భారత్‌లో కన్నా ముందు శ్రీలంకకు వెళ్లనున్న బజాజ్ ఆర్ఈ60

గురువారం, ఫిబ్రవరి 23, 2012, 8:00 [IST]
ద్విచక్ర వాహన మార్కెట్లో దేశపు ద్వితీయ అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో లిమిటెడ్ (బిఏఎల్) ఇటీవల జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2012లో ఆవిష్కరించిన చేసిన ఫోర్-వీలర్ (కారు కాదండోయ్, జస్ట్ ఫోర్-వీలర్ మాత్రమే) "బజాజ్ ఆర్ఈ60"ను భారత మార్కెట్లో కన్నా ముందుగా శ్రీలంక మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీనిచ్చే బజాజ్ ఆర్ఈ60 చిన్న కారులో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు తీస్తుంది. బజాజ్ ఆర్ఈ60ను అభివృద్ధి చేయడానికి కంపెనీ నాలుగేళ్లు శ్రమించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ త్రికచ్ర వాహనాల (ఆటోరిక్షాలు) స్థానాన్ని ఇది భర్తీ చేయగలదు.

బజాజ్ ఆటో ప్రస్తుతం శ్రీలంకలో సుమారు 10,000 లకు పైగా ఆటోరిక్షాలను విక్రయిస్తుంది. ఇప్పటికే శ్రీలంకకు చేరిన టాటా నానో టాక్సీగా మారి అక్కడున్న ఆటోరిక్షా వాళ్ల కడుపులు కొడుతోంది. గతంలో దీని గురించి పెద్ద ఎత్తున నిరసనలే చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల్లో బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్ ఇండియన్ మార్కెట్లో కన్నా శ్రీలంక మార్కెట్లోనే వేగంగా దూసుకువెళ్లే అవకాశం ఉంది.

బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్ ఫీచర్లు:
* 200సీసీ ఇంజన్
* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది, గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)
* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)
* కారు పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.
* కారు మొత్తం బరువు: 400 కేజీలు
* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు
* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు
* ధర రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్)
English summary
Bajaj Auto is planning to begin commercial sales of its RE 60 four wheeler first in Sri Lanka instead of India. Reports say the company's MD Rajiv Bajaj is considering the option of exporting the RE 60 to Sri Lanka as he feels the market there is ideal for such a vehicle.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .