క్యూ3లో మహీంద్రా అండ్ మహీంద్రా లాభం రూ.832 కోట్లు

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 15:08 [IST]
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, డిసెంబర్ 31, 2011తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో రూ.831.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్) నమోదు చేసుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.834 కోట్లుగా ఉన్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది.

డిసెంబర్ త్రైమాసికంలో మహీంద్రా గ్రూప్ ఏకీకృత స్థూల ఆదాయం రూ.10,223.4 కోట్ల నుండి రూ.16,488.4 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31, 2011 నాటికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ 112 అనుబంధ కంపెనీలను, 6 జాయింట్ వెంచర్ కంపెనీలను, 13 సహకార కంపెనీలను కలిగి ఉంది. ఈ ఫలితాలతో మంగళవారం మధ్యాహ్న సమయంలో కంపెనీ షేర్లు 1.10 శాతం పెరిగి 757.55 వద్ద ట్రేడ్ అయ్యాయి.
English summary
Mahindra and Mahindra has posted a consolidated net profit of Rs 831.8 crore for the third quarter ended December 31, 2011. The consolidated net profit stood at Rs 834 crore during the third quarter of the previous financial year.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .