టాటా మోటార్స్ చీప్ కారు టాటా నానోను మహారాష్ట్ర పోలీసులు కాప్ కారుగా ఉపయోగించనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజా గోవా పోలీసులు కూడా మహారాష్ట్ర పోలీసులను ఫాలో అవుదామని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గోవాలో కూడా టాటా నానో కారు కాప్ (పోలీసు) కారుగా ఉపయోగించాలని గోవా పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలో పెట్రోలింగ్ కోసం పోలీసులు టాటా నానో కారును ట్రైల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బహుశా ఈ ట్రైల్ రన్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే అత్యధికంగా పర్యాటకులు సందర్శించే గోవా ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గోవా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరుకైన నగర వీధుల్లో పెట్రోలింగ్ చేయడానికి టూ-వీలర్‌కు బదులు టాటా నానోను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మోటార్‌సైకిల్‌పై అయితే, ఒక్కరు లేదా ఇద్దరు పోలీసు అధికారులు మాత్రమే ప్రయాణించే వీలుంది. అదే నానో కారులో అయితే, నలుగురు పోలీసుల వరకూ పెట్రోలింగ్‌లో పాల్గొనవచ్చు. ఎటువంటి వాతావరణ పరిస్థితులలో అయినా పెట్రోలింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది.
అయితే, ఇది ఇరుకైన రోడ్ల వరకూ సరిపోతుంది. కానీ హైవేపై వెళ్లే దొంగలను పట్టుకోవాలంటే మాత్రం దీని పవర్ సరిపోదేమో. ఏదేమైనప్పటికీ.. టాటా నానోలో రిఫ్రెష్ట్ వేరియంట్ (2012 వెర్షన్)ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుతం నానో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆకట్టుకునే మైలేజ్, దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఇది సిటీ రోడ్లకు చక్కగా సరిపోతుంది.