీ స్థాయిలో రోడ్లు బ్లాక్ అవడానికి దారితీస్తోంది. అన్ని నగరాలలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ఇప్పుడు ఎల్లో బాక్సులతో ముందు కొచ్చారు.

సిగ్నల్స్ ఉన్న అన్ని కూడళ్లలో రోడ్డుకు మధ్యలో పసుపు రంగు చతురస్త్రాకారంలో పెట్టెలను వేయిస్తున్నారు. ఈ ఎల్లో బాక్స్‌కు ఆవలిపైపున జీబ్రా క్రాసింగ్ దానికి ఆవలి వైపున రెండు తెల్లటి గీతలు యథావిధంగా ఉంటాయి.

ఎల్లో బాక్సులు రోడ్డు మీద ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకున్నారు కదా... మరి ఈ ఎల్లో బాక్స్ రూల్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలోని భారీ ట్రాఫిక్‌ను ఎలా నియంత్రిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం రండి.

సాధారణంగా మనం ముందుకు వెళ్లాల్సిన రహదారి అప్పటికే వాహనాలతో నిండిపోయి ఉంటుంది. అయినప్పటికీ అక్కడ సిగ్నల్స్ మనకు గ్రీన్ లైట్‌ను చూపిస్తుంటాయి. కాబట్టి అలాగే ముందుకు వెళుతాము. కాసేపట్లో మరో మార్గంలో ఉన్న వాహనాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇంకే ముందు అన్ని వాహనాలు సిగ్నల్స్ వద్ద చిక్కుకుపోతాయి. తద్వారా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది.

ఒక మార్గంలో వాహనాలు వెళుతున్నపుడు మరో మార్గం నుండి రెడ్ సిగ్నల్స్ ఉన్నా కూడా వాహనాలు ముందుకు వచ్చేస్తుంటాయి. ఈ సందర్భంలో ప్రమాదాలు సంభవించి పెద్ద పెద్ద కూడళ్లలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇలాంటి సమస్యలకు పరిష్కారమే ఎల్లో బాక్సులు. ఒక వేళ మీరు నగరంలో ఎల్లో బాక్సు జంక్షన్ గమనించినట్లయితే, అక్కడ ఎలా వెళ్లాలి, మరియు ఎలా వెళ్లకూడదు అనేవి చూద్దాం రండి...

నగరంలోని 4-వే రహదారి మీద ఎల్లో జంక్షన్ ఉన్నపుడు మీరు కుడివైపుకు వెళ్లాలనుకుంటే జీబ్రా క్రాసింగ్ దాటి ఎల్లో బాక్స్ జంక్షన్ మీద వాహనాన్ని నిలుపుకోవచ్చు. కుడివైపు మీకు గ్రీన్ సిగ్నల్ లభించగానే ఆ రోడ్డులో వెళ్లవచ్చు. ఇక్కడ ఎలాంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు.

మీకు ఎదురుగా గ్రీన్ సిగ్నల్ ఉన్నపుడు అదే మార్గంలో వాహనాలు ఎక్కువగా ఉండి ఎల్లో బాక్స్ జంక్షన్ వరకు నిండిపోయి ఉంటే మీరు ఎల్లో బాక్స్ మీదకు వెళ్లకుండా ఆ బాక్స్ ప్రారంభమయ్యే చోటే వాహనాన్ని నిలిపాలి. ఒక వేళ ఆ మార్గంలో వాహనాలన్నీ ఫ్రీగా ముందుకు కదులుళుతున్నపుడు, గ్రీన్ సిగ్నల్ ఉంటే మీరు ముందుకు వెళ్లవచ్చు.

దీని ప్రధాన ఉద్దేశం ఆ పసుపు గళ్లలో వాహనాలు నిలవకుండా ఉంటే ఒక మార్గంలో వాహనాలు ఆగిపోయినా మరో మార్గంలో వాహనాలు కదిలే అవకాశం లభిస్తుంది. తద్వారా నగరం మొత్తం మీద ఉన్న ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ నిర్భందాన్ని అదుపు చేయవచ్చు.

ఎలా వెళ్లాలో, ఎల్లో బాక్సులను ఎలా వినియోగించాలో తెలుసుకున్నా కదా... మరి ఇవి ఎప్పుడు ? ఎక్కడ ప్రారమయ్యాయి ? మరియు ఇక్కడ రూల్స్ పాటించకపోతే జరిమానా ఎలా ఉంటుంది వంటి వివరాలు చూద్దాం రండి...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని ప్రధాన కూడళ్లలో ఎల్లో బాక్స్ నియమాన్ని 1967లో ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యింది. విపరీతమైన నగర ట్రాఫిక్‌ను ఈ రూల్ చక్కగా నియంత్రించింది. అనతి కాలంలోనే ఇతర దేశాల్లో కూడా దీనిని అమలు చేయడం ప్రారంభించారు.

పైన చెప్పిన నియమాలు పాటించకుండా ఎల్లో బాక్సుల మీద వాహనాలు నిలిపినపుడు పోలీసులకు పట్టుబడితే టూ వీలర్ల వాడకందారులు రూ. 500 లు మరియు ఫోర్ వీలర్ల వాడకందారులు రూ. 700 లు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ జరిమానాలో తప్పుగా పార్క్ చేసినందుకు రూ. 100 లు, సిగ్నల్ జంప్ అయినందుకు రూ. 100 లు డేంజరస్ డ్రైవింగ్ రూ. 300 లు ( టూ వీలర్) మరియు రూ. 500 లు (ఫోర్ వీలర్) . కలిపి మొత్తం టూ వీలర్లకు 500 మరియు ఫోర్ వీలర్లకు రూ. 700 ల వరకు జరిమానా విధించే విధంగా చట్టం తెచ్చారు.

ఎల్లో బాక్సులున్నా యధావిధిగా వెళ్లడానికి ప్రయత్నించారనుకోండి.... అన్ని ప్రధాన కూడళ్లలో ఇలాంటి వారి కోసం ప్రత్యేక కెమెరాలను అమర్చారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడ లేకపోయినా పాపాలు పెరిగినట్లు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద జరిమానాల చిట్టాలు పెరిగిపోతాయి.

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న ఈ నియమాన్ని అందరూ తప్పకుండా పాటించండి... హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం మరువకండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, March 28, 2017, 15:56 [IST]
English summary
Yellow Box Junctions Explained — Will It Help Solve India's Traffic Jam Crisis?
Please Wait while comments are loading...

Latest Photos